ఎస్ఎస్ఎల్వీ -డీ3 ప్ర‌యోగం విజ‌య‌వంతం

తిరుప‌తి జిల్లా శ్రీ‌హ‌రికోట‌లోని షార్ నుంచి ఇవాళ ప్ర‌యోగించిన ఎస్ఎస్ఎల్వీ -డీ3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. దీంతో ప‌ర్యావ‌ర‌ణం, ప్ర‌కృతి విప‌త్తులు, అగ్ని ప‌ర్వ‌తాల‌పై ఈ వాహ‌క నౌక ప్ర‌యోగాలు చేయ‌నుంది. Advertisement ఇస్రోకు చెందిన…

తిరుప‌తి జిల్లా శ్రీ‌హ‌రికోట‌లోని షార్ నుంచి ఇవాళ ప్ర‌యోగించిన ఎస్ఎస్ఎల్వీ -డీ3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. దీంతో ప‌ర్యావ‌ర‌ణం, ప్ర‌కృతి విప‌త్తులు, అగ్ని ప‌ర్వ‌తాల‌పై ఈ వాహ‌క నౌక ప్ర‌యోగాలు చేయ‌నుంది.

ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంట‌ర్‌లో 175 కిలోల ఈవోఎస్‌-08ను ఉప‌గ్ర‌హాన్ని అభివృద్ధి చేశారు. 17 నిమిషాల్లో నిర్దేశిత క‌క్ష్య‌లోకి చేరింది. ఈ వాహ‌క నౌక‌లో ఉన్న ఎల‌క్ట్రో ఆప్టిక‌ల్ ఇన్‌ప్రారెడ్ (ఈవోఐఆర్‌) పేలోడ్ మిడ్ వేవ్‌, లాంగ్ వేవ్ ఇన్‌ప్రా- రెడ్‌లో చిత్రాల‌ను సంగ్ర‌హిస్తుంది. త‌ద్వారా విత‌ప‌త్తుల గురించి ముందుగా తెలుసుకోడానికి ప‌నికొస్తుంది.

ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంపై షార్ శాస్త్ర‌వేత్త‌లు సంబ‌రాలు చేసుకున్నారు. అలాగే దేశం యావ‌త్తు ఉత్కంఠగా ఎదురు చూసిన ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో భ‌విష్య‌త్‌లో విప‌త్తుల గురించి వెంట‌నే తెలుసుకుని, అప్ర‌మ‌త్తం కావ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

3 Replies to “ఎస్ఎస్ఎల్వీ -డీ3 ప్ర‌యోగం విజ‌య‌వంతం”

  1. దీని మీద angry గా ఉన్న పాఠకులు అంటే ఖచ్చితంగా మైనారిటీ లు కాని కాంగ్రెస్ బానిస లు కాని ఉండి ఉండాలి.

Comments are closed.