బీద అరుపులు.. కుల మీడియా కథలు

జగన్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేస్తోంది.. వేల కోట్లు జల్లేస్తోంది అంటూ యాగీ మొదలుపెట్టింది ‘కుల’ మీడియా. డబ్బులు జల్లకుండా ఎన్నికలు జరపడం కష్టం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నే అంగీకరించారు.…

జగన్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేస్తోంది.. వేల కోట్లు జల్లేస్తోంది అంటూ యాగీ మొదలుపెట్టింది ‘కుల’ మీడియా. డబ్బులు జల్లకుండా ఎన్నికలు జరపడం కష్టం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నే అంగీకరించారు.

డబ్బు ఖర్చు చేయవద్దు అని తాను చెప్పనని, అవసరమైన మేరకు ఖర్చు చేసుకోవాలని కూడా ఆయనే అన్నారు. ఇటీవల తూర్పు, ఉత్తరాంధ్రలో పవన్ పర్యటించినపుడల్లా జనాలకు డబ్బులు ఇవ్వకుండా వచ్చారా? విలేజ్ ల్లోకి వెళ్లి మహిళలకు ఎంత ఇచ్చి తీసుకువచ్చారు, మగవారికి ఎంత వచ్చి తీసుకువచ్చారు అన్నది ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుంది.

తెలుగుదేశం కూటమి తాడేపల్లి గూడెంలో సభ చేసినపుడు కార్లు, బస్ లకు ఎంత ఖర్చు చేసారు, వాటిల్లో ప్రయాణించిన వచ్చిన వారికి ఎంత ఇచ్చారు. ఈ సంగతి పార్టీ జనాలకు తెలియదా?

ఇప్పుడు ఈ కుల మీడియా ఏమంటోంది వేల కోట్లు ఖర్చు చేస్తోంది వైకాపా అంటోంది. అదే టైమ్ లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జనాలు విరాళాలు ఇవ్వాలంటూ అపీల్ వచ్చింది. పార్టీ దగ్గర డబ్బులు లేవు, జనాలే విరాళాలు ఇవ్వాలని తెలుగుదేశం చెబుతోంది.

ఇదంతా పెద్ద స్కెచ్ అని అర్థం అయిపోతోంది. ఇటు తమ దగ్గర డబ్బులు లేవు అని తెలుగుదేశం బీద అరుపులు అరవడం, అదే టైమ్ లో వైకాపా వేల కోట్లు ఖర్చు చేస్తోందని తేదేపా అను కుల సామాజిక మీడియా గగ్గోలు మొదలైంది. అంటే ఇదంతా జనాల్లోకి వారు అనుకునే ఓ అభిప్రాయాన్ని పంపించడం కోసం చేస్తున్న కుట్ర తప్ప మరేంటీ?

వైకాపా వేల కోట్లు కొల్ల గొట్టేసింది. వేల కోట్లు ఖర్చు చేసి గెలవాలనుకుంటోంది. పాపం, తెలుగుదేశం దగ్గర డబ్బులు లేవు. అన్నదే జనాల్లోకి ఈ కుల మీడియా పంపించాలనుకుంటున్న సందేశం. నిజానికి అధికారంలో వున్న వైకాపాతో దాదాపు సమానంగా ఎలక్ట్రోల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీ సంపాదించిన సంగతిని ఈ మీడియా చాలా కన్వీనియేంట్ గా దాచేసింది. ఆ డబ్బులు అన్నీ పక్కన పెట్టి, మళ్లీ జనాల దగ్గర డబ్బులు దండడం మొదలుపెట్టింది.

ఈ వన్ షాట్ టూ బర్డ్స్ టైపు పన్నాగంతో ప్రజలను సైకలాజికల్ గా డీల్ చేయాలని చూస్తోంది.