తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. సాంకేతికంగా మూడో ముఖ్యమంత్రి అన్నమాట. తెలంగాణ ఏర్పడగానే దళితుడిని సీఎం చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా గొప్పగా చెప్పాడు. సరే …తెలంగాణ ఏర్పడింది.
కానీ ఏమైంది? తెలంగాణను ఎవరికో అప్పగిస్తే ఆగమైతుందని, వలస పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఆ బాధ్యత తాను తీసుకుంటానని కేసీఆర్ చెప్పాడు. సీఎం కావాలనే బలమైన కోరిక ఆయనకు ఎప్పటినుంచో మనసులో ఉంది. అందుకే బీసీకి ఆ పదవి ఇవ్వలేదు. రెండోసారీ తానే సీఎం అయ్యాడు.
తన తరువాత కొడుకు కేటీఆర్ ను సీఎం చేద్దామనుకొని అందుకు ప్లాన్ చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. చివరకు రేవంత్ రెడ్డి సీఎం పీఠం మీద కూర్చున్నాడు. కేసీఆర్ వెలమ అయితే , రేవంత్ రెడ్డి ఏ సామాజికవర్గమో తెలుస్తూనే ఉంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ అగ్రవర్ణాలవారే. ఉమ్మడి ఏపీకి రెండో ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య మాత్రమే దళితుడు.
కానీ ఆయన కొద్దికాలం మాత్రమే పదవిలో ఉన్నాడు. దేశంలోనే తొలి దళిత సీఎం సంజీవయ్య. ఇక ఉమ్మడి ఏపీ పనిచేసిన వారంతా అగ్రవర్ణాలవారే. వారిలో కూడా అత్యధికం రెడ్లు. కేసీఆర్ మీద ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసే విమర్శల్లో దళిత ముఖ్యమంత్రి ఒకటి. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశాడని విమర్శిస్తుంటారు.
అయితే …తాజాగా బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డేనని అన్నాడు. అంటే …ఆయన తరువాత దళితుడు సీఎం అవుతాడని చెబుతున్నాడన్నమాట. మరి ఆయన ఏ అంచనా ప్రకారం చెప్పాడో తెలియదు.
వచ్చే టర్మ్ లో కూడా రేవంత్ రెడ్డే సీఎం అవుతాడని కొందరు కాంగ్రెస్ నాయకులు, కొందరు మంత్రులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి కూడా ఆ ఆశ ఉన్నట్లుంది. ఒకసారి సీఎం అయిన నాయకుడు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు అధిష్టానం చేతిలో ఉంటాయి కాబట్టి రేవంత్ కు ప్రతికూల పరిస్థితి ఏర్పడకపోతే, ఆయన పనితీరుపట్ల అధిష్ఠానం సంతృప్తిపడితే మళ్ళీ సీఎం అవుతాడు.
అదికూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలి. ఆ తరువాత కదా దళిత సీఎం సంగతి. ఒకవేళ గులాబీ పార్టీ గెలిస్తే దళిత సీఎం ఊసే ఉండదు. సీఎంగా కేసీఆర్ అవుతాడు లేదా కేటీఆర్ అవుతాడు. అనుకున్నవి జరగడం రాజకీయాల్లో అంత సులభం కాదు.
vc available 9380537747
Call boy works 9989793850
కాంగ్రెస్ లో సీఎం పదవి రేసులో చాలా మందే ఉంటారని చెప్తారు.
అందులో తనది లేటెస్ట్ ఎంట్రీ అని హింట్ ఇచ్చాడా?