సాక్ష్తాత్తు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం వాయిదా వేసిందని చెప్పారు. అంతే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అయితే దీని మీద సీఐటీయూ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన పకటన చేయించాలని వారు కోరుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్ట ఇవ్వాల్సింది కేంద్రమే అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మదిలో ప్రైవేటీకరణ అన్నది ఇంకా ఉందని అది ఏ సమయంలోనైనా అమలు జరిగే అవకాశాలు ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
అందువల్ల కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని అధికార పూర్వకమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు ఏమి చెప్పినా తుది నిర్ణయం మాత్రం కేంద్రమే తీసుకుంటుంది కాబట్టి కేంద్రమే జవాబుదారీతో కూడిన ప్రకటన చేయాలన్నది ఉక్కు ఉద్యమ కారుల డిమాండ్ గా ఉంది. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉందా అన్నది తేలాల్సిన విషయం.