భూమి చుట్టూ రాజకీయం

ఏ నిర్ణయాలకైతే అభివృద్ధి అనే ముసుగు వేస్తున్నారో.. అదంతా కూడా రియల్ దందా లాగా చూపరులకు కనిపిస్తోంది

‘ధన మూలం ఇదం జగత్’ అని ఆర్యోక్తి. జగత్తులో ప్రతివ్యవహారానికి ధనమే మూలం అని ఈ సూక్తి మనకు చెబుతుంది. ఆధునిక వేదోక్తి ఏంటంటే.. ‘భూ మూలం ఇదం జగత్’! అవును ఇప్పుడు సంపద అంటే భూమే. వ్యక్తులు భూమిని సంపద చిహ్నంగా చూడడంలో వింత లేదు.. కానీ రాజకీయ నాయకులు, అధికారంలో ఉండే ప్రభుత్వాలు కూడా భూమిని సంపదగా మార్చేసి ‘నిల్ బ్యాలెన్స్’ చేసేయాలని ఆరాటపడుతుండడమే అసలు చింత! సంపద సృష్టి అనే పదం ఒక మిథ్య. ‘భూ మంత్రకాళి..’ అని ఉచ్ఛరించే మంత్రగాళ్లు.. భూమిని సంపదగా చూపిస్తారు. సృష్టి జరిగినట్టుగా భ్రమపెడతారు. పునఃసృష్టికి అవకాశం ఉన్న ఏ రూపంలో సంపద సృష్టి జరిగినా గొప్ప విషయమే.

అయితే.. పునఃసృష్టి ఊహకు కూడా అవకాశమివ్వని.. భూస్థితిని హరించేస్తూ.. సృష్టించే సంపద భవిష్యత్తుకు ఎలాంటి భరోసాను అందించగలుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వాలు ఉన్న భూమినెల్లా తమ జమానాలోనే అరాయించుకోవాలని అనుకుంటే.. ‘రేపు’ అనేది ఎలా గడుస్తుంది? ఇలాంటి ఊహలు, ప్రశ్నలు మనలో వందల భయాల్ని పుట్టిస్తాయి. ఆ భయాలకు అక్షర రూపమే, ప్రభుత్వాలు పాల్పడుతున్న అరాచకపోకడలను పరామర్శించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘భూమి చుట్టూ పార్టీలు’!

పశువులు, ఆడవాళ్లను మాత్రమే సంపదలుగా భావించి వాటి కోసం పోరాటాలు ప్రారంభించిన మానవ జాతి.. ఆ తర్వాత చాలా కాలానికి భూమిని కూడా సంపదగా గుర్తించడం తెలుసుకుంది. ఆ తర్వాత భూమి కోసం యుద్ధాలు జరగడం ప్రారంభం అయింది. క్రమంగా భూమిచుట్టూనే కార్యకలాపాలు అన్నీ జరగడమూ మొదలైంది. బలవంతుడి మాటే చెల్లుబాటు అవుతుందనే ఆదిమ వేదనీతి ప్రకారం.. భూమికి హద్దులు గీసి ఇది నాది అని రొమ్ము విరుచుకుని చెప్పుకోగలిగిన, వాటిని కాపాడుకోగలిగిన బలవంతుడే.. తర్వాతి కాలంలో సంపన్నుడయ్యాడు. కాలం మారే క్రమంలో రాజ్యాలు, ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు అన్నీ వచ్చాయి. భూ సంపద అనేది ప్రజల సంపదగా నిర్ణయం అవుతూ వచ్చింది.

ప్రజాప్రభుత్వాలు అనేవి ప్రజల ఆస్తులకు కేవలం ధర్మకర్తలుగా ఉంటూ వచ్చాయి. ఎందుకంటే.. ప్రజల సంపద అన్న తరువాత.. దానిని కాపాడడం భవిష్యత్ తరాలకు అందించడం అనేది ప్రభుత్వాల మౌలిక బాధ్యతగా ఉండాలి. కానీ.. ఇప్పుడు ప్రభుత్వాలు ఆ మౌలిక బాధ్యతనుంచి దూరం జరుగుతున్నాయి. తమ ప్రభుత్వ పాలన కాలం తరువాత.. యావత్తు భూమండలమే అంతమైపోతుందేమో అన్నట్టుగా.. ఉన్న భూమిని మొత్తం తమ ప్రభుత్వ కాలంలోనే ఖర్చు పెట్టేయాలన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే కనిపిస్తోంది. ఏ నిర్ణయాలకైతే అభివృద్ధి అనే ముసుగు వేస్తున్నారో.. అదంతా కూడా రియల్ దందా లాగా చూపరులకు కనిపిస్తోంది. ఏ ఒక్కరి చర్యలను కూడా నిజాయితీగా గుర్తించలేని పరిస్థితి.. ప్రజల్లో ఏదో అనుమానం, భయం మొలకెత్తుతున్నాయి.

ఈ రియల్ వ్యాపారంలో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు.. నిన్నటిదాకా రాజ్యం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ కొత్తగా సింహాసనం అధిష్ఠించి అదే రియల్ కార్యకలాపాలకు మరో రకం ముసుగులు వేసి చెలరేగుతున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు అందరిదీ ఒకటే దారిగా ఉంటోంది.

వేల్యూ పెంచే వ్యూహాలు పురాతనమైనవే..

నగరాల సంగతి పక్కన పెట్టండి. మీ గ్రామాల్లో టీటీడీ కల్యాణ మండపాలు ఉన్నాయా? కొద్దిగా నిన్నటితరంలో నిర్మించిన ఆర్టీసీ బస్సుస్టాండులు ఉన్నాయా? మీకు తెలిసిన గ్రామాల్లో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తు చేసుకోండి. ఊరు ఒకచోట ఉంటే అవి ఊరికి దూరంగా ఎక్కడో ఉంటాయి! ఊరు ఒకచోట ఉంటే బస్సుస్టాండు కిలోమీటరు దూరంలో కట్టి ఉంటారు. టీటీడీ వారి కల్యాణ మండపాన్ని ఇంకో వైపు ఎడంగా విసిరేసినట్టుగా ఎక్కడో దూరంగా ఉంటుంది. ఈ నిర్మాణాలు సాధారణంగా ఆ ఊరిలో వదాన్యులైనటువంటి ఊరిపెద్దల, సంపన్నుల వితరణ శీలతతో రూపు దిద్దుకున్నటువంటివి. వారు స్థలదానం చేస్తే, ప్రభుత్వం తరఫునో, టీటీడీ తరఫునో ఆ నిర్మాణాలు ఏర్పడి ఉంటాయన్నమాట.

అప్పట్లో అలాంటి విధానం ఉండేది. ఒక గ్రామం నుంచి తమకు బస్సుస్టాండు నిర్మించండి అంటూ ఆర్టీసీకి అనేక దరఖాస్తులు వెల్లువెత్తుతాయి. లేదా, ఓ మోస్తరు పెద్ద గ్రామం అయితే.. తమకు ఓ కల్యాణ మండపం కట్టించి ఇవ్వమని టీటీడీకి వినతులు వెల్లువెత్తుతాయి. కొన్నాళ్ల తర్వాత.. అటువైపు నుంచి ఆమోదం వస్తుంది. మీ ఊరి నుంచి స్థలం విరాళంగా ఎవరైనా దానం ఇచ్చినట్లయితే.. నిర్మాణం తాము చేపడతామంటూ ఆమోదం లభిస్తుంది. ఆ వెంటనే ఊరిలోని ఒక భూకామందు.. దానికి అవసరమైన భూమిని విరాళంగా ఇస్తారు. అక్కడ నిర్మాణం జరుగుతుంది.

బస్సుస్టాండు లేదా కల్యాణ మండపం వచ్చింది అని ప్రచారం చేసి.. ఆ చుట్టు పక్కల ఉండే తమ ఎకరాల కొద్దీ పొలాల్లో సదరు కామందు రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తారు. వచ్చిన నిర్మాణాన్ని చూపించి.. అక్కడిదాకా నివాసాలు వచ్చేస్తాయని అంటూ.. ఊదరగొట్టి చాలా సులువుగా అమ్మేస్తారు.

నిజానికి సదరు భూకామందుకు తన ఓపికకు మించిన భూసంపద ఉంటుంది. తాను స్వయంగా సేద్యం చేసుకోలేని, చేయించుకోలేని స్థితిలో ఉంటాడు. నిరుపయోగంగా మారిపోయిన భూములను వదిలించుకోవడానికి ఇలాంటి విరాళం ద్వారా ఒక రియల్ ఎస్టేట్ వేల్యూ సృష్టిస్తాడు. ఆ వేల్యూ ఒక నీటిబుడగ! కొన్ని చోట్ల నిజంగానే ఎప్పటికో ఒక నాటికి విలువ పెరగవచ్చు గాక.. కానీ అనేక స్థలాల్లో అసలు అవి ఎప్పటికీ అదనపు విలువను సంతరించుకోవు. అమ్ముకున్న దందా సాగించిన కామందు మాత్రమే బాగుపడతాడు. ఇది అత్యంత వంచనాత్మకమైన నిన్నటితరం లోకరీతి!

ఇవాళ్టి రోజుల్లో అయినా ఈ లోకరీతి మారలేదు. కాకపోతే అప్పటి భూకామందుల దందాను ఇప్పుడు ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వాలే పూనిక వహిస్తున్నాయి. నిజం చెప్పాలంటే.. పాలన సాగిస్తున్న పార్టీలు మొత్తం భూమి సంబంధిత కార్యకలాపాల చుట్టూతా మాత్రమే తమ వ్యవహారం నడిపిస్తున్నాయి.

తెలంగాణలో కోకాపేట కతలు సాగినా, పరిశ్రమలకు భూకేటాయింపులు జరుగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని ముసుగులో నిన్నటిదాకా ఓ ప్రహసనం నడిచినా, ప్రపంచం తలతిప్పి చూసే నగరం అని ఇవాళ ఒక గారడీ నడుస్తున్నా అన్నింటి వెనుక ఆయా పార్టీల రియల్ దందాలు పుష్కలంగా ఉన్నాయనేది నిజం.

ఇలాంటి దందాలకు ఆధునిక రూపం ఏంటంటే.. ఏ రియల్ ఎస్టేట్ సంస్థ వారికో కొన్ని వందల వేల ఎకరాలు ఎందుకూ పనికిరాని ఒక ప్రాంతంలో ఉంటాయి. అక్కడ వారు పదుల ఎకరాలను ఒక స్వామీజీ వారి ఆశ్రమానికి, ప్రభుత్వంలో కీలకంగా ఉండే వీవీఐపీ పెద్దలు నడిపే స్వచ్ఛంద సంస్థలకు, కాలేజీలు లాంటి వాటికి చాలా ఉదార హృదయంతో విరాళంగా ఇచ్చేస్తారు. వారికి ఎటూ చందాలు పోటెత్తుతుంటాయి కాబట్టి.. ఎంతో విలువైన నిర్మాణాలు ఆయా ప్రాంతాల్లో చిటికెలో వచ్చేస్తాయి.

ప్రధాన రహదార్లతో ఆ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం రోడ్లు కూడా వేస్తుంది. అక్కడితో వారికి స్థలదానం చేసిన రియల్ సంస్థ వారు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. వారి భూములకు మొత్తం విలువ అమాంతంగా పెరిగిపోతుంది. దమ్మిడీకి అర్దనాకు ఆ భూములను కొన్నవారు ఏకంగా వందల కోట్ల రూపాయల విలువకు వాటిని అమ్ముకుని వదిలించుకుంటారు.

ఎకరం వంద కోట్లు!

కేసీఆర్ పరిపాలన కాలంలో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం అలా తారాజువ్వలాగా లంబంగా ఆకాశానికేసి పెరిగిపోయినట్టుగా ఒక బూటకపు ప్రచారం బాగా జరిగింది. ప్రత్యేకించి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ రాష్ట్రంలో రియల్ ఎస్టే రంగం స్తబ్దంగా మారింది. చాలా మంది బడా పెట్టుబడిదార్లు చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ భ్రమలో పడి అమరావతిలో, ఆ చుట్టుపక్కల భారీగా పెట్టుబడులు పెట్టారు. జగన్ రాకతో ఆ నగర భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికి వారు.. అక్కడి కార్యకలాపాలను స్తంభింపజేసుకున్నారు.

ఈ నేపథ్యంలో.. నిరంతరం రియల్ వ్యాపార లావాదేవీల్లో మునిగి ఉండడం అలవాటైపోయిన వాళ్లు ఖాళీగా ఉండలేక హైదరాబాదు చుట్టుపక్కల వ్యాపారం మీదనే దృష్టి సారిస్తూ వచ్చారు. రియల్ లావాదేవీల సాంద్రత పెరిగిన మాట నిజం. కానీ.. తిమ్మిని బమ్మిని చేస్తూ అనూహ్యమైన రియల్ గ్రోత్ ఉన్నట్టుగా భ్రమలు ప్రచారం చేశారు.

పదిహేనేళ్ల కిందట టాలీవుడ్ లో ఒక సినిమా వచ్చింది. స్లాప్‌స్టిక్ కామెడీ, రియల్ పోకడలపై వెటకారం నిండిన సినిమా అది. ఊహకు అందని రేట్లు భూములకు వచ్చేస్తున్నాయంటూ ఆ సినిమాలో సెటైర్ ఉంటుంది. తమాషా ఏంటంటే.. ఆ సినిమా రూపకర్తలు కూడా అతిశయంగా ఊహించదగిన ధరను యాభైకోట్ల వద్ద లాక్ చేశారు.

‘భూ కైలాస్.. ఎకరం 50 కోట్లు’ అంటూ ఆ సినిమాకు టైటిల్ పెట్టారు. కానీ.. కేసీఆర్ జమానాలో ఆ సినిమాలోని వెటకారాన్ని తలదన్నేవిధంగా వాస్తవ రియల్ ధరలు ఆకాశంలోనే విహరించాయి. ప్రభుత్వ భూములను వేలం పెట్టి ఎకరం వందకోట్లకు విక్రయించిన వైనం అందరూ గమనించారు. ఆశ్చర్యంగా అనిపించే ఈ ధరల వెనుక మతలబులు వేరు. అన్నీ పుకార్ల రూపంలోనే అయినా రకరకాలుగా వినిపించాయి.

గులాబీ దళ పెద్దలకు ఆ ప్రాంతంలో వందల ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయని, ఎకరం వంద కోట్ల వంతున కొన్నటువంటి సంస్థ ద్వారా వాటి విలువను పెంచారని.. తద్వారా తమ ప్రెవేటు భూములు అన్నింటికీ భారీగా ధరలు పెంచుకున్నారని రకరకాల కథనాలు వినిపించాయి.

ఈ దృష్టాంతం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. హైదరాబాదులో రియల్ గ్రోత్ అనేది ఒక నీటిబుడగగా ఇప్పుడు నిరూపణ అవుతోంది. వందల వేల ఫ్లాట్ లు ఉన్న అపార్టుమెంట్ భవనాల నిర్మాణాలు ఇప్పుడు స్తంభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కొత్త సర్కారు సరికొత్త వ్యూహంతో వెళ్లవలసిన అగత్యం ఏర్పడింది.

తాజా దందాకు పరిశ్రమల ముసుగు!

ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వంతు వచ్చింది. కేసీఆర్ సర్కారు ఏ రకమైన రియల్ ఎస్టేట్ దందాను నడిపించిందో అదే మార్గంలో వెళ్లడానికి అవకాశాలు కుంచించుకుపోయాయి. అదే మాటలతో దందా నడిపించే దారి లేదిప్పుడు. ఆయన ఎంచుకున్న కొత్త మార్గం.. పెట్టుబడులు, పరిశ్రమలు! అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలను కలిశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. అందరికీ ఆయన పెడుతున్న ఆఫర్ ఒక్కటే. మా దగ్గర పెట్టుబడులు పెట్టండి.. మీకు అవసరమైనంత భూవసతి కల్పిస్తాం.. మౌలిక వసతులను ఏర్పాటుచేస్తాం అని మాత్రమే. అందరికీ భూమిని పంచిపెట్టేయడానికి రేవంత్ సర్కారు సిద్ధం అయిపోతోంది.

ఇలాంటి ఆఫర్లను అందుకుంటున్నప్పుడు కంపెనీల ఏర్పాటు కూడా ఒక నీటిబుడగ లాంటి వ్యవహారంగా జరిగే అవకాశం ఉంటుంది. ఒక పరిశ్రమ నడుపుతున్న వ్యక్తి నిత్యం దానిని విస్తరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎక్కడ కొత్త యూనిట్లు పెడితే లాభసాటిగా ఉంటుందో సర్వే చేస్తుంటాడు. తనంత తానుగా వ్యాపారావకాశాలను గమనించుకుని.. తానే స్థలం కొని పరిశ్రమ పెట్టడానికి పూనుకునేవాళ్లు!

ఉదాహరణకు అలా జరిగినప్పుడు పదెకరాల స్థలం కొనే సంస్థలు, ప్రభుత్వాలే తమ వెంటబడి ప్రాధేయపడుతోంటే.. వందల ఎకరాలు డిమాండ్ చేయడంతో తమ డీల్ చర్చలు ప్రారంభిస్తారు. అలా దందా మొదలవుతుంది. వారికి కేటాయించే భూములకు అటు ఇటుగా రాజకీయ నాయకుల, వారి బినామీల ప్రెవేటు భూములు పుష్కలంగా ఉంటాయి. ఆ దందా అలా సాగుతూ ఉంటుందన్నమాట.

నిజానికి ఇలాంటి ప్రక్రియకు చంద్రబాబునాయుడు ఎప్పట్లోనో శ్రీకారం చుట్టారు. ఒక సంస్థ ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం అవుతుందో అంతకు రెండింతలు, మూడింతలు వారికి ధారాదత్తం చేయడం ద్వారా ఆ సంస్థలను ఆహ్వానించడం ఆయన విధానంగా సాగింది. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా అదే దారులను అనుసరిస్తున్నాయి.

జగన్ ముద్ర భిన్నం!

రియల్ ఎస్టేట్ దందా విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగించిన దందా పూర్తిగా భిన్నమైనది. అమరావతిని రాజధానిగా కొనసాగించడం ఆయనకు ఇష్టం లేదు. అలాగని అపరిమితమైన ఆర్జన మార్గంగా కనిపించే రియల్ ఎస్టేట్ దందాను ఆయన విస్మరించదలచుకోలేదు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదనలు వస్తే వాటిని రియల్ వ్యాపారంలాగా చులకనగా చూసిన జగన్మోహన్ రెడ్డి కేవలం విశాఖను మాత్రమే తన అడ్డాగా ఎంచుకున్నారు.

ఎటూ అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించినందుకు కనీసం అక్కడ చిన్నపాటి పనులు కూడా ఆయన చేపట్టలేదు. అలాగని.. ఏ విశాఖపట్టణాన్ని తాను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారో అక్కడ కూడా ఆయన భూదందా తప్ప నిర్మాణాత్మక పనులతో ముందుకు తీసుకెళ్లలేదు.

వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. రుషికొండలో భవనాలు నిర్మించారు. టూరిజం శాఖ భవనాలుగా వాటిని నిర్మించినప్పటికీ.. అవీ సీఎంగా జగన్ నివాసం కోసమే నిర్మింపబడినవి అనే ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లింది. కోర్టుకు అర్థం పర్థం లేని జవాబులు చెప్పారు. కాదు కూడదు.. కోర్టు కేసులు తెమిలిన తర్వాత నడపబోయే ప్రభుత్వ కార్యాలయాల కోసం వాటిని నిర్మిస్తున్నాం అనే మాట చెప్పడానికి జగన్ ప్రభుత్వానికి అవకాశం రాలేదు.

చంద్రబాబు నాయుడు- జగన్ ఒక విషయంలో మాత్రం ఏకరీతిగా తప్పుచేశారు. చంద్రబాబు వెలగపూడి సచివాలయాన్ని, హైకోర్టును నిర్మించి, వాటిని తాత్కాలిక భవనాలుగా ప్రకటించి.. ఇదే రాజధాని అనే భావన ఏర్పడకుండా చేశారు. జగన్ కూడా అంత అద్భుతమైన భవనాలు నిర్మించి అవి కేవలం టూరిజం గెస్టు హౌసులు అనడం ద్వారా.. విశాఖకు రాజధాని భవనాలు వచ్చినట్టే అనే భావనను అధికారికంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఈలోగా విశాఖనగరం, పరిసరాలంతటా కూడా రియల్ ఎస్టేట్ దందాలు శృతిమించిపోయాయి.

అయితే అనేక రియల్ లావాదేవీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ వారి ప్రమేయమే ఉండడం, ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులంతా వచ్చి విశాఖలో రియల్ దందాలు నడిపిస్తూ ఉంటే.. స్థానిక ప్రజలు భయపడ్డారు. ఆ ఫలితం ఎన్నికల్లో కనిపించింది. విశాఖలోని రియల్ వ్యాపారం కూడా నీటిబుడగ లాగానే పేలిపోయింది.

ఇప్పుడిక చంద్రబాబు అమరావతి వంతు!

మళ్లీ చంద్రబాబు నాయుడు వంతు వచ్చింది. అమరావతి రాజధాని పేరుతో ఆయన యాభైవేల ఎకరాలు పోగేశారు. ఇది అధికారిక ప్రభుత్వ దందా మాత్రమే. కానీ.. ఆ పరిధికి బయట ఎన్ని వేల ఎకరాల తెలుగుదేశం బినామీలు, వారి తైనాతీల స్వాధీనంలో ఉన్నాయో లెక్కలేదు. చంద్రబాబు నాయుడు ఒక కులానికి మేలు చేయడానికి మాత్రమే అమరావతి రాజధాని ప్రతిపాదన చేశారంటూ గతంలో నుంచి కూడా అనేక విమర్శలున్నాయి. ప్రజల ఎదుట అందమైన రాజధానిని కలల్లో చూపిస్తూ.. వారు ఏకపక్షంగా తోసిపుచ్చలేని స్థితిలో.. అమరావతి కలని సజీవంగా నిలబెట్టారు చంద్రబాబు నాయుడు. లౌక్యనీతిలో ఆయన తిరుగులేని నాయకుడు గనుక.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఉదాహరణకు దాదాపు 130 వరకు కేంద్రప్రభుత్వ సంస్థలకు ఆయన భారీగా భూములు కేటాయించారు. ఎంత కామెడీ అంటే ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంతటి సువిశాలమైన స్థలాలు ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు తనను తాను గాడ్ ఫాదర్ సినిమాలో కథానాయకుడిలాగా ఊహించుకుంటూ ‘వారు కాదనలేని ఆఫర్లు’ ఇస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఆఫర్ల వెల్లువలో కేంద్రప్రభుత్వ సంస్థలు రావడం నిర్మాణాలు చేయడం తథ్యం.. అయితే.. తద్వారా తెలుగుదేశం, చంద్రబాబు ఆశిస్తున్న ఫలితం మాత్రం మిగిలిన ప్రాంతాలన్నింటికి రియల్ వేల్యూ పెరగడం మాత్రమే. ఆ సంగతి మనకు రాబోయే రెండు మూడేళ్లలోనే కనిపిస్తోంది.

భూమిని మిగలనివ్వరా?

ఒక పథకం పేరిట ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానిని దిద్దడం సులువు. అదే ప్రభుత్వం దిద్దుకోవచ్చు.. తర్వాతి ప్రభుత్వం వచ్చి రద్దు చేయవచ్చు. కానీ.. భూమి అనేది పునఃసృష్టికి అవకాశం లేని వ్యవహారం. ఉన్న భూములను పరిశ్రమలనీ, ఆఫీసులనీ మొత్తం అంగుళం మిగలకుండా అమ్మేసుకుంటూ కేటాయించేసుకుంటూ పోతే.. భవిష్యత్తు భయవిహ్వలంగా గోచరిస్తుంది. ఇంకొన్నేళ్లు గడిచేసరికి.. అసలు ఎక్కడా భూములు ఉండవు- అప్పుడు ఈ బూటకపు ప్రభుత్వాలు ఏం చేస్తాయి?

చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేది తనకు మాత్రమే తెలుసునని చెబుతూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. సంపద సృష్టి అంటే భూములను అమ్మడం మాత్రమే దారి అని ఆయన అనుకుంటున్నారేమో అనిపించేలా ఉంది. కానీ ఇది ప్రజల ఆస్తిని మాయం చేసేస్తున్నదనే వాస్తవాన్ని గుర్తించాలి. మాయమాటలతో తాము తలచిన పనులు మాత్రమే యథేచ్ఛగా చేసుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వాలు.. భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతాయో వేచిచూడాలి.

..ఎల్. విజయలక్ష్మి

42 Replies to “భూమి చుట్టూ రాజకీయం”

  1. //// అమరావతి రాజదాని పెరుతొ అయన 50 వెల ఎకరాలు పొగెసారు. ఇది అధికారిక భూదందా!///

    .

    అమరవతి కొసం భూమి సమీకరించింది సుమ్మరు 32 వెల ఎకరాలు మాత్రమె. వీళ్ళు పదె పదె తడెపల్లి forest lands కూడా కలుపుకొని 50 వేలు అని డప్పు వెస్తున్నారు. నిజానికి 32 వెల ఎకరాలు అన్నది రాజధాని నగర అవసరాలకి ఎక్కువ ఎమి కాదు. Hyderabad సుమారు ఒక ల.-.క్షా అరవై వెల ఎకరాలలొ ఉంది.

    .

    ల్యాండ్ పూలింగ్ అన్నది చంద్రబాబు కని పెట్టిన కొత్త విషయం కాదు. మన దెశం లొ చాలా చొట్ల ఎప్పటికె ఇలా సెకరించారు. దీనిని అధికారిక భూదందా అని కడుపుకి అన్నం తినె వారు ఎవరూ అనరు.

  2. //// అమరావతి రాజదాని పెరుతొ అయన 50 వెల ఎకరాలు పొగెసారు. ఇది అధికారిక భూదందా!///

    .

    అమరవతి కొసం భూమి సమీకరించింది సుమ్మరు 32 వెల ఎకరాలు మాత్రమె. వీళ్ళు పదె పదె తడెపల్లి forest lands కూడా కలుపుకొని 50 వేలు అని డప్పు వెస్తున్నారు. నిజానికి 32 వెల ఎకరాలు అన్నది రాజధాని నగర అవసరాలకి ఎక్కువ ఎమి కాదు. Hyderabad సుమారు ఒక ల.-.క్షా అరవై వెల ఎకరాలలొ ఉంది.

    .

    ల్యాండ్ పూలింగ్ అన్నది చంద్రబాబు కని పెట్టిన కొత్త విషయం కాదు. మన దెశం లొ చాలా చొట్ల ఎప్పటికె ఇలా సెకరించారు. దీనిని అధికారిక భూదందా అని అన్నం తినె వారు ఎవరూ అనరు.

  3. Veetiki aadyudu, srushti kartha , pitha mana Maha metha… Babu hyd City varake boom kosam danam chesthe mana metha ekkado lepakshi sez, vinukonda lo sez antu state motham vayaparam chesaru… BPL vallaki sites isthunnaru.. Mari middle class vallaku ?

  4. ///సుమరు 130 కెంద్ర సంస్తలకి అయన భారిగా భూములు ఇచ్చారు///

    ఇందులొ తప్పెముంది? ఇచ్చింది ప్రబుత్వ సంస్థలకి. ఇందులొ భూ దందా ఎక్కడ ఉంది?

    ఇక భూమి ఇచ్చిన రైతు బానె ఉన్నాడు, తెలికగా భూమి సెకరించిన ప్రభుత్వం బానె ఉంది, కెంద్ర సంస్థలు బానె ఉన్నయి, అవి కార్యాలయాలు మొదలు పెడితె రాష్ట్రానికీ మంచిదె. మరి మద్యలొ ఈ విజయ లక్ష్మి గారికి వచ్చిన నెప్పి ఎమిటొ నాకు అర్ధం కాలెదు.

    .

    ఇక విజయసాయి రెడ్డి కూతురు, కంపనీ పట్టి ఆ పెరు మీద ఎన్నెన్ని స్తలాలు విశాకలొ కొన్నదొ రాయనె లెదు.

  5. పేరిగే జనాభాకు తగ్గట్టు నగరాలు విస్తరిస్తాయి, ఊరికే రియల్ ఎస్టేట్ కోసం బిల్డప్ ఇస్తే 2008లో జరిగినట్టే రెసిషన్ దెబ్బ గట్టిగా ఉంటుంది. గత ఇరవై సంవత్సరాలలో హైదరాబాద్ జనాభా కనీసం పది రెట్లు పెరిగింది, నగరం ఇపుడు గచ్చిబౌలి సెంట్రిక్ గా తయారైంది. అమరావతి నగరానికి కూడా డొఖా ఉండేది కాదు జగన్ తన సైకో సాడిజంతో తొక్కటం వలన అడవిలా తయారైంది. చూద్దాం, అద్భుతం జరగచ్చు

  6. పేరిగే జనాభాకు తగ్గట్టు నగరాలు విస్తరిస్తాయి, ఊరికే రియల్ ఎస్టేట్ కోసం బిల్డప్ ఇస్తే 2008లో జరిగినట్టే రెసిషన్ దెబ్బ గట్టిగా ఉంటుంది. గత ఇరవై సంవత్సరాలలో హైదరాబాద్ జనాభా కనీసం పది రెట్లు పెరిగింది, నగరం ఇపుడు గచ్చిబౌలి సెంట్రిక్ గా తయారైంది. అమరావతి నగరానికి కూడా డొఖా ఉండేది కాదు జగన్ తన సాడిజంతో తొక్కటం వలన అడవిలా తయారైంది. చూద్దాం, అద్భుతం జరగచ్చు

  7. టూరిజం కోసం కడితే బాత్ టబ్ 2500000 లక్షలు పెట్టిస్తారా? 
    నీతులు చెప్ప వద్దు విజయలక్ష్మి అలియాస్ GA
  8. బలవంతుడు మాటే చెల్లుతుంది అనేది ఆదిమ వేద నీతి చెప్పిందా….ఏ వేదం లో…మీ పైత్యం రుద్దడానికి ఈ వేదం రిఫరెన్స్ తీసుకొన్నారు ??????

  9. సత్యం కళ్ళ ముందు గోచరించిన కాదనలేని సంక్షేమాల బలహీనత majority ప్రజలది. ఆ మత్తులో జోకొట్టడానికి 4th estate అశ్శరభ శరభ అని ఎప్పుడు రెడీ తస్మదీయులు అయితే చాలు

  10. సత్యం కళ్ళ ముందు గోచరించిన కాదనలేని సంక్షేమాల బలహీనత majority ప్రజలది. ఆ మత్తులో జోకొట్టడానికి ౪త్ ఎస్టేట్ అశ్శరభ శరభ అని ఎప్పుడు రెడీ తస్మదీయులు అయితే చాలు

  11. గ్రేట్ ఆంధ్ర లో మరో మంచి ఆర్టికల్, పార్టీ ల విధేయత ని పక్కన పెడితే ఇక్కడ బాగానే రాస్తున్నారు.

    1. ఎందుకో అండి మరి ,

      మీకు బీజేపీ మీద ప్రేమ కన్నా కూడా,

      ఫ్యాన్ పార్టీ మీద ప్రేమ ఎక్కవ లాగ , ఒక్కోసారి బయట పది పోతు వుంటుంది.

      ఇది టీడీపీ, పవన్ లా మీద వున్న కోపం వలన అంటారా..

      1. న్యూట్రల్ గా ఉండే మా మీద ద్వేషం బాగానే చూపిస్తున్నారు, కాని టీడీపీ మీడియా అయిన ఆంధ్రజ్యోతి పచ్చిగా బీజేపీ మీద ద్వేషం చూపించొచ్చు!

        1. రాష్ట్రం, కేంద్రం లో కూటమి లో బీజేపీ కూడా వున్నది కదా , దాని పట్ల ద్వేషం చూపించడం వలన జ్యోతికి వచ్చే లాభం ఏమి వుంటది?

          కాకపోతే , వైఎస్ఆర్ పార్టీకి సాక్షి లాగ జ్యోతి టీడీపీ యొక్క కుటుంబ పత్రిక కాదు కాబట్టి, ఆ పత్రిక మీద టీడీపీ కి 100 శాతం అదుపు వుండే అవకాశం లేదు.

          జ్యోతి లో బీజేపీ వారి ఆర్టికల్స్ కూడా వస్తాయి, లెఫ్ట్ వాళ్ళ ఆర్టికల్స్ తో పాటుగా.

          1. బీజేపీ వాళ్ళ ఆర్టికల్స్ వస్తే ఏముంది? వాళ్ళు మాత్రం నెట్ అంతా గాలించుకు వచ్చి ప్రింట్ నుంచి, వైర్ నుంచి బీజేపీ వ్యతిరేక కథనాల తో నింపుతారు, వాళ్ళ కి మొదటి శత్రువు బీజేపీ. కిందట వారం తొలి పలుకు లో బాధా కృష్ణ రాసాడు కూడా, కాంగ్రెస్ వాళ్ళు BRS ని లేకుండా చేద్దాం అనుకుంటే బీజేపీ వస్తుంది సుమా అని హెచ్చరిక గా!

  12. ఒరేయ్ విజయలక్ష్మి గా,ఇంక నువ్వు మరో పని చూసుకోవటం మంచిది !! పాలను నీళ్లలో కలిపినట్లు, CBN గారిని ద-రి-ద్రు-డు జగన్, ని-కృ-ష్టు-డు KCR తో కలిపి ఆర్టికల్ రాస్తే ప్రజలకు అర్థం కాదు అనుకున్నావా?? Jagan chapter was erased, you better look for another alternative!!

  13. అక్కయ్య, ఏంది ఇప్పుడు

    అగ్ర కులాల వాళ్ళ పొలాలు , పది యకరా లా కంటే ఎక్కవ వుంటే, చిన్న కులాల వాళ్ళకి పంచెయ్యాల అంటావా?

    అలాగే మనిషికి ఒక ఇల్లు కంటే ఎక్కువ వుంటే , మిగతా వాటిని పేదలకి పంచెయ్యాలి అంటావా?

    ఏడుపల పాయ , తాడేపల్లి, బెంగళూర్ , లోటస్ పాండ్ లతో మొదలు పెడదాం , ఈ పంచుడు కార్యం.

    అన్న నీ అడిగి చెప్పు, ఎప్పుడు మొదలు పెడదాం అని.

  14. మహా’మేత గాడు పంచిన బూములు లలొ ముక్యమైనవి …

    1. లెపాక్షి నాలెడ్జ్ హుబ్ అంటూ పదివెల ఎకరాలు ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి కి సమర్పించారు.
    2. భ్రమ్మణి స్తీల్స్ + airport అంటూ గాలి జర్నార్ధన్ రెడ్డి కి 14 వెల ఎకరాలు సమర్పించారు.
    3. VANPIC అంటూ రైతుల పొట్ట కొట్టి 13 వెల ఎలకరాలు మ్యట్రిక్ష్ ప్రసాద్ కి కట్టబెట్టరు.

    వీళ్ళు అందరూ పని కూడా మొదలు కాని జగన్ కంపనెలలొ బారి రెట్లకి వాటాలు కొన్నారు. పాపం ఈ విషయం మాత్రం ఎక్కడా ఈమె రాయనె లెదు.

    రాజధాని కొసం భూమి సెకరిస్తె అది భూ దందా కాదు. భూ దొపిడీ అంటె వై.ఎస్.అర్ జగన్ లది.

  15. అన్నయ్య ప్రజల డబ్బుతో కొన్న తన ఇంట్లో ఫర్నీచర్ గురించీ ఎప్పుడు అన్నయ్య కాలర్ పట్టుకుని అడుగుతావు , అక్కయా?

  16. అమ్మ పెట్టదు , adakka తిననివ్వదు లాగ వుంది నీ వ్యవహారం.

    జగన్ ఈ 5 సంవత్సారాలు ఏమి పీక లేదు. మూడు రాజధానులు అంటూ మూడు కక్కసులు కూడా కట్టలేదు ప్రజల కోసం. తనకు మాత్రం ఖరీదయిన పాలస్ కట్టుకున్నాడు.

    ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎదో ప్రయత్నం చేస్తుంటే, దాని మీద మీ దుష్ప్రచారం ఒకటి.

    మీరు బాగు పడరు రా.

  17. బాగానే వుంది. నలభై ఏళ్ళ క్రితమే రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ” ఈనాడు ” చేసిన కృషిని మర్చిపోవడం దారుణాతి దారుణం స్మీ

  18. అక్కయ్య, ప్రతి ఊర్లో పార్టీ ఆఫిస్ అనే పేరుతో, కొన్ని ఎకరాల ప్రభుత్వ స్థలం ( అనుమతి లేకుండా నీ) పార్టీ రెడ్డి కుల నాయకుల కొట్టేసిన సంగతి భలే నైస్ గా మడత పెట్టీ కప్పేసారు కదా.

    ఒక పట్టు చీర ప్యాలస్ నుండి గ్యారెంటీ గా వస్తుంది లే, ఇన్సెంటివ్ గా.

    1. గెలిచిన MLAల సంఖ్యని బట్టి ఇంత స్థలం కేటాయించుకోవచ్చని GO ఇచ్చిందే 3097 ఇజనరీ.

      ఇచ్చి ఎడాపెడా కేటాయించుకున్నారు తేదేపా .. అదే ప్రకారం వీళ్ళూ చేశారు.. ఇందులో తప్పేం ఉంది?

      1. ఎదొ ఒకటి రెండు చొట్ల కట్టుకుంటారు అనుకొని ఇచ్చారు కాని, అమాతం జగన్ లా నాకెస్తారు అని అనుకొని ఉండరు పాపం!

  19. almost every party with couple of exceptions behave as. pvt. ltd. real estate mafia. let there be no doubts about it. when power changes hands, benamis remain same, new ones emerge, and notional shares move from old party leaders to new ones. if there r any arguments, drama begins, demolitions, acb raids. once. setting is set thru settlement, all is well. now. courts will be dragged into the picture asking for compensation for distressed public who are scapegoats. all bodies who approved should be sued @. 10 x the damaged properties values plus. opportunity cost being. lost. in the process.

  20. Water is getting under the seat for Kootami as more and more people are questioning the additional 50L votes polled in last elections. Freshly, husband of central finance minister raised concern on the legitimacy quoting findings from an NGO fighting for transparency in democratic electioneering process.

  21. భూమి విలువ బాగా తెలిసిన నీచుడు జగన్ రెడ్డి పేదలకు సెంటు భూమి ఇచ్చి లాక్కుని , వాడు మాత్రం 100 ఎకరాలకు తక్కువ లేకుండా పాలస్ లు కట్టుకున్నాడు నీచుడుకి నీతులకి కొదవలేదు

  22. దరిద్రుడు బెంగుళూరు లో అడుగు పెట్టినప్పుడల్లా ఉక్క పోత గా ఉంటుంది వాతావరణం…దిక్కుమాలిన మోహమోడు…దిక్కుమాలిన పాదం

  23. ఇంతకీ ఏమి చెప్ప దలుచుకున్నారు విజయ లక్ష్మి మాడం. 70 వ దశకం లో హైదరాబాద్ బంజరు భూములకు ఇంత విలువ ఉంటుందని ఎవరన్నా ఊహించారా? బాబు IT కి వేసిన పునాది, మిగతా సీఎం లు దానిని ముందుకు తీసుకువెళ్లిన విధానం వల్ల రేట్స్ పెరిగాయి, దీనివల్ల ప్రజలకు మేలు జరగలేదని చెప్పగలరా? అలా అని రాజకీయనాయకులు బాగుపడకూడదు అని ఏ ప్రాతిపదికన చెప్పగలం. ఇన్సైడర్ ట్రేడింగ్ అని గోల పెట్టిన జగన్ ఏమి నిరూపించలేక పోయాడు, అక్కడ భూముల ధరలను తగ్గించిన చెడ్డ పేరు జగన్ మూట కట్టుకున్నాడు, దానివల్ల ప్రజలే నష్టపోయారు. ఇంకా అమరావతి అయినా, కొత్త నగరం ముచ్చెర్ల, కడ్తాల్ పైన మన ఏడుపు అనవసరం. బినామీ పేర్లతో హైదరాబాద్ ఆస్తులు దోచుకున్న కెసిఆర్ నే ఏమి చెయ్యలేకపోయారు. వైజాగ్ లో కబ్జా చేసిన భూముల లిస్ట్ బయటకు వస్తది తొందర్లో.

Comments are closed.