ఎనౌన్స్ మెంట్ వీడియో వస్తోంది

మొన్నటికిమొన్న హిట్-3 ఎనౌన్స్ మెంట్ వీడియో ఎంత కిక్కిచ్చిందో చూశాం. నిమిషాల్లో వైరల్ అయింది ఆ వీడియో. ఇప్పుడు నాని నుంచి మరో ఎనౌన్స్ మెంట్ వీడియో రాబోతోంది. Advertisement శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో…

మొన్నటికిమొన్న హిట్-3 ఎనౌన్స్ మెంట్ వీడియో ఎంత కిక్కిచ్చిందో చూశాం. నిమిషాల్లో వైరల్ అయింది ఆ వీడియో. ఇప్పుడు నాని నుంచి మరో ఎనౌన్స్ మెంట్ వీడియో రాబోతోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు నాని. దీనికి సంబంధించి ఎనౌన్స్ మెంట్ వీడియో షూటింగ్ మొదలుపెట్టారు. చిన్న విరామం తర్వాత మరోసారి యాక్షన్-కట్ చెప్పే అవకాశం వచ్చిందని తెలిపిన శ్రీకాంత్ ఓదెల.. నానితో చేయబోయే కొత్త సినిమాతో దసరా మూవీ కంటే 100 రెట్ల ఎక్కువ కిక్ అందించబోతున్నట్టు ప్రకటించాడు.

దసరా సినిమాతో పోలిస్తే కథ, నిర్మాణం పరంగా ఇది చాలా పెద్ద సినిమా. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటివరకు పోషించని ఓ మాస్ పాత్రను నాని ఇందులో పోషించబోతున్నాడు.

సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ వీడియో మాత్రమే విడుదల చేస్తారు. హిట్-3 షూటింగ్ పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల మూవీ సెట్స్ పైకి వస్తుంది.

One Reply to “ఎనౌన్స్ మెంట్ వీడియో వస్తోంది”

Comments are closed.