మంగళవారం ఆంధ్ర-సీడెడ్ @ 8 కోట్లు

ఒక్క టీజర్ తో క్రేజ్ వచ్చేస్తుంది ఒక్కో సినిమాకు. విడుదల తరువాత రిజల్ట్ సంగతి పక్కన పెడితే టీజర్ అనేది సినిమా మీద ఓ అంచనాకు దారి తీస్తుంది. ఆ మేరకు బిజినెస్ స్టార్ట్…

ఒక్క టీజర్ తో క్రేజ్ వచ్చేస్తుంది ఒక్కో సినిమాకు. విడుదల తరువాత రిజల్ట్ సంగతి పక్కన పెడితే టీజర్ అనేది సినిమా మీద ఓ అంచనాకు దారి తీస్తుంది. ఆ మేరకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అసలు టీజర్ వదిలేదే సినిమా మీద బజ్ కు, బిజినెస్ కు. 

దర్శకుడు అజయ్ భూపతి లేటెస్ట్ సినిమా మంగళవారం. టీజర్ వదిలే వరకు అది ఏ జానర్ అన్నది తెలీదు. టీజర్ వచ్చింది. మాంచి హర్రర్.. సస్పెన్స్.. థ్రిల్లర్ అని అర్థం అయింది. అంతకు మించి టీజర్ లో పడిన రెండు మూడు అడల్డ్ కంటెంట్ షాట్ లు బజ్ ను సర్రున లేపాయి.

ఇప్పుడు ఈ సినిమాను ఆంధ్ర-సీడెడ్ కు కలిపి 7.20 కోట్లకు సింగిల్ పాయింట్ అమ్మేసారు. అమ్మేసారు అనే కన్నా…టీజర్ చూసి కొనుక్కున్నారు అనడం కరెక్టేమో? ఇప్పుడు ఇలా కొనుకున్నవారు కేవలం ఆంధ్రనే ఆరు కోట్లు చెబుతున్నారు. అంటే సీడెడ్ మరో రెండు కోట్లు అనుకుంటే, విడుదలకు ముందే బయ్యర్ కు ఓ ఎనభై లక్షలు లాభం అన్నమాట.

పాయల్ రాజ్ పుత్ కు ఆర్ఎక్స్ 100 తరువాత ఇప్పటి వరకు హిట్ లేదు. అజయ్ భూపతి కూడా తన రెండో సినిమాతో సక్సెస్ కొట్టలేదు. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూంది. ఆర్ఎక్స్ 100 మాదిరిగానే బోల్డ్ సినిమాలో బోల్డు వున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. బహుశా అందుకే ఈ క్రేజ్ కావచ్చు.