గంజాయి రహిత విశాఖ

ఈ కోరిక మేధావులతో పాటు అందరిలోనూ ఉంది. విశాఖ రూరల్ అంతా గంజాయ్ మాఫియా ప్రభావం ఉంటే కాస్మోపాలిటిన్ కల్చర్ ఉన్న విశాఖ సిటీలో డ్రగ్స్ ప్రభావం ఉంది ఇది ఈ రోజుది కాదు…

ఈ కోరిక మేధావులతో పాటు అందరిలోనూ ఉంది. విశాఖ రూరల్ అంతా గంజాయ్ మాఫియా ప్రభావం ఉంటే కాస్మోపాలిటిన్ కల్చర్ ఉన్న విశాఖ సిటీలో డ్రగ్స్ ప్రభావం ఉంది ఇది ఈ రోజుది కాదు చాలా కాలంగా సాగుతోంది. గంజాయ్ పంట సాగు వెనక చాలా మంది పెద్దల హస్తాలు ఉన్నాయని కూడా ప్రచారంలో ఉంది.

అదే విధంగా డ్రగ్స్ మాఫియా వెనక కూడా కీలక శక్తులు ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఇంకా విశాలంగా చెప్పుకోవాలీ అంటే కేవలం విశాఖకే డ్రగ్స్ సమస్య లేదు మహా నగరాలలో చాలా ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. దీని వెనక ఉన్న బడా వ్యక్తులు శక్తులు కూడా రాజకీయాలతో పెనవేసుకుపోయిన మూలాలు కలిగినవే. ఈ నేపధ్యంలో ఉమ్మడి విశాఖ నుంచి తొలిసారి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత తన తొలి లక్ష్యం ఏంటో చెప్పారు గంజాయి రహిత విశాఖ అని ఆమె అన్నారు. అలాగే డ్రగ్స్ లేని విశాఖ అని చెప్పారు.

పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లుగా హోం మంత్రి ప్రకటించారు. రాత్రి తొమ్మిది తరువాత ఏ కారణం లేకుండా రోడ్ల మీద సంచరించే యువత విషయంలో ఆచూకీ పెట్టాలని కోరారు. అదే విధంగా డ్రగ్స్ అన్న మాట విశాఖ వినిపించకుండా చేయాలని కోరారు. ఈ మాదక ద్రవ్యాల రవాణా సరఫరా వెనక ఉన్నది ఏ రాజకీయ పార్టీ అయినా ఆఖరుకు తన పార్టీ అయినా చర్యలకు వెనకాడరాదని కొత్త హోం మంత్రి ఆదేశించారు.

ఇది అంతా హర్షించతగిన విషయమే. ముక్కుపచ్చలారని యువత గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల ప్రభావానికి లోను అవుతోంది. దాని వల్ల ఇల్లూ ఒల్లూ గుల్ల కావడమే కాదు బంగారం లాంటి భవిష్యత్తు పోతోంది. అయితే ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదు.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ మాఫియా ముఠాలు వారికి దగ్గరగా ఉంటారు. అంతే కాదు రాజకీయ శక్తులు కూడా ఉంటూ వస్తున్నాయి. అయినా హోం మంత్రి స్థాయిలో తలచుకుంటే చర్యలు కఠినంగానే ఉంటాయి. అలాంటి రోజులు రావాలని విశాఖ జనాలు కోరుతున్నారు.