డ్రాగన్ గా ఎన్టీఆర్.. ట్రెండింగ్ లో టైటిల్?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. ఎట్టకేలకు ఆ సినిమా మొదలైంది. ఎన్టీఆర్-నీల్ సినిమాకు ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుదిరితే ఇదే నెలలో సినిమాను సెట్స్…

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. ఎట్టకేలకు ఆ సినిమా మొదలైంది. ఎన్టీఆర్-నీల్ సినిమాకు ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుదిరితే ఇదే నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, నీల్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది. ఇదే సందర్భంగా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

సంక్రాంతికి ఎన్టీఆర్-నీల్ సినిమా వస్తోంది. అయితే 2025 సంక్రాంతి కాదు, 2026 సంక్రాంతికి ఈ సినిమాను షెడ్యూల్ చేశారు. జనవరి 9, 2026 అంటూ పోస్టర్ వదిలారు.

రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ, సినిమా టైటిల్ ను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ప్రచారం చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ గా రష్మిక ఎంపికైనట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తారు. తన ప్రతి సినిమాకు ఉన్నట్టుగానే, ఈ ప్రాజెక్టుకు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ ను సహ-నిర్మాతగా యాడ్ చేశాడు తారక్.

5 Replies to “డ్రాగన్ గా ఎన్టీఆర్.. ట్రెండింగ్ లో టైటిల్?”

  1. ఎన్టీఆర్ నిజమైన టీడీపీ వారసుడు. పంది జోకేష్ నీ సింహాసనం మీదకూర్చోబెట్టిన.. అది పంది లక్షణాలాలు విడువదు

Comments are closed.