తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఇవాళ ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ -డీ3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఈ వాహక నౌక ప్రయోగాలు చేయనుంది.
ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో 175 కిలోల ఈవోఎస్-08ను ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. ఈ వాహక నౌకలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ప్రారెడ్ (ఈవోఐఆర్) పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ప్రా- రెడ్లో చిత్రాలను సంగ్రహిస్తుంది. తద్వారా వితపత్తుల గురించి ముందుగా తెలుసుకోడానికి పనికొస్తుంది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంపై షార్ శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. అలాగే దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రయోగం విజయవంతం కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్లో విపత్తుల గురించి వెంటనే తెలుసుకుని, అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతోంది.
Congratulations!
దీని మీద angry గా ఉన్న పాఠకులు అంటే ఖచ్చితంగా మైనారిటీ లు కాని కాంగ్రెస్ బానిస లు కాని ఉండి ఉండాలి.
Vc available 9380537747