టీడీపీ నేత‌లు సంతోషంగా ఉన్నారా?

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి రెండు నెల‌లు దాటింది. ప్ర‌భుత్వం వ‌స్తే, అది చేసుకోవ‌చ్చు, ఇది చేసుకోవ‌చ్చు అంటూ ముఖ్యంగా టీడీపీ నేత‌లు ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఇంత‌కాలం తాము క‌న్న క‌ల‌లు…

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి రెండు నెల‌లు దాటింది. ప్ర‌భుత్వం వ‌స్తే, అది చేసుకోవ‌చ్చు, ఇది చేసుకోవ‌చ్చు అంటూ ముఖ్యంగా టీడీపీ నేత‌లు ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఇంత‌కాలం తాము క‌న్న క‌ల‌లు నెర‌వేర్చుకునే ప‌రిస్థితి లేద‌ని టీడీపీ నేత‌లు వాపోతున్నారు. ఏ ప్ర‌భుత్వంలో అయినా ముఖ్య‌మంత్రి, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఐదారుగురు మాత్రమే ఆర్థికంగా బాగుప‌డ‌తారు.

గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వంలో ఇదే జ‌రిగింది. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి. ఒక‌టి మాత్రం నిజం. టీడీపీ నేత‌ల్లో చిన్న అసంతృప్తి. ప్ర‌భుత్వం వ‌చ్చి రెండు నెల‌లైనా నామినేటెడ్ పోస్టుల‌పై అడుగులు ముందుకు ప‌డ‌లేద‌ని. ఒక్క‌సారిగా అన్ని ర‌కాల నామినేటెడ్ పోస్టులు కాక‌పోయినా, కొన్నైనా భ‌ర్తీ చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో వుంది. ఇప్పుడు ప్ర‌తి విష‌యంలోనూ జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల‌కు అధికారంలో భాగం ఇవ్వాల్సి రావ‌డం టీడీపీ నేత‌ల‌కు క‌ష్టంగా వుంది.

ఆదాయ వ‌న‌రుల‌పై టీడీపీ నేత‌లు దృష్టి సారించారు. అయితే ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీగా వుండ‌డంతో ఏం చేసుకోవాల‌న్నా దిక్కుతోచ‌ని స్థితి. ఇలాగైతే గ‌ట్టెక్క‌డం ఎలా? అనే ప్ర‌శ్న టీడీపీ నేత‌ల ఎదుట నిటారుగా నిలిచింది. ప్ర‌భుత్వం వ‌చ్చింద‌న్న ఆనందం త‌ప్ప‌, మ‌రే సుఖం లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఏమైనా వుంటే చూడండ‌బ్బా అని వైసీపీ నేత‌ల్ని టీడీపీ నేత‌లు అడుగుతున్న ప‌రిస్థితి.

మ‌రికొన్ని చోట్ల వైసీపీ నేత‌ల వ్యాపారాల్ని టీడీపీ నేత‌లు లాక్కున్నారు. ఇదో విచిత్ర‌మైన ప‌రిస్థితి. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పేకాట‌, ఇత‌ర‌త్రా చ‌ట్ట విరుద్ధ‌మైన ఆట‌ల‌కు టీడీపీ నేత‌లు తెర‌లేపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప‌ది రూపాయ‌లు సంపాదించుకోవాల‌న్న ఆత్రుత వాళ్ల‌లో క‌నిపిస్తోంది. చ‌ట్ట‌బ‌ద్ధంగా ఈ ప్ర‌భుత్వంలో ఏమీ చేసుకోలేమ‌న్న భావ‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది. ఇలా ఎన్నాళ్లో చూడాలి మ‌రి!

8 Replies to “టీడీపీ నేత‌లు సంతోషంగా ఉన్నారా?”

Comments are closed.