సామాజిక పింఛ‌న్ల కోత‌పై క‌స‌ర‌త్తు!

కూట‌మి ప్ర‌భుత్వం సామాజిక పింఛ‌న్ల కోత‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు పింఛ‌న్‌ను రూ.4 వేల‌కు పెంచుతామ‌ని చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నాయ‌కులు విస్తృతంగా ప్ర‌చారం చేశారు. విక‌లాంగుల పింఛ‌న్‌ను రూ.6వేల‌కు పెంచుతామ‌న్నారు. కూట‌మి…

కూట‌మి ప్ర‌భుత్వం సామాజిక పింఛ‌న్ల కోత‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు పింఛ‌న్‌ను రూ.4 వేల‌కు పెంచుతామ‌ని చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నాయ‌కులు విస్తృతంగా ప్ర‌చారం చేశారు. విక‌లాంగుల పింఛ‌న్‌ను రూ.6వేల‌కు పెంచుతామ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత హామీ మేర‌కు పింఛ‌న్‌ను పెంచారు. ఇంత వ‌ర‌కూ బాగుంది. అయితే ఆర్థికంగా భారాన్ని త‌గ్గించుకోవాల‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నారు.

మంచి కంటే చెడు చేయ‌డం సులువు. ఒక వ్య‌క్తికి ల‌బ్ధి క‌లిగించాలంటే ఎన్నో ప్ర‌యాసాలకు గురి కావాల్సి వుంటుంది. ఇదే హాని త‌ల‌పెట్టాలంటే నిమిషంలో ప‌ని. పింఛ‌న్‌దారుల విష‌యంలోనూ ఈ థీరీ వర్తిస్తుంది. సామాజిక పింఛ‌న్‌దారుల భారాన్ని త‌గ్గించుకోడానికి కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే యాక్ష‌న్ మొద‌లు పెట్టింది. ఒకేసారి కాకుండా, విడ‌త‌ల వారీగా పింఛ‌న్లు తొల‌గించేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది.

సామాజిక పింఛ‌న్లను ఆన్‌లైన్ పోర్ట‌ల్ నుంచి తొల‌గించే వెసులుబాటు ఎంపీడీలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లకు ప్ర‌భుత్వం క‌ల్పించింది. దీంతో స్థానిక కూట‌మి నేత‌లు ఎవ‌రెవ‌రి పింఛ‌న్ల‌ను తొల‌గించాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మున్సిప‌ల్ క‌మిష‌నర్ల చేతికి అంద‌జేస్తున్నారు.

రాజు త‌లుచుకుంటే కొర‌డా దెబ్బ‌లు క‌రువా అనే సామెత చందాన‌, అధికారులు త‌ల‌చుకుంటే పింఛ‌న్ల‌ను తొల‌గించ‌డం పెద్ద ప‌నేమీ కాదు. రానున్న రోజుల్లో భారీగా సామాజిక పింఛ‌న్ల‌ను తొల‌గించ‌డానికి రంగం సిద్ధ‌మైంది. ఎవ‌రెంత‌గా గ‌గ్గోలు పెట్టినా పింఛ‌న్ల కోత మాత్రం ఆగ‌దు కాక ఆగ‌దు.

10 Replies to “సామాజిక పింఛ‌న్ల కోత‌పై క‌స‌ర‌త్తు!”

  1. పింఛను కోసం అప్పట్లో ఆధార్ కార్డు లో జనన సంవత్సరం ని మార్చేసారు మసరిచేస్తున్నారు అని అప్పట్లో మీరే గగ్గోలు పెడుతూ రాసేవారు ఆర్టికల్స్….ఇప్పుడు అవి మల్ల క్రాస్ చెక్ చేస్తారేమో…అదీ కాకుండా ఐదేళ్లు అంటే చిన్న సమయం ఏమి కాదు ఈ ఐదేళ్ళలో కొంత మంది ఆర్థిక స్థాయి ఐన మెరుగు అవ్వకుండా ఉండదు….అలానే అప్పుడు అధికారం అడ్డు పెట్టుకుని అందుకునే అర్హులు ఉంటారు వాళ్ళ ని తీసేసి ఇప్పుడు తమ వాళ్ళకి చోటు ఇస్తారేమో…..ప్రభుత్వం మారినప్పుడు ఇవన్నీ కామన్ జనాలు దీనికి ప్రిపరెడ్ గానే ఉంటారు

  2. ఓట్లు కొనుగోలుకు అయితే మొత్తం తగ్గించి అనర్హులకు కూడా ఇచ్చి అర్హులకు అమౌంట్ తగ్గించి అన్యాయం చెయ్యటమే సంక్షేమం అర్హులకు మాత్రమే ఇవ్వాలి ఓట్ల కొనుగోలు కు అయితే అందరికి అమౌంట్ తగ్గించి నీకు ఇంత నీకు ఇంత అని జగన్ గారిలాగా పంచటమే

  3. అవును అర్హత లేకపోయిన చాలా గ్రామాల్లో చాలా మంది కి పింఛన్లు ఇస్తున్నారు అలాంటి వాళ్లకి పింఛన్లు
    కట్ చేయడంలో తప్పు లేదు గవర్నమెంట్ కి కూడా డబ్బులు ఊరికే రావు కదా. మా ఊర్లో
    భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ల ఇద్దరు అబ్బాయిలు యుఎస్‌లో ఉన్నారు,
    కాని భర్త అమ్మకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. ఇది న్యాయమా లేక అన్యాయమా మీరు చెప్పాలి.
    ఇలా రాష్ట్రం లో ఎన్ని ఉంటాయి. అసలే మన మాజీ సీఎం చాలా డబ్బు పంచేశాడు గత 5 ఏళ్లలో
    ఇంకా 5 ఏళ్లు గడపాలంటే ఆ మాత్రం డబ్బు ఆదా అవ్వాలి కదా. జీఏ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే
    ఎవరికైనా అర్హత ఉన్నా కూడా పింఛన్లు కట్ అవుతాయో ప్రూఫ్స్ తో సహా చూపించు అప్పుడూ ఈ ఆర్టికల్
    రాయి, ఇపుడే ఎందుకు థూ థూ అంటున్నావ్.

Comments are closed.