వీణ స్టెప్పు కోసం ఆగాల్సిందే

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజైంది. ఈ పాటలో చిరంజీవి వీణ స్టెప్ ను రీ-క్రియేట్ చేశాడు రామ్ చరణ్. పాట విడుదలకు సరిగ్గా 24 గంటల ముందు ఈ బ్రేకింగ్…

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజైంది. ఈ పాటలో చిరంజీవి వీణ స్టెప్ ను రీ-క్రియేట్ చేశాడు రామ్ చరణ్. పాట విడుదలకు సరిగ్గా 24 గంటల ముందు ఈ బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టాడు నిర్మాత దిల్ రాజు.

దీంతో పాట కోసం, అందులో వీణ స్టెప్పు కోసం మెగాభిమానులు గట్టిగా ఎదురుచూశారు. అయితే పాటొచ్చింది కానీ, అందులో వీణ స్టెప్పు లేదు. దీంతో కొంచెం నిరాశ చెందారు.

సాధారణంగా ఏ సినిమా పాటైనా లిరికల్ వీడియో రూపంలో వస్తుంది. మధ్యమధ్యలో సినిమా బిట్స్, ఆన్-లొకేషన్ మేకింగ్ వీడియోస్ చూపిస్తారు. మచ్చా-మచ్చా సాంగ్ లో కూడా అదే పని చేశాడు. వీణ స్టెప్ లిరిక్స్ దగ్గర కేవలం రామ్ చరణ్ వీణ స్టెప్ వేస్తున్న ఫొటోను మాత్రం చూపించి సరిపెట్టారు.

ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్పు సూపర్ డూపర్ హిట్టయింది. ఆ మూమెంట్ ను గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ రీ-క్రియేట్ చేశాడు. అయితే అది చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. ఇక పాట విషయానికొస్తే, ట్యూన్ లో పెద్దగా మెరుపుల్లేవ్. తమన్ స్టయిల్ లో మ్యూజిక్, శంకర్ స్టయిల్ లో మేకింగ్ ఉన్నాయి.

8 Replies to “వీణ స్టెప్పు కోసం ఆగాల్సిందే”

  1. ఏంటి ఈ పాటలు బాబూ నిన్ను ఒక దారికి తెస్తాడు శెంకర్ బాబాయ్

Comments are closed.