అయితే అతి వృష్టి.. లేదంటే అనావృష్టి

చంద్రబాబు అంటే కిట్టని వారు చెప్పే మాట ఒకటి వుంది. చంద్రబాబు పాలనలో కరువు వుంటుంది. వర్షాలు వుండవు అనేదే అ మాట. కానీ ఈసారి చంద్రబాబు అధికారంలోకి రాగానే వర్షాలు తెగ కురిసాయి.…

చంద్రబాబు అంటే కిట్టని వారు చెప్పే మాట ఒకటి వుంది. చంద్రబాబు పాలనలో కరువు వుంటుంది. వర్షాలు వుండవు అనేదే అ మాట. కానీ ఈసారి చంద్రబాబు అధికారంలోకి రాగానే వర్షాలు తెగ కురిసాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండా నీళ్లే. దాంతో తెలుగుదేశం మద్దతు దారులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసారు. మంచిదే కదా, వర్షాలు పడి, పంటలు బాగుంటే అని అనుకున్నారంతా.

కానీ ఇప్పుడు చూస్తే వ్యవహారం తిరగబడింది. అతి వర్షాలతో ఏపీ విలవిలలాడుతోంది. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం తప్పలేదు. ఈస్ట్ లో పరిస్థితి ఓ మాదిరిగా వుంది. ఈస్ట్ వెస్ట్ ల్లో అరటి పంటలు గాలివానలకు నష్టపోతున్నాయి ఉత్తరాంధ్రలో ప్రస్తుతం బాగానే వుంది. ఈ వర్షాలు ఇక్కడితో సరిపెడితే ఫరవాలేదు. లేదా ఇంకా పెరిగితే మాత్రం వరి చేలకు నష్టం.

మనకు నవంబర్, డిసెంబర్ నెలలు తుపానులకు పెట్టింది పేరు. జ‌నం అదృష్టం బాగుండి ఈ రెండు నెలలు సజావుగా సాగిపోతే సమస్య లేదు. అంతా హ్యాపీ. ప్రభుత్వం కూడా కాస్త ఊపిరి పీల్చుకుని పాలన మీద దృష్టి పెట్టడానికి వీలవుతుంది. అలా కాకుండా ఈ రెండు నెలల్లో రెండు తుపానులు వస్తే బాబుగారిని మళ్లీ కిట్టని వారంతా అతివృష్టి.. అనావృష్టి అంటూ ట్రోల్ చేస్తారేమో?

22 Replies to “అయితే అతి వృష్టి.. లేదంటే అనావృష్టి”

  1. then why did jagan lost so badly based on your article?

    one thing is clear. there is a thin line which YSR did not cross but ycp supporters do now under jagan.

    will be gradual but end of ycp party

  2. this website wrote following in another article. Is this article any different from that?

    “సాక్షి మీడియా ఏం చేస్తుందంటే చంద్ర‌బాబు లోపాలు, వైఫ‌ల్యాలు, పాపాలు, మోసం ఇలాంటి ప‌దాల మీద ఆధార‌ప‌డుతూ వార్త‌లు వండుతూ వుంటుంది. అందులో ఉప్పుకారం వుండ‌వు.”

    keep dishing hate.

  3. ఇలాంటి ఆర్టికల్ రాయడానికి సిగ్గు ఉండాలి. తు నీ బతుకు చెడా. ఈ లెక్కన అన్న వస్తే కోవిద్ లు చావులేనా?

Comments are closed.