వైసీపీతో కటీఫ్‌కు మరో తాజా మాజీ రెడీ!

రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయ నాయకులు అని ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. వీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాపతు నాయకులు. అధికార ఉన్న పార్టీలోకి బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లాగా చేరుకుంటూ…

రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయ నాయకులు అని ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. వీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాపతు నాయకులు. అధికార ఉన్న పార్టీలోకి బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లాగా చేరుకుంటూ ఉంటారు. ప్రజలు ఛీత్కరించుకుంటారనే భయం, వెరపు వీరికి ఉండవు.

తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఒక్కటే లక్ష్యంగా వారు వ్యవహరిస్తుంటారు. అలాంటి నాయకులు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది గనుక.. ఆ పార్టీని వీడిపోతున్నారు. తాజాగా ఈ వరుసలోకి తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా చేరుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా మీడియాకు తెలియజేశారు. అధికారిక ప్రకటన బుధవారం చేస్తారట!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. అవకాశవాదులైన కొందరు నాయకులు పార్టీని వీడిపోతున్నారు. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. వైసీపీని వీడుతున్న నాయకుల సంఖ్య రకరకాలుగా ఉంటున్నప్పటికీ.. తాజా మాజీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరబోతోంది.

ఇప్పటికే గుంటూరు వెస్ట్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మద్దాళి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పార్టీని వీడిపోయారు. వీరిలో మద్దాలి గిరికి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కకపోగా, రోశయ్య గుంటూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. జగన్ ఎంపీగా అవకాశం ఇచ్చినా గెలవలేక.. పార్టీమీద నిందలు వేసి వారు వెళ్లిపోయారు. ఆ క్రమంలో పిఠాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

పిఠాపురంలో సిటింగ్ పెండెంకు టికెట్ ఇవ్వకుండా, వంగా గీతను వైసీపీ మోహరించింది. అప్పుడే పెండెం అసంతృప్తితో పార్టీ వీడాలనుకున్నారు. కానీ, జగన్ బుజ్జగించడంతో ఆగిపోయారు. అయినా.. ఎన్నికల్లో మాత్రం పార్టీకి చురుగ్గా పనిచేయలేదు. అంటీముట్టనట్టు ఉండిపోయారు. తీరా ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా ప్రకటించబోతున్నారు.

అయితే పిఠాపురంలో స్థానికంగా ఒక పుకారు వినిపిస్తోంది. పెండెం దొరబాబు.. ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ తో లాలూచీ పడ్డారని, అందువల్ల మాత్రమే ఆయన అంత మెజారిటీతో గెలిచారని ప్రజలు అంటున్నారు. పెండెం వర్గం మొత్తం లోపాయికారీగా జనసేనకు అనుకూలంగా పనిచేసినట్టు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే పెండెం దొరబాబు.. జనసేనలో చేరే అవకాశం ఉన్నదని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.

బుధవారం రాజీనామా నిర్ణయంతో పాటూ.. భవిష్యత్ కార్యచరణ కూడా ప్రకటిస్తానని పెండెం దొరబాబు మీడియాకు చెప్పడం విశేషం.

25 Replies to “వైసీపీతో కటీఫ్‌కు మరో తాజా మాజీ రెడీ!”

  1. మన పార్టీ పుట్టుకే అవకాశవాద రాజకీయం. తనని సీఎం చేయలేదనే కదా బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంది.

    1. అలా బయటికి రాకూడదు పార్టీ పెట్టిన వాళ్ళని బయటకి పంపి పార్టీ ని కబ్జా చెయ్యాలి

    2. బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన పార్టీ అవకాశ వాద పార్టీ అయితే , వెన్నుపోటు పొడిచి లాక్కొన్న పార్టీ ని నడుపుతున్న వ్యక్తులున్న పార్టీ ని ఏమనాలో

  2. నీ ‘నాలాయక్’ నాయకుడు జగన్ ఎవరో ఏదో చేసేస్తారెమో అన్న భయాందోళన స్టేజి లొ ఉన్నాడు ఇప్పుడు, ముందు వెళ్లి వాడికి ధైర్యం చెప్పు. మిగతావి బెల్లం ఈగ కథ తరువాత ఆవే సర్దుకుంటాయిలే.

  3. మా అన్నయ్య స్థాయి మోడీతోనో కేసిఆర్ తోనో లాలూచీ పడ్తాడు..వచ్చే ఎన్నికల్లో సోనియాతో పొత్తు పెట్టుకుంటున్నాడు..

  4. కిలారి రోశయ్య అనేవాడు ఒక వ్యాపారి మాత్రమే, రాజకీయ నాయకుడు కాదు.ఇతని దృష్టిలో రాజకీయం కూడా వ్యాపారమే.అధికారం ఉంటేనే,పార్టీలో యాక్టీవ్ గా ఉంటాడు.లేదంటే సైలెంట్ అవడమో,లేదంటే పార్టీ మారడమో చేస్తాడు.టిడిపి, ప్రజారాజ్యం, వైసిపి,… ఇప్పుడు జనసేన వైపు అతని స్వలాభం కోసం ఎన్ని పార్టలైన మారతాడు.ఇలాంటి స్వార్థపూరిత వ్యాపారుల కోసం, జగన్ నిజాయితీగా పనిచేసే జిల్లాలో బలమైన నాయకుడు రావి వెంకటరమణగారిని అకారణంగా సస్పెండ్ చేశాడు.అయోధ్యరామిరెడ్డి,సజ్జల, అప్పిరెడ్డి,ఉమ్మారెడ్డి లాంటివారి మాటలు విని,జగన్ గుంటూరు జిల్లాలో వైసిపినే లేకుండా చేసుకున్నాడు.

  5. నీ. కులగజ్జి రాజకీయం ఇంక నువ్వు మారకపోతే. నీకర్మ. వాస్తవాలు తెలుసుకో రా జఫ్ఫా అధికారం వున్నప్పుడు. విర్రవేగారు ఇప్పుడు నీతులు చెప్పడం ఎందుకు పోయి మీ జగన్ మోహన్ రెడ్డికి చెప్పు చేసినా తప్ప్పులకు శిక్ష అనుభవించాలి. అని చట్టం ఎవరికి చుట్టం కాదు కదా కనీసం చట్టాలు గురించి తెలుసుకో . చేసినా పాపాలు అన్ని ఇన్ని కాదుగా లెక్కలేనన్ని. క్షమార్హులు కాదు నువు మీ పార్టి అవినీతి అనకొండ party కదా పునాదుల నుంచి అవినీతి అక్రమాలు కబ్జాలు దౌర్జన్యాలు. రౌడియుజం ఒక్కెటెంటి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి సమయం ఒకేలా ఉండదు కాబట్టి కొంచెం బలుపు తగ్గించు కొనుటకు ప్రయత్నించు. ప్రజల సమస్య గురించి కాస్త ఆలోచిస్తే మంచిది ఇకనైనా వివక్ష విడనాడి ప్రజల సమస్యలు చాల ఉన్నాయి వాటి గురించి వ్రాయి పోరాడు అప్పుడు ప్రజలు ఆదరిస్తారు.

  6. కిలారి రోశయ్య అనేవాడు ఒక వ్యాపారి మాత్రమే, రాజకీయ నాయకుడు కాదు.ఇతని దృష్టిలో రాజకీయం కూడా వ్యాపారమే.అధికారం ఉంటేనే,పార్టీలో యాక్టీవ్ గా ఉంటాడు.లేదంటే సైలెంట్ అవడమో,లేదంటే పార్టీ మారడమో చేస్తాడు.టిడిపి, ప్రజారాజ్యం, వైసిపి,… ఇప్పుడు జనసేన వైపు అతని స్వలాభం కోసం ఎన్ని పార్టలైన మారతాడు.ఇలాంటి స్వార్థపూరిత వ్యాపారుల కోసం, జగన్ నిజాయితీగా పనిచేసే జిల్లాలో బలమైన నాయకుడు రావి వెంకటరమణగారిని అకారణంగా సస్పెండ్ చేశాడు.అయోధ్యరామిరెడ్డి,సజ్జల, అప్పిరెడ్డి,ఉమ్మారెడ్డి లాంటివారి మాటలు విని,జగన్ గుంటూరు జిల్లాలో వైసిపినే లేకుండా చేసుకున్నాడు.

  7. కిలారి రోశయ్య అనేవాడు ఒక వ్యాపారి మాత్రమే, రాజకీయ నాయకుడు కాదు.ఇతని దృష్టిలో రాజకీయం కూడా వ్యాపారమే.అధికారం ఉంటేనే,పార్టీలో యాక్టీవ్ గా ఉంటాడు.లేదంటే సైలెంట్ అవడమో,లేదంటే పార్టీ మారడమో చేస్తాడు.టిడిపి, ప్రజారాజ్యం, వైసిపి,… ఇప్పుడు జనసేన వైపు అతని స్వలాభం కోసం ఎన్ని పార్టలైన మారతాడు.ఇలాంటి స్వార్థపూరిత వ్యాపారుల కోసం, జగన్ నిజాయితీగా పనిచేసే జిల్లాలో బలమైన నాయకుడు రావి వెంకటరమణగారిని అకారణంగా సస్పెండ్ చేశాడు.అయోధ్యరామిరెడ్డి,సజ్జల, అప్పిరెడ్డి,ఉమ్మారెడ్డి లాంటివారి మాటలు విని,జగన్ గుంటూరు జిల్లాలో వైసిపినే లేకుండా చేసుకున్నాడు.

    1. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స చేస్తే ఖాళీ అవుతుంది

  8. మూతపడే పార్టీ ఉన్నా మళ్లీ అధికారంలోకి రాని పార్టీ అక్కడ ఉండి ఏటి శాత్తం

  9. "రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయ నాయకులు అని ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. వీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాపతు నాయకులు. అధికార ఉన్న పార్టీలోకి బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లాగా చేరుకుంటూ ఉంటారు. ప్రజలు ఛీత్కరించుకుంటారనే భయం, వెరపు వీరికి ఉండవు. తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం ఒక్కటే లక్ష్యంగా వారు వ్యవహరిస్తుంటారు."
    Vallabhaneni Vamsi inka migatha mugguri gurinchi ilanti maatalu yeppudu cheppinattu gurthu ledhu...

Comments are closed.