బొత్సా… నీతుల‌కు ఓట్లు రాలుతాయా!

ఎవ‌రెన్ని చెప్పినా అంతిమంగా ప్ర‌జాప్ర‌తినిధులు కోరుకునేది డ‌బ్బు మాత్ర‌మే అని అంద‌రికీ తెలుసు

విశాఖ‌లో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడి మొదలైంది. త‌మ‌కు 600, కూట‌మికి కేవ‌లం 200 మంది స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల బ‌లం వుంద‌ని, పోటీ ఎలా పెడ‌తార‌ని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. అలాగే ఓటుకు రేటు క‌డుతున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించ‌కుంది. ఎన్నిక‌లంటేనే బేరాల‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

అధికారంలో ఉన్న పార్టీ స‌హ‌జంగానే గెలుపే ధ్యేయంగా ఎంత డ‌బ్బు అయినా ఖ‌ర్చు పెట్ట‌డానికి వెనుకాడ‌దు. విశాఖ‌లో స్థానిక ఎమ్మెల్సీ పోరు బ‌రిలో అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించ‌డంతో స‌హ‌జంగానే రాజ‌కీయం రంజుగా మారింది. వైసీపీ నేత‌లు చెబుతున్న‌ట్టు ఆ పార్టీకి స్థానిక సంస్థ‌ల్లో మంచి బ‌ల‌మే వుంది. కానీ పార్టీకి నిబ‌ద్ధ‌త‌గా ప‌ని చేసేవాళ్లు ఎంద‌ర‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్న త‌రుణంలో మాజీ మంత్రి బొత్స చెబుతున్న గౌర‌వం లాంటి ఉన్న‌తాశ‌యాలు ప‌ని చేస్తాయా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఇవాళ న‌ర్సీప‌ట్న నియోజ‌క‌వ‌ర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స‌భ్యుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో బొత్స మాట్లాడుతూ డ‌బ్బుతో ఓట్లు కొనాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌జాస్వామ్యాన్ని న‌మ్మిన వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్ అయితే, ఖూనీ చేసిన నాయ‌కుడు చంద్ర‌బాబు అని బొత్స ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

ఎవ‌రెన్ని చెప్పినా అంతిమంగా ప్ర‌జాప్ర‌తినిధులు కోరుకునేది డ‌బ్బు మాత్ర‌మే అని అంద‌రికీ తెలుసు. ఆ విష‌యం కాకుండా, నీతులు గురించి చెబితే ప‌ట్టించుకునే ప‌రిస్థితి వుండ‌దు. ఆ కోణంలో బొత్స ఆలోచిస్తేనే వైసీపీ అభ్య‌ర్థిగా గెలుపొందుతారు. ఆత్మ‌గౌర‌వం, నిబ‌ద్ధ‌త‌, నిజాయితీ అని సూక్తులు చెబితే, ఫైన‌ల్‌గా ఫ‌లితం ఎలా వుంటుందో బొత్స‌కు తెలియంది కాదు.

నిజంగా విశాఖ‌లో వైసీపీ గెల‌వాల‌ని అనుకుంటే, కూట‌మికి కొనుగోలు అవ‌కాశం లేకుండా, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల కోరిక‌ల్ని తీర్చ‌డం ఒక్క‌టే మిగిలింది. రాజ‌కీయాల్లో ఇంత‌కంటే చెప్పుకోడానికి ఏమీ మిగ‌ల్లేదు. నీతుల‌కు ఓట్లు రాలే కాలం పోయింది.

32 Replies to “బొత్సా… నీతుల‌కు ఓట్లు రాలుతాయా!”

  1. జగన్ అన్న తాడేపల్లి లో ఉంటే ఏడుపు

    జగన్ అన్న ఢిల్లీ కి పోతే ఏడుపు

    జగన్ అన్న బెంగుళూరు కి పోతే ఏడుపు

    జగన్ అన్న లండన్ కి పోతే ఏడుపు

    జగన్ అన్న పులివెందులకు పోతే ఏడుపు

    జగన్ అన్న ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఏడుపు

    జగన్ అన్న ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏడుపు

    జగన్ అన్న ప్రెస్ మీట్ పెడితే ఏడుపు

    జగన్ అన్న అసెంబ్లీ కి రాకపోతే ఏడుపు

    జగన్ అన్న అసెంబ్లీ కి వెళితే ఏడుపు

    జగన్ అన్న కార్యకర్తలతో భేటీ అవ్వకపోతే ఏడుపు

    జగన్ అన్న కార్యకర్తలతో భేటీ అయితే ఏడుపు

    జగన్ అన్న నాయకులతో భేటీ అయితే ఏడుపు

    జగన్ అన్న నాయకులతో భేటీ అవ్వకపోతే ఏడుపు….

    అరె ఏంట్రా మాకు ఈ కర్మ… ఎప్పుడు చూడు జగన్ అన్న మీద ఏడవడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా చేస్తున్నారా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద ద్రుష్టి పెట్టి రాష్ట్రం అభివృద్ధి కి దోహదం చేయండి .. ఎంతసేపు జగన్ అన్న మీద ఏడిస్తే రాష్ట్రానికి ఏమి ఒరగదు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    అలాగే మన సోషల్ మీడియా లో పదే పదే జగన్ అన్న మీద ఏడ్చే వాళ్ళకి కూడా 🤦🤦🤦🤦

  2. Oka mp ని అర్థరాత్రి తీసుకెళ్ళి పోలీసు లతో చితక కొట్టించు ఆ లయివ్ ను వీడియో లు తీ సి. అన్నదించడమే ప్రజాస్వామ్యం

  3. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి.రెండు లక్ష కోట్ల దోపిడీ.

    అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

    లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 

    5000 కోట్లుమురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

    1. చెత్త వెధవల్లారా మిమ్మల్ని చెప్పుతో కొట్టిన గాని మీకు సిగ్గు రాలేదు రా

    2. చెత్త వెధవల్లారా మిమ్మల్ని చె ప్పుతో కొ ట్టిన గాని మీకు సి గ్గు రాలేదు రా

      1. correct . కొట్టాలి

        ఒక్క C.M కుర్చి కొసం 600 వందలా అబద్దలు  చెప్పినా వాళ్ళను కొట్టాలి …  చె ప్పుతో

    3. అమరావతి అంతా స్మశానం అన్నారు కదా.. మునిగిపోతుంది అన్నారు కదా..

      అయినా.. వేలకు వేలు కోట్లు.. 200%, 300% లాభాలు వచ్చేసాయా.. వింతే కదా..

      మీరు చెప్పే అబద్ధాలకు.. రాసే రాతలకు సంబంధం లేదు.. సింక్ అవడం లేదు.. అందుకే వెర్రిపప్పలుగా మిగిలిపోతున్నారు..

      1. అయినా.. వేలకు వేలు కోట్లు.. 200%, 300% లాభాలు వచ్చేసాయా.. వింతే కదా..

        ఎవరికి వచ్చినా 200%-300% లాభాలు. అమరావతిలో కె-బ్యాచ్ కా. proove it 
        1. ఆ లెక్కలు మీరే చెప్పారు శుద్ధ పూస గారు.. నువ్వే కన్ఫ్యూషన్ లో పడిపోతున్నట్టున్నావు..

          అయినా అబద్ధాలు మింగేసిన మీకు ఇంకొన్ని అబద్ధాలు వండటం .. ఏమంత కష్టము కాదులే..

          ఇంతకీ 36 మంది టీడీపీ వాళ్ళ చేతుల్లో కుక్కసావు సచ్చిన వారి పేర్లు ఊర్లు దొరికాయా..

  4. ఒక్క డ్రామోజీ ఫిలిం సిటీ – 30 వేల కోట్లు ( 2,500 వేల ఎకరాలో )

    ఎంత పచ్చళ్ళు అమ్ముకున్న 40 ఇయర్స్ ఇంతా సంపాయించ లేరు

  5. నవయుగ నిర్మాణ సంస్థ యజమాని డ్రామోజీ డి . పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని . 10-15 వేల కోట్లు దోచుకుంటున్నాడు.

    అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వేళ్ళునపుడు, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు

  6. అప్పుడు అధికారం మత్తు లో అటు వాళ్ళని మీ వైపు లాక్కున్నారు….ఆలా అదికారాన్ని వాళ్ళకి మీరే రుచి చూపించారు ..ఇప్పుడు బొమ్మ మీకు తిరగబడింది అని వాళ్ళకి అధికారం మీద యావ తగ్గించుకో మంటే ఎలా

  7. రాజ్యసభ శాసన మండలి సభ్యులను కేవలం విద్యావంతులు మాత్రమే ఎన్నుకొనే విధం గ ఉండాలి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ సభ అజమాయిషీలో ఉండాలి

Comments are closed.