ఇండస్ట్రీకొచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది రాశిఖన్నా. ఆమె నటించిన తొలి సినిమా ఊహలు గుసగుసలాడే విడుదలై సరిగ్గా పదేళ్లయింది. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాతోనే దర్శకుడిగా మారాడు. నాగశౌర్య హీరోగా నటించాడు.
హీరోయిన్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది రాశిఖన్నా. పదేళ్లుగా తనను ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఈ బ్యూటీ.. ఆ సినిమా నుంచి “ఏ సందేహం లేదు” అనే పాట పాడి అందర్నీ అలరించింది.
పదేళ్లు గడిచినా ఇప్పటికీ తనకు అవకాశాలొస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది రాశీ ఖన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, తనకు ఇది చాలని అంటోంది. రోజు ఏదో ఒక సినిమా సెట్స్ లో ఉండడమే తనకు ఇష్టమని, విహార యాత్రలు మిస్సవుతున్నప్పటికీ పెద్దగా బాధలేదని అంటోంది.
రీసెంట్ గా బాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశీఖన్నా. సినిమా ఫ్లాప్ అయినా, తమన్నాతో కలిసి ఆమె చేసిన సాంగ్ పెద్ద హిట్టయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తున్న రాశి, తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ఓ మూవీ చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉంది.