కమెడీ దర్శకుడికి ఛాన్సిచ్చిన కింగ్‌

మిగతా కథానాయకులకంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు నాగార్జున. అందరూ స్టార్‌ దర్శకుల వెంట పడితే.. నాగ్‌ మాత్రం ప్రతిభావంతులను ప్రోత్సహిస్తుంటారు. ఈమధ్య ఆయన దృష్టి కామెడీ దర్శకులపై పడింది. Advertisement వీరూపోట్ల, శ్రీనివాసరెడ్డి, వీరభద్రమ్‌..…

మిగతా కథానాయకులకంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు నాగార్జున. అందరూ స్టార్‌ దర్శకుల వెంట పడితే.. నాగ్‌ మాత్రం ప్రతిభావంతులను ప్రోత్సహిస్తుంటారు. ఈమధ్య ఆయన దృష్టి కామెడీ దర్శకులపై పడింది.

వీరూపోట్ల, శ్రీనివాసరెడ్డి, వీరభద్రమ్‌.. వీళ్లంరి భుజం తట్టారాయన. ఇప్పుడు మరో కామెడీ దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఆయనే జి.నాగేశ్వరరెడ్డి. దేనికైనా రెడీతో ఓ విజయం తన ఖాతాలో వేసుకొన్నారాయన. ఇప్పుడు మనోజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. 

నాగార్జునతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారట జి నాగేశ్వర్‌రెడ్డి. ఓ కథ కూడా సిద్ధం చేసుకొన్నారని సమాచారమ్‌. ‘మనం’ తరవాత నాగ్‌ వేరే సినిమా ఏదీ ఒప్పుకోలేదు. ఆ తరవాత నాగేశ్వరరెడ్డి సినిమా ఉండే అవకాశాలన్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.