ఎన్టీఆర్-నీల్ సినిమా.. కళ్లు చెదిరే బడ్జెట్?

ఎన్టీఆర్ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న నీల్.. ఈ సినిమాకు 350 కోట్ల రూపాయల బడ్జెట్ ను కోట్ చేశాడంట.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా లాంఛ్ చేశాడు ఎన్టీఆర్. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు. ఇప్పుడీ మూవీ బడ్జెట్ డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఈ నంబర్ వింటే కాస్త షాక్ అవ్వాల్సిందే..

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోందని సమాచారం. ఇదే కనుక నిజమైతే.. ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు, నీల్ కెరీర్ లో కూడా ఇదే బిగ్ బడ్జెట్ సినిమా అవుతుంది.

ప్రభాస్ తో సలార్ తీశాడు నీల్. ఆ సినిమాకు అటుఇటుగా 270 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఎన్టీఆర్ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న నీల్.. ఈ సినిమాకు 350 కోట్ల రూపాయల బడ్జెట్ ను కోట్ చేశాడంట.

నిజానికి ఈ కథను ఇప్పటివరకు నీల్ తెరపైకి తీసుకురాకపోవడానికి కూడా కారణం ఇదే. ఈ కథకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందని, అందుకే ఏళ్లుగా ఈ స్టోరీని తెరపైకి తీసుకురాకుండా అలా పక్కనపెట్టాడంటూ గతంలోనే కథనాలు వచ్చాయి.

ఎట్టకేలకు మైత్రీ మూవీ మేకర్స్ రూపంలో ఖర్చుకు వెనకాడని నిర్మాతలు దొరకడంతో నీల్ ఈ కథను బయటకు తీశాడు. ఎన్టీఆర్ తో తన డ్రీమ్ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు.

5 Replies to “ఎన్టీఆర్-నీల్ సినిమా.. కళ్లు చెదిరే బడ్జెట్?”

Comments are closed.