కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కాన్సస్ తెలుగు సంఘం(Telugu Association of Greater Kansas City- TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయం లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. Advertisement దాదాపు 1500 మంది తెలుగు వారు వచ్చిన…

కాన్సస్ తెలుగు సంఘం(Telugu Association of Greater Kansas City- TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయం లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

దాదాపు 1500 మంది తెలుగు వారు వచ్చిన ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఎంతో మంది చక్కగా బతుకమ్మ లను చేసుకొని వచ్చి, మొదటి నుండి చివరి వరకు తెలంగాణ జానపద పాటలకు, బతుకమ్మ పాటలకు ఆడి, పాడి ఆనందించారు.

దేవాలయ పూజారి నిర్వహించిన అమ్మ వారి పూజ తో సంబరాలు ఆరంభం అయ్యాయి. పెద్ద వాళ్ళే కాకుండా, చిన్నపిల్లలు, యువతులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. బతుకమ్మలు తెచ్చిన వారికి Raffle Tickets ఇచ్చి మధ్య మధ్య లో Raffles లో గెలిచిన వారికి బహుమతులు అంద చేశారు.

బతుకమ్మ లన్నింటి లో మంచిగా చేసిన 8 బతుకమ్మ లకు బహుమతులు ఇచ్చారు. చివరన బతుకమ్మ లను నిమజ్జనం చేసి అందరూ ఒక కుటుంబం వలె ప్రసాదం పంచుకొని సంబరాలని ముగించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గ సభ్యుల కి, sponsors కి సంఘం అధ్యక్షుడు శ్రీ యక్కలి చంద్ర, trust chair శ్రీ శివ తియగూర ధన్యవాదాలు తెలిపారు.

Photo Gallery 

2 Replies to “కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు”

Comments are closed.