ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానాన్ని తాము చేజిక్కించుకోవడం కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అత్యాశకు పోతోందా? తమకు చాలినంత బలం లేకపోయినప్పటికీ కూడా కుయుక్తులు, కుట్ర వ్యూహాలు అమలు చేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని వక్రమార్గాలలో ఆశపడుతోందా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి!
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓట్లలో నాలుగో వంతు బలం కూడా స్థిరంగా తెలుగుదేశం పార్టీకి లేకపోయినప్పటికీ, కూటమి తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలని ఆలోచించడం వారి కుట్ర రాజకీయానికి ఒక నిదర్శనం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. టిడిపికి 200 సీట్ల బలం మాత్రమే ఉంది. మిగిలినవన్నీ వైసిపి కార్పొరేటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీలు మాత్రమే! అయినా సరే సాహసించి తమ పార్టీ అభ్యర్థిని పోటీ చేయించాలని చూస్తున్నారు. కేవలం ఫిరాయింపు ఓట్ల ద్వారా మాత్రమే వీరిని దక్కించుకోవాలని టిడిపి ఆశపడుతుండడం గమనార్హం. ఎన్డీఏ కూటమి దిగజారుడు రాజకీయాలకి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక ఒక నిదర్శనం లాగా నిలుస్తోంది.
విశాఖ కార్పొరేషన్ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి కుట్ర రాజకీయాలు కొంతమేరకు ఫలితం ఇస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికలలో విశాఖలోని సీట్లు అన్నింటినీ కూడా అధికార కూటమి గెలవడం జరిగింది. ఈ కారణంగా ఆ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. కాస్త మెత్తగా కనిపించిన వారిని భయపెట్టి ఇతరులను ప్రలోభ పెట్టి కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏడుగురు కార్పొరేటర్లు ఇటీవల తెలుగుదేశం లో చేరగా, తాజాగా ఐదుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరడం జరిగింది. కార్పొరేటర్లు వచ్చి చేరినందుకే పవన్ కళ్యాణ్ మహదానంద పడిపోతూ చిన్న ప్రసంగం కూడా చేశారు.
అయితే 12 మంది చేరగానే ఎన్నికకు పోటీ చేయాలని అనుకోవడం అనేది కేవలం అత్యాశగా పలువురు అభిప్రాయపడుతున్నారు. టిడిపి కూటమి అభ్యర్థి నెగ్గాలంటే కనీసం ఇంకా 200 మంది వైసీపీ నుంచి ఫిరాయించాల్సిన అవసరం ఉంది.
అయితే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల మీద సమానమైన అధికారం, పట్టు ఉన్న బొత్ససత్యనారాయణకు పార్టీ క్యాడర్ మీద కూడా అంతే పట్టు ఉంది. ఆయనను పక్కన పెట్టి పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార కూటమి వైపు ఫిరాయిస్తారనుకోవడం భ్రమ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాలలో టిడిపి కుట్రలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
ఉత్తరాంధ్ర మూడు జిల్లాలలో సమాన పట్టు అధికారం ఉన్న బొత్స….. అందుకేనా ఫ్యామిలీ మొత్తం….. హ….
నిరాత తగలెయ్య…..
Ikanainaa mararaa gudda andhraa…..
11 మటుకు గెలిచి, 18 గెలిచిన అర్వాత అడగటం దురాశ కాదా? ప్రజాస్వామ్యం లో పోటీ చెయ్యకూడదు అనే హక్కు నీకెక్కడ ఉంది జిఏ?
పట్టు లేదు పట్టువము లేదు… అని పలువురు అనుకుంటున్నారు..
Vc available 9380537747
Vc estanu 9380537747
అత్యాశ : ఒక సాధారణ MLA సీఎం స్థాయి సెక్యూరిటీ అడగడము
బాడి ఉంటేనే బయటకు వచ్చే బో సి డి కే కష్టం అంటున్నారు ..