జ‌న‌సేన దిమ్మెపై టీడీపీ దాడి… అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌!

కూట‌మి పార్టీల మ‌ధ్య అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ వాటి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపిస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేత‌లు జ‌న‌సేన‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణ‌లోకి…

కూట‌మి పార్టీల మ‌ధ్య అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ వాటి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపిస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేత‌లు జ‌న‌సేన‌ను పెద్ద‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు. కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో జ‌న‌సేన‌ను ఎలా వ‌దిలించుకోవాలా? అని ఎదురు చూస్తున్నారు.

గ‌త అర్ధ‌రాత్రి గుడివాడ‌లో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప‌ట్ట‌ణంలోని నాగ‌వ‌ర‌ప్పాడు సెంట‌ర్‌లో జ‌న‌సేన దిమ్మెను టీడీపీ బీసీ నాయ‌కుడు దారా న‌ర‌సింహారావు నేతృత్వంలో కూల గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ విష‌యం తెలిసి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు భారీగా అక్క‌డికి త‌ర‌లి వెళ్లారు. త‌మ పార్టీ దిమ్మెను ఎందుకు కూల‌గొట్టాల‌ని అనుకుంటున్నార‌ని టీడీపీ నేత‌ల్ని నిల‌దీశారు.

టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ధ్య వాగ్వాదం పెరిగి, ఒక ద‌శ‌లో కొట్టుకునే వ‌ర‌కూ వెళ్లింది. టీడీపీ దాడిని నిర‌సిస్తూ జ‌న‌సేన శ్రేణులు రోడ్డుపై నిర‌స‌న‌కు దిగారు. జ‌న‌సేన దిమ్మెను కూల‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన న‌ర‌సింహారావును టీడీపీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని వారు డిమాండ్ చేశారు. త‌మ‌పై దాడిగా భావిస్తున్నామ‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అన్నారు.

ఇదిలా వుండ‌గా న‌ర‌సింహారావుపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే త‌ప్ప కేసు న‌మోదు చేసే ప‌రిస్థితి వుండ‌దు. జ‌న‌సేన దిమ్మెను కూల‌గొట్ట‌డానికి రావ‌డంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించారు.

7 Replies to “జ‌న‌సేన దిమ్మెపై టీడీపీ దాడి… అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌!”

Comments are closed.