దేవర నమ్మకం పెంచుతున్నాడు

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘దేవర. విడుదల మరో అయిదు వారాల్లో వుంది. ఇప్పటికి వచ్చిన కంటెంట్ లో రెండు పాటలు కూడా వున్నాయి. వచ్చే ప్రతి కంటెంట్ ప్రామిసింగ్ గానే…

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘దేవర. విడుదల మరో అయిదు వారాల్లో వుంది. ఇప్పటికి వచ్చిన కంటెంట్ లో రెండు పాటలు కూడా వున్నాయి. వచ్చే ప్రతి కంటెంట్ ప్రామిసింగ్ గానే వుంటోంది. కానీ సినిమాకు బఙ్ ఇంకా పెరగడం లేదు.

ఇప్పుడు లేటెస్ట్ గా దేవర నుంచి విలన్ పాత్ర ఇంట్రడక్షన్ గ్లింప్స్ వదిలారు. సైఫ్ ఆలీఖాన్ పాత్ర ఎలా వుండబోతుందో అన్నది చెప్పడం మాత్రమే కాదు. సినిమా లుక్ ఎలా వుండబోతోందో అన్నది కూడా ఓ క్లారిటీ ఇచ్చారు.

సైఫ్ లుక్ కోసం విడుదల చేసిన గ్లింప్స్ పనిలో పనిగా సినిమా టోన్, లెవెల్ ఎలా వుండబోతోందో అన్నది ఓ చిన్న క్లారిటీ ఇచ్చినట్లు అయింది. దేవర భారీ సినిమా అని తెలుసు. కానీ ఆ భారీతనం చిన్న శాంపిల్ చూపించారు దర్శ‌కుడు కొరటాల. ఈ గ్లింప్స్ కు ఇచ్చిన బిజిఎమ్ కూడా బాగుంది. ఇప్పటి వరకు వచ్చిన దేవర కంటెంట్ లో ఈ టోన్, ఈ భారీ తనం అయితే లేదు.

సినిమాలోని హీరో, విలన్ పాత్రలు ఇప్పటికి బయటకు వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అనే టాక్ వుంది. అందువల్ల ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్ కాకుండా మరో లుక్ వుంటుంది అనుకోవాలి. బహుశా ఆ లుక్ ను సినిమాలో తప్ప వేరే విధంగా రివీల్ చేయకపోవచ్చు. ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు కొరటాల అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర.

7 Replies to “దేవర నమ్మకం పెంచుతున్నాడు”

  1. మన బాబు గారు విజయవాడలో ఆటో డ్రైవర్ తో డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామను అన్నాడు.

    అంత సొళ్లో సోల్లు మొత్తం సొల్లు.

    మన బాబు గారు 2014లో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు అది ఎంత సొళ్లో.

    2024 ముందు సంపద చూసి ఇస్తాను అన్నాడు ఎంత సొళ్లో..

    2024 ఎలక్షన్స్ లో సూపర్ సిక్స్ అన్నాడు అది అంత సొళ్లో.

    2015లో అమరావతి విజయవాడలో చెట్లు పెంచి ఎండల్ని తగ్గిస్తాను తగ్గిస్తాను అది ఎంత సొళ్లో..

    ఇప్పుడు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామన్నది కూడా అంతే సొల్లు … సొళ్లో సోల్లు

Comments are closed.