జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం!

శాస‌న‌మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ నియామ‌కంపై ఆ పార్టీలో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. Advertisement గ‌త నెల‌లో మండ‌లిలో వైసీపీ…

శాస‌న‌మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ నియామ‌కంపై ఆ పార్టీలో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌త నెల‌లో మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడిగా లేళ్ల అప్పిరెడ్డిని నియ‌మించ‌డంపై విమ‌ర్శ‌లు వినిపించాయి. ఈ నియామ‌కానికి నిరస‌న‌గా మాజీ ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే లేళ్ల నియామ‌కంలో దొర్లిన త‌ప్పును జ‌గ‌న్ త్వ‌ర‌గానే స‌రిదిద్దుకున్నారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏకగ్రీవ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఎమ్మెల్సీగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే మండ‌లి ప‌క్ష నాయ‌కుడైన లేళ్ల‌తో జ‌గ‌న్ రాజీనామా చేయించ‌డం గ‌మ‌నార్హం. ఆ వెంట‌నే బొత్స‌ను నియ‌మిస్తూ మండ‌లి చైర్మ‌న్‌కు జ‌గ‌న్ లేఖ రాశారు.

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ మండ‌లి ఆ పార్టీకి నాయ‌కత్వం వ‌హించ‌డం రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం. మండ‌లిలో వైసీపీకి బ‌లం వుంది.

శాస‌న‌స‌భ‌లో వైసీపీకి కేవ‌లం 11 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. దీంతో మండ‌లిలో వైసీపీ స‌భ్యుల పాత్ర క్రియాశీల‌కంగా మారింది. అందుకే మండ‌లిలో సీనియ‌ర్ నాయ‌కుడైన బొత్స నాయ‌క‌త్వం వ‌హించ‌డం అన్ని ర‌కాలుగా మంచిద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

14 Replies to “జ‌గ‌న్ మంచి నిర్ణ‌యం!”

  1. జగన్ అన్నా, 3.6 కోట్లు ఖర్చు చేసి , రోజూ కి వెయ్యి ఎగ్ పఫ్ లు నువ్వు ఒక్కడే ఎలా తిన్నావో చెప్పవా , ప్లీజ్.

  2. సత్తేన్న కి ఒక్కడికే ప్యాలస్ పులకేశి గాడిని బట్టలు ఊ*డదీసి రోడ్డు మీద నిలబెట్టే సత్తా వింది.

Comments are closed.