తమిళంలో అజిత్ సినిమాలకి ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అజిత్ తాజా చిత్రం 'వివేగం' సినిమా ఏ స్థాయిలో వసూళ్ళను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా శివ డైరెక్షన్లో హిట్టు మీద హిట్టు కొడ్తోన్న అజిత్, తాజాగా అజిత్ దర్శకత్వంలోనే 'విశ్వాసం' పేరుతో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం విదితమే.
ఈ 'విశ్వాసం' సినిమా కోసం అజిత్, హీరోయిన్గా అనుష్క పేరుని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అజిత్, అనుష్క కాంబినేషన్లో 'ఎంతవాడుగానీ' పేరుతో (తమిళంలో 'ఎన్నయ్ అరిందాల్') ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో త్రిష మరో హీరోయిన్గా నటించింది. అయితే అదొక థ్రిల్లర్ మూవీ. అజిత్ – అనుష్క మధ్య పెద్దగా కెమిస్ట్రీ వర్కవుట్ అవలేదు కూడా.
ఈసారి మాత్రం, అజిత్ – అనుష్క మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అవుతుందట. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అనే ప్రచారం జరుగుతోంది. అజిత్ సినిమాలంటే క్లాస్ టచ్ మాత్రమే కాదు, వీర లెవల్లో మాస్ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. పైగా, ఈసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ తరహాలో 'విశ్వాసం' సినిమాని శివ తెరకెక్కించబోతున్నాడట.
అన్నట్టు, అనుష్క ఈ మధ్య బాగా సన్నబడ్డ విషయం విదితమే. 'భాగమతి' సినిమాలో నటిస్తోందిప్పుడు అనుష్క.