చిన్న వయసులోనే హీరోగా మారాడు రామ్ పోతినేని. అప్పట్లో అదొక రికార్డ్. అయితే అతడికి హీరోగా మారాలనే కోరిక, ఇంకా చిన్న వయసులోనే కలిగిందంట. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు.
8 ఏళ్ల వయసులోనే హీరో అవుతానంటూ వెళ్లి తన తల్లికి చెప్పాడట రామ్. ఇంట్లో ఆల్రెడీ నిర్మాత ఉన్నారు కాబట్టి హీరో అవ్వాలనే ఆలోచన రావడం సహజం అని అంతా అనుకున్నారట.
అయితే అది బ్యాక్ గ్రౌండ్ వల్ల వచ్చిన ఆలోచన కాదని, హీరో అవ్వాలనేది తన తపన అని రామ్ నిరూపించాలనుకున్నాడు. అందుకే తమిళ్ లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట.
11 ఏళ్ల వయసుకే తమిళ్ లో ఓ షార్ట్ ఫిలిం చేశాడు రామ్. దానికి అవార్డులు కూడా వచ్చాయి. ఆ షార్ట్ ఫిలిం చూసిన వైవీఎస్ చౌదరి, దేవదాస్ కోసం రామ్ ను సెలక్ట్ చేశాడంట.
అయితే అప్పటికే రామ్, హీరోగా తమిళ్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. ఆ ఆలోచనను బ్రేక్ చేసి, వైవీఎస్ చౌదరి తనను టాలీవుడ్ కు తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు రామ్.
Doubtful movie
Call boy jobs available 8341510897
Vc available 9380537747
జనం పట్టించుకోరు
Biggest pan India hero prabhas