ప‌రిటాల శ్రీ‌రామ్ ఆగ‌డాల‌పై నోరు మెద‌ప‌రేం?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా టీడీపీ యువ నాయ‌కుడు ప‌రిటాల శ్రీ‌రామ్ ఆగ‌డాల‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు నోరు మెద‌ప‌డం లేదు. ఇదే ఇత‌ర సామాజిక వ‌ర్గాలు, అణ‌గారిన వ‌ర్గాల నాయ‌కులు ప‌రిటాల కుటుంబ స‌భ్యుల మాదిరిగా…

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా టీడీపీ యువ నాయ‌కుడు ప‌రిటాల శ్రీ‌రామ్ ఆగ‌డాల‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు నోరు మెద‌ప‌డం లేదు. ఇదే ఇత‌ర సామాజిక వ‌ర్గాలు, అణ‌గారిన వ‌ర్గాల నాయ‌కులు ప‌రిటాల కుటుంబ స‌భ్యుల మాదిరిగా దౌర్జ‌న్యాల‌కు తెగ‌బ‌డి వుంటే, సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారంటూ ఊద‌ర‌గొట్టేవారు. కానీ ప‌రిటాల కుటుంబం చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గంతో పాటు బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం వుండ‌డంతో చంద్ర‌బాబుతో స‌హా ప్ర‌భుత్వ పెద్ద‌లు మంద‌లించ‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌నే చ‌ర్చ టీడీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది.

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా ధ‌ర్మ‌వ‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా మ‌ల్లికార్జున్‌ను మంత్రి స‌త్య‌కుమార్ ఏరికోరి మ‌రీ తెచ్చుకున్నారు. వైసీపీ హ‌యాంలో త‌మ‌ను వేధించిన అధికారిని క‌మిష‌న‌ర్‌గా ఎలా తీసుకొస్తార‌ని ప‌రిటాల శ్రీ‌రామ్ ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ త‌మ అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా క‌మిష‌న‌ర్ ఆఫీస్‌కు వ‌స్తే, తానే వెళ్లి మెడ‌పెట్టుకుని బ‌య‌టికి గెంటేస్తాన‌ని ప‌రిటాల శ్రీ‌రామ్ బ‌హిరంగంగానే హెచ్చ‌రించడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మ‌రోవైపు మంత్రి, ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కూడా అయిన స‌త్య‌కుమార్ మాత్రం క‌మిష‌న‌ర్‌ను వెన‌కేసుకొస్తున్నారు. మంచి అధికారిగా కితాబిచ్చారు. మంత్రి శ‌నివారం ధ‌ర్మ‌వ‌రంలో ప‌ర్య‌టించారు. క‌మిష‌న‌ర్‌తో పాటు ఇత‌ర అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించార‌ని తెలుసుకుని టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు భారీగా వెళ్లారు. స‌త్య‌కుమార్‌ను అడ్డుకుని ర‌భ‌స చేశారు.

దాదాపు రెండు గంట‌ల పాటు రోడ్డుపై ధ‌ర్నా నిర్వ‌హించారు. దీంతో ప్ర‌జానీకానికి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ధ‌ర్మ‌వ‌రంలో టీడీపీ, బీజేపీ శ్రేణుల మ‌ధ్య గొడ‌వ‌లు అప్పుడే కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌నంలో వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. ధ‌ర్మ‌వరంలో స‌త్య‌కుమార్‌ను తామే గెలిపించామ‌ని, పెత్త‌నం తామే చేస్తామ‌ని ప‌రిటాల శ్రీ‌రామ్ చెప్ప‌డం మంత్రితో స‌హా ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. ఈ ప‌రిణామాలు కూట‌మి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారాయి.

ప‌రిటాల శ్రీ‌రామ్ అహంకార ధోర‌ణి ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. కానీ ప‌రిటాల శ్రీ‌రామ్ వ్య‌వ‌హార శైలి పార్టీకి న‌ష్టం తీసుకొస్తున్నా ఎందుక‌ని టీడీపీ, ప్ర‌భుత్వ పెద్ద‌లు స్పందించ‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇదే రీతిలో ప‌రిటాల శ్రీ‌రామ్ వ్య‌వ‌హ‌రిస్తే రానున్న రోజుల్లో ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలో టీడీపీకి రాజ‌కీయంగా భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న ఆ పార్టీ శ్రేణుల్లో నెల‌కుంది.

8 Replies to “ప‌రిటాల శ్రీ‌రామ్ ఆగ‌డాల‌పై నోరు మెద‌ప‌రేం?”

  1. పరిటాల వాళ్ళు గెలిచేది లేదు బొంగు లేదు ఏదో EV@M తో గెలిచారు ధర్మవరం ప్రజలికి కావాలి లే కేతిరెడ్డి కాకుండా ఇలాంటి వారి గెలిపించారు అప్పుడే దండాలు మొదలు రౌడీ లు తో గలాటాలు కానీ

  2. సంపద సృష్టి లేదు – 40 ఏళ్ల అనుభవం లేదు, వంకాయ లేదు…..అంతా దోపిడీనే!!

    మళ్ళీ 3000 వేలకోట్ల అప్పు.

    ఎక్కడకి పోతుంది ఈ డబ్బు అంతా ?

    Corporations కి guarantee ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిపి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు 50 వేలకోట్లు పై మాటే.

    చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించి ఖజానా లోఉన్న డబ్బు దాదాపు 7000 కోట్లు. అది కాకుండా కేంద్రం నుండి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉంది.

    పిల్లలు తినే గోరుముద్ద తో సహా జగన్ గారి 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నడవడం లేదు.

    పాత బిల్లులు చెల్లించడం లేదు.

    7800 కోట్ల రూపాయల వరద నష్టం అని అంచనా వేసి కేంద్రానికి నివేదిక 10 రోజుల క్రితమే పంపినా, ఇప్పటి వరకు సాయం గురించి ప్రకటన రాలేదు. దోపిడీ ….దోపిడీ ….దోపిడీ…..మోసం.. మోసం …. మోసం ….దగా….దగా ….దగా.

  3. మీకెవరికి అర్థం కావట్లెదు….మన అంద్రా కు సంబందించి …….అహంకారం లొ ర్యాంకింగ్స్ ఇస్తె

    First rank goes to Pawan Kalyan

    Second rank goes to Jagan

Comments are closed.