శ్రుతిమించిన అరాచ‌కం.. క‌ట్ట‌డి కోసం బాబు పిలుపు!

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి నాలుగు నెల‌లు పూర్తి చేసుకుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ఇష్టానురీతిలో అరాచ‌కాల‌కు తెగ‌బ‌డుతున్నార‌నే చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. అరాచ‌కంలో వైసీపీని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు మించిపోయార‌నే…

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి నాలుగు నెల‌లు పూర్తి చేసుకుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ఇష్టానురీతిలో అరాచ‌కాల‌కు తెగ‌బ‌డుతున్నార‌నే చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. అరాచ‌కంలో వైసీపీని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు మించిపోయార‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది. బ‌హుశా ఎప్పుడూ, ఏ ప్ర‌భుత్వానికి ఇలా చెడ్డ‌పేరు ఇంత త‌క్కువ టైమ్‌లో రాలేద‌న్న మాట వినిపిస్తోంది.

ఇదే రీతిలో కొన‌సాగితే, కూట‌మి ప్ర‌భుత్వం దారుణంగా దెబ్బ‌తింటుంద‌న్న భ‌యం టీడీపీని వెంటాడుతోంది. ఈ నేప‌థ్యంలో క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రంగంలోకి దిగారు. ఈ నెల 18న మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం ఏర్పాటుకు నిర్ణ‌యించారు. ప్ర‌జాప్ర‌తినిధుల అరాచ‌కాలు… అంతిమంగా ప్ర‌భుత్వంపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని, మొద‌ట్లోనే చ‌ర్య‌లు తీసుకోవాలనే ఉద్దేశంతో చంద్ర‌బాబు అంద‌రితో స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించారు.

మ‌రోవైపు చంద్ర‌బాబునాయుడు ఏ ఒక్క‌రికీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. దీంతో అప్పుడే కొంత మంది నాయ‌కుల్లో అసంతృప్తి క‌నిపిస్తోంది. మ‌రోవైపు జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న ప‌రిస్థితిలో, ఎంత కాలం అధికారంలో వుంటామో తెలియ‌ద‌ని కూట‌మి నేత‌ల భావ‌న‌. అందుకే దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌ని అందిన కాడికి దోచుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ కార‌ణంగానే విప‌రీతమైన దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

పార్టీ నేత‌ల‌తో ఒక‌ట్రెండు రోజులు చంద్ర‌బాబు, నారా లోకేశ్ మాట్లాడ్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వివిధ మార్గాల్లో తెప్పించుకున్న స‌మాచారాన్ని ముందు పెట్టుకుని, శ్రుతిమించిన నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చే అవ‌కాశం కూడా వుందంటున్నారు. అయితే ప్ర‌జా ప్ర‌తినిధుల్ని ఆప‌డం చంద్ర‌బాబు, లోకేశ్‌కు సాధ్య‌మ‌వుతుందా? అనేదే ఇప్పుడు చ‌ర్చంతా.

4 Replies to “శ్రుతిమించిన అరాచ‌కం.. క‌ట్ట‌డి కోసం బాబు పిలుపు!”

  1. శృతి మించిందా !.. మించి ఉంది ఉంటె వై సీ పీ వాళ్లకి లిక్కర్ లాటరీలో ఇన్ని షాపులు వచ్చేవా .., ఇదే వై సీ పీ హయాములో టీడీపీ వాళ్లకి వచ్చి ఉంటె బాథాకినిచ్చేవాళ్ల ? అసలు ఆ సంగతి పక్కన పెట్టు .. వై సీ పీ గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళకు టెండర్ వేసే ఛాన్స్ ఇచ్చేవాళ్ళ ?

Comments are closed.