నిర్మాతకు నష్టం.. నాగవంశీకి లాభం

నిర్మాతలు లాభం కళ్ల చూడాలి అంటే శాటిలైట్ ల రూపంలో కనీసం 60 కోట్లు రావాల్సి వుంటుంది.

దేవర సినిమా థియేటర్ జ‌ర్నీ మిక్స్ డ్ టాక్ తో స్టార్ట్ అయింది. థాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అర్ధరాత్రి ప్రత్యేక మైన రేట్లతో కూడిన ప్రత్యేకమైన అటలు, అద్భుతమైన రేట్లు వచ్చాయి. అభిమానుల అరేళ్ల ఎదురుచూపు అభిమానంగా మారి డబ్బుకు వెరవకుండా చేసింది. దాంతో మొదటి రోజే అధ్భుతమైన నెంబర్ కనిపించింది. మొత్తం మీద దసరా వేళకు అందరు బయ్యర్లు సేఫ్ స్టేజ్‌కు చేరిపోయే పరిస్థితి వుంది. కొన్ని చోట్లు జీఎస్టీతో కలిసి సేఫ్ అవుతారు. ఒకటి రెండు చోట్ల జీఎస్టీ కాకుండా సేఫ్ అవుతారు. నిన్నటికి నిన్న కలెక్షన్లు చూసిన తరువాత మరింత హొప్ పెరిగింది. సీడెడ్, వైజాగ్, నైజాం ఓవర్ ఫ్లోస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ సంగతి అలా వుంచితే దేవర సినిమా నిర్మాతలైన ఎన్టీఅర్ అర్ట్స్, సుధాకర్ మిక్కిలినేని లకు లాభమేనా? అన్నది క్వశ్చను.

ఎందుకంటే సినిమాకు 400 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇందులో 350 కోట్ల రూపాయిలు వివిధ రూపంలో రికవరీ వచ్చింది. ఇంక యాభై కోట్లు రావాలి. నిర్మాతల దగ్గర సినిమా శాటిలైట్ హక్కులు వున్నాయి. అవి అమ్ముడైతే కవర్ అయిపోతామనే లెక్కలో వున్నారు. కానీ ఇప్పుడు శాటిలైట్ రూపంలో యాభై కోట్లు రాకుంటే కష్టం అవుతుంది. అలాగే ఇప్పుడు జీఎస్టీ వెనక్కు ఇవ్వాలి. అది కనీసం ఓ పది కోట్లకు కాస్త అటుగానే వుంటుంది.

అందువల్ల నిర్మాతలు లాభం కళ్ల చూడాలి అంటే శాటిలైట్ ల రూపంలో కనీసం 60 కోట్లు రావాల్సి వుంటుంది. లేదా హిందీ వెర్షన్ నుంచి ఖర్చులు పోను మంచి మొత్తం రావాల్సి వుంటుంది.

పుష్ప పార్ట్ వన్ పరిస్థితి కూడా ఇదే. అ సినిమా హిందీలో అద్భుతంగా అడింది. కానీ తెలుగు నాట చాలా మంది బయ్యర్లకు వెనక్కు డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పార్ట్ 2 మీద లాభాలు కళ్ల చూస్తారు. ఇప్పుడు దేవర కూడా అదే అశతొ వుండాలి. కానీ దేవర 2 కూడా అదే అశతో వుండాలి. కానీ దేవర 2 తెర మీదకు రావాలంటే కనీసం మరో నాలుగేళ్లు పడుతుందేమో?

ఎన్టీఅర్ రెండు భారీ సినిమాలు ఫినిష్ చేసిన తరువాత కానీ దేవర 2 మీదకు వచ్చే చాన్స్ అయితే లేదు. అందువల్ల నిర్మాత డబ్బులు కవర్ కావాలంటే శాటిలైట్ మంచి సూపర్ రేటుకు అమ్ముడుకావాల్సిందే. అందుకోసమే దేవర సినిమాకు విడుదల కన్నా ముందుగా కన్నా, విడుదల తరవాత సోషల్ మీడియా ప్రచారం చాలా ఎక్కువగా వుంది.

మళ్లీ మొదటికి వస్తే దేవర సినిమాను రెండు తెలుగు రాష్ఠ్రాలకు కలిపి నిర్మాత సుధాకర్, సితార నాగవంశీకి అవుట్ రేట్ కు ఇచ్చేసారు. అంటే ఇక లాభం, నష్టం నాగవంశీవే. దసరా సీజ‌న్ లో కనుక దేవర మంచిగా కలెక్షన్లు రాబడితే నైజాం, వైజాగ్, సీడెడ్ ప్రాంతాల నుంచి మంచి ఓవర్ ఫ్లోస్ వస్తాయి. మిగిలిన ఏరియాలకు జీఎస్టీ కూడా ఇవ్వనవసరం లేదు.

అంటే దేవర ఫస్ట్ పార్ట్ నిర్మాత సుధాకర్ కన్నా బయ్యర్ నాగవంశీకే లాభం అనుకోవాలి.

9 Replies to “నిర్మాతకు నష్టం.. నాగవంశీకి లాభం”

  1. దేవరకు నష్ఠాలు రావు (తెలుగు స్టేట్స్ )తమిళనాడు కేరళ లో వస్తే రావొచ్చేమో మిగతా అంతా హ్యాపీ

Comments are closed.