ఎంసిఎ లో బస్సుల దందా

ఆంధ్ర, తెలంగాణలో ప్రయివేటు బస్సుల దందా తెలిసిందే. రాజకీయ నాయకులు, ట్రాన్స్ పోర్ట్ ఆఫరేటర్లు కలిసిపోయి, రకరకాలుగా పన్నులు ఎగ్గొట్టడం, ఇతరత్రా వ్యవహారాలు జనాలకు పరిచయమే. అప్పుడప్పుడు ప్రభుత్వాలు కన్రెర్ర చేయడం, మళ్లీ సైలెంట్…

ఆంధ్ర, తెలంగాణలో ప్రయివేటు బస్సుల దందా తెలిసిందే. రాజకీయ నాయకులు, ట్రాన్స్ పోర్ట్ ఆఫరేటర్లు కలిసిపోయి, రకరకాలుగా పన్నులు ఎగ్గొట్టడం, ఇతరత్రా వ్యవహారాలు జనాలకు పరిచయమే. అప్పుడప్పుడు ప్రభుత్వాలు కన్రెర్ర చేయడం, మళ్లీ సైలెంట్ అయిపోవడం మామూలే. ఇప్పుడు ఈ పాయింట్ ను ఎంసిఎ సినిమాలో టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంసిఎ సినిమాలో భూమిక రవాణాశాఖలో పని చేసే అధికారిణిగా కనిపిస్తారు. ఒకే పర్మిట్ తో ఎక్కువ బస్సులు తిప్పడం వంటి వ్యవహారాలు అడ్డుకుంటారు. దాంతో ఆమెను అడ్డం తొలగించుకోవాలని చూస్తారు. వాళ్లకు హీరో నాని అడ్డం పడడం వంటి సంగతులు వుంటాయని తెలుస్తోంది.

పండగ సీజన్ వస్తే చాలు ప్రయివేట్ బస్సుల వ్యవహారాలు పైకి వస్తాయి. ఈసారి కూడా పండగకు కాస్త ముందుగానే ఈ సినిమా ద్వారా మరోసారి ఆ వ్యవహారాలు బయటకు వస్తాయన్నమాట.