వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఫొటోలు రిలీజ్

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికొలాయ్ సచ్ దేవ్ పెళ్లి తంతు పూర్తయింది. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఓవైపు ఇంత జరిగినప్పటికీ,…

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికొలాయ్ సచ్ దేవ్ పెళ్లి తంతు పూర్తయింది. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఓవైపు ఇంత జరిగినప్పటికీ, వరలక్ష్మి పెళ్లి ఫొటోలు మాత్రం రిలీజ్ అవ్వలేదు.

ఎట్టకేలకు ఆమె పెళ్లి ఫొటోలు విడుదలయ్యాయి. థాయ్ లాండ్ లోని క్రాబిలో ఉన్న బీచ్ రిసార్ట్ లో ఈ జంట పెళ్లి జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.

తాజాగా రిలీజైన పెళ్లి ఫొటోల్లో 2 పద్ధతుల్లో వీళ్లు వివాహం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ముందుగా హిందూ సంప్రదాయంలో వరలక్ష్మిని పెళ్లాడాడు నికొలాయ్. ఆ తర్వాత క్రిస్టియన్ సంప్రదాయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీటికి సంబంధించిన స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.

థాయ్ లాండ్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది వరలక్ష్మి. బహుశా అందుకే థాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాటుచేసినట్టున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని ఇదివరకే ప్రకటించింది వరలక్ష్మి.

ధనుష్ 50వ చిత్రం రాయన్ లో కీలక పాత్ర పోషించింది వరలక్ష్మి. మరికొన్ని రోజుల్లో ఆ మూవీ ప్రమోషన్స్ లో ఆమె జాయిన్ అవుతుంది.

Click Here More Pics