డైవ‌ర్ష‌న్ పాలిటిక్సే చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల‌కు దిక్కా!

త‌న మీడియాకు, సోష‌ల్ మీడియాకు ప‌ని క‌ల్పించి.. అస‌లు వ్య‌వ‌హారాల నుంచి డైవ‌ర్ష‌న్ చేస్తూ ఉన్నారు. మ‌రి ఇదెన్నాళ్లు సాధ్య‌మ‌వుతుంద‌నేది అస‌లు ప్ర‌శ్న‌!

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చాకా జ‌రిగింది ఏమిటి? తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కు చేతి నిండా సంప‌ద‌! ఎమ్మెల్యేల‌కు వాటాలు, ఎక్క‌డిక్క‌డ వ‌సూళ్లు! ఇసుక‌, మ‌ట్టి తేడా లేకుండా.. అన్నీ తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సంపాద‌న మార్గాలుగా మార‌డం! ఇక కాంట్రాక్టులు, అప్ప‌టికే ఉన్న ర‌క‌ర‌కాల సంపాద‌న మార్గాల‌కు పూర్తిగా ద్వారాలు తెరిచిన‌ట్టే!

జ‌గ‌న్ హ‌యాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇలాంటి ఉపాధి మార్గాలు ఏమీ లేవు. అందుకే జ‌గ‌న్ ఓడిపోయాడ‌నేది ఒక థియ‌రీ. జ‌గన్ అధికారంలోకి వ‌స్తే తాము ఎడాపెడా సంపాదించుకోవ‌చ్చు అనుకున్న వాళ్లంద‌రూ ఐదేళ్ల అధికార కాలంలో బాగా నిరాశ ప‌డ్డారు.

చంద్ర‌బాబు అధికారంలోకి రాక ముందు నుంచి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు చెబుతూ వ‌చ్చారు. ఒక్క‌సారి అధికారం ద‌క్క‌గానే కార్య‌క‌ర్త‌లు చెప్పిందే రాజ్యం అని చంద్ర‌బాబు నాయుడు బాహాటంగానే చెప్పారు. ప్ర‌జ‌లు కూడా అది విన్నారు. ఓటేశారు. ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాలు కావాల‌న్నా, ప్ర‌భుత్వం నుంచి ఏం ప‌ని జ‌ర‌గాల‌న్నా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల ఆమోద‌ముద్ర త‌ప్ప‌నిస‌రి. ఆ ఆమోద‌ముద్ర‌కు ఖర్చు అవుతుంది. దాన్ని చెల్లించుకుంటూ ప్ర‌జ‌లు త‌మ ప‌నులు చేసుకుంటూ ఉన్నారు.

జ‌గ‌న్ హ‌యాంలో స‌చివాల‌యాలు కేంద్రంగా ఉండేవి. అయితే ప్ర‌జ‌ల‌కు అవి న‌చ్చ‌లేద‌నే అనుకోవాలి. ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌త్యేకించి పెన్ష‌న్ల విష‌యంలో పెద్ద దందా న‌డుస్తూ ఉంది. పెన్ష‌న్ మూడు వేలు, నాలుగు వేల రూపాయ‌లు కావ‌డంతో.. అది పెద్ద వ‌న‌రుగా మారింది. దీంతో ఎలాగోలా పెన్ష‌న్ జాబితాలో పేరును ఎక్కించుకుంటే చాలానే లెక్క‌ల‌తో ప్ర‌జ‌లు ఉన్నారు. ఏదో ఒక మిష‌తో పెన్ష‌న్ జాబితాలోకి ఎక్క‌డానికి తెలుగుదేశం కార్య‌ర్త‌లు అవ‌కాశం క‌ల్పిస్తూ ఉన్నారు.

ఇలా మొద‌లుపెడుతున్నారు త‌మ్ముళ్లు త‌మ జేబులు నింపుకోవ‌డం! జ‌నాల వ‌ద్ద‌కు వారే వెళ్లి మ‌రీ మిమ్మ‌ల్ని వికలాంగులుగానో, వృద్ధులుగానో పెన్ష‌న్ జాబితాలోకి ఎక్కిస్తాం మాకు ఇంత ఇవ్వండి అని ఓపెన్ ఆఫ‌ర్లు ఇస్తున్నారు. ఈ విష‌యంలో పార్టీలు తేడా లేదు. ఎవ‌రు డ‌బ్బులు ఇస్తే వారి పేర్లు ఎక్కిస్తారు. అయితే రేపు ఇవి నిలుస్తాయా, వెరిఫికేష‌న్ ఉండదా.. అనే ప్ర‌శ్న లేదిప్పుడు. తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కు డ‌బ్బులు ఇస్తే చాలు ఏదైనా జ‌రుగుతుంది!

ఇక చిన్న స్థాయి కార్య‌క‌ర్త‌లు ఇలాంటి మార్గాల‌ను న‌మ్ముకుంటే.. కాస్త శ‌క్తి ఉంటే, ఇసుక దందా! నాలుగు నెలల్లో మొత్తం స్టాకును ఊడ్చేశారు. ఇక నుంచి ఈ క‌థ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతోంది కూడా! ఇసుకు ఫ్రీ అనేది పేరుకే. అయితే నాలుగునెల‌ల్లో వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారిన దందా కూడా ఇదే! ఇది మ‌రింత ముదిరే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తూ ఉంది.

ఇప్పుడు ఇసుక దందాలు చేయాలంటే మినిమం తెలుగుదేశం మండ‌లాధ్య‌క్షుడు అయి ఉండాలి. ఆ స్థాయికి చేరిపోయింది వ్య‌వ‌హారం, ఎమ్మెల్యేలు వారి అనుచ‌రుల స్థాయి. వీలైతే గొక్కొని తినేవాళ్ల‌ను గీక్కొని తినాలి. ఇది సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌ను గోకేవారు. లేదంటే ఇసుక‌, మ‌న్ను మీద ప‌డాలి.. ఇది ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రుల స్థాయి! ఇక చాలా చోట్ల ఎమ్మెల్యేల వ‌సూళ్లు సాగుతూ ఉన్నాయి. అధికారంలోకి వ‌చ్చాం కాబ‌ట్టి.. వివిధ వ‌ర్గాల నుంచి వ‌సూళ్ల ప‌ర్వం సాగుతూ ఉంది. ఇది ఎమ్మెల్యేలు స‌హ‌జంగా చేసేదే అన్న‌ట్టుగా ఉంది ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఎమ్మెల్యేలు త‌మ స్థాయి కొద్దీ వ‌సూళ్లు చేసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల వంతు వచ్చింది. సామాన్యులు అయితే ఈ వ‌సూళ్ల బాధితులు కాదు ఏపీలో. కాబ‌ట్టి.. వ్యాపారాలు చేసుకునే వారు, అందులో మోసాల‌ను చేసే వాళ్లు, కాంట్రాక్ట‌ర్లు.. కంపెనీలు, సంస్థ‌లు ఎమ్మెల్యేల‌కు చేసే చెల్లింపులు ఇవి. కాంట్రాక్టు సంస్థ‌ల‌ను అయితే అధికారం మారిన‌ప్పుడ‌ల్లా ఇలా ముప్పు తిప్ప‌లు పెడుతూ ఉంటారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు తెలుగుదేశం క‌త్తికి ఎదురులేదు కాబ‌ట్టి, అరిచేవాడు కూడా లేడు. వీలైనంతగా చెల్లించుకోవ‌డ‌మే మార్గం!

మ‌ధ్య‌లో మ‌ద్యం దందా తెర‌పైకి వ‌చ్చింది. ఎమ్మెల్యేల‌ను, వారి అనుచ‌రుల‌ను, అధికార పార్టీ వాళ్ల‌ను కాద‌ని మ‌ద్యం షాపులను పొందేంత శ‌క్తి ఎవ‌రికీ లేదు. ఒక‌వేళ అంత‌గా నిలిచి ఎవ‌రైనా పొందినా త‌మ వాటాలు ఏమిటో అధికార పార్టీ వాళ్లు స్ప‌ష్టంగానే చెబుతున్నారు. 15 శాతం అన‌ధికారిక వాటా, 20 శాతం అధికారిక వాటా న‌డుస్తూ ఉంది. కొన్ని చోట్ల అయితే మొత్తం ఎమ్మెల్యేలే న‌డిపిస్తున్నారు. ఎక్క‌డా ఎమ్మార్పీ రేట్ల‌తో మ‌ద్యం అమ్మ‌కాలు లేవు. ప్ర‌తి క్వార్ట‌ర్ మీదా క‌నీసం 20 రూపాయ‌ల‌ను అధిక రేటుతో అమ్ముతున్నారు. ప‌క్క రాష్ట్రాల్లో ఎమ్మార్పీ రేట్ల‌తో అమ్మ‌కాలు సాగుతూ ఉంటే, ఏపీలో మాత్రం ప్ర‌తి క్వార్ట‌ర్ పైనా ఇర‌వై రూప‌యాలు అంటే.. ప్ర‌తి రోజూ ఇలాంటి 20 రూపాయ‌ల్లే కొన్ని కోట్ల రూపాయ‌లుగా మారే అవ‌కాశం ఉంది.

ఇక స‌మ‌యం దాటిన త‌ర్వాత‌, డిమాండ్ ఎక్కువైన‌ప్పుడు అమ్మే రేట్లు వేరే! స్థూలంగా దోచుకున్న వాడికి దోచుకున్నంత‌, సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత‌.. అవ‌కాశం మాత్రం ప‌చ్చ చొక్కాల‌కే అనేది చంద్ర‌బాబు నాయుడు త‌న వంద రోజుల పాల‌న‌లో స్ప‌ష్టంగా ఇచ్చిన సందేశం!

మ‌రి ఈ సంపాద‌న‌లు ఇంత‌టితో ఆగుతాయా.. ఐదేళ్ల‌లో ఇది ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది, తెలుగుదేశం పార్టీలో కూడా అంద‌రికీ అవ‌కాశాలు సమంగా ద‌క్కుతాయా, వారిలో విబేధాలు ర‌చ్చ‌కు ఏ స్థాయిలో ఎక్కుతాయి అనేవి ఇంకా స్ప‌ష్ట‌త లేని ప్ర‌శ్న‌లు! సంపాద‌న అంటూ చూస్తున్నాకా ప్ర‌తి వాడిలోనూ ఆశ బ‌య‌ల్దేరుతుంది, ఎవ‌రికి వారు పోటీ ప‌డ‌తారు. అవ‌కాశాలు రాని వారు వ్య‌తిరేకులు అవుతారు.

జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలాంటి నిరాశ ప‌రులు గ‌ట్టిగా త‌యార‌య్యారు. ఎమ్మెల్యేలే సంపాదించుకుంటూ ఉన్నార‌ని, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు కొంత‌మంది బినామీల‌ను త‌యారు చేసుకుని స‌ర్వం తామే నాకేశార‌ని, కార్య‌క‌ర్త‌ల‌కు ఏ చిన్న అవ‌కాశం ఇవ్వ‌లేద‌నే వాద‌న‌లున్నాయి. మ‌రి కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరును త‌ట్టుకోలేక మండ‌ల స్థాయి నాయ‌కులు చాలా మంది ఎన్నిక‌ల స‌మ‌యానికి కొంత స‌మ‌యం ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. అప్ప‌టికే త‌మ‌కు అంతంత మాత్రం అవ‌కాశాలు, ఆ పై ఎమ్మెల్యేల ఆధిప‌త్యం త‌ట్టుకోలేక వారు అలా జంప్ అయ్యారు.

అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఖ‌ర్చు పెట్టేది తాము అని, ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన‌డానికి 40 కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఖ‌ర్చు అయ్యే ప‌రిస్థితి ఉంద‌ని, అలాంట‌ప్పుడు కార్య‌క‌ర్త‌లు, మండ‌ల నాయ‌కుల‌కు ఎందుకు అవ‌కాశం ఇవ్వాల‌న్న‌ట్టుగా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రించారు. అలాంటి వారు కార్య‌క‌ర్త‌ల‌కు, మండ‌ల స్థాయి నాయ‌కుల‌కు పూర్తిగా దూరం అయ్యారు. కార్య‌క‌ర్త‌ల‌ను అటు జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు, ఇలు సంపాద‌న‌లో బిజీగా ఉండిన ఎమ్మెల్యేలూ పట్టించుకోలేదు, దీనికితోడు వ్య‌తిరేక‌త పెంపొందిన ఇత‌ర అంశాలూ పెరిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగింది.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కూ విచ్చ‌ల‌విడి అవ‌కాశాలు అయితే ల‌భిస్తున్నాయి. మ‌రి ఇది ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుంది అనేది ప్ర‌శ్నార్థ‌కం. గ‌తంలో కూడా చంద్ర‌బాబు ఇలాంటి అవ‌కాశాలు ఇచ్చారు. 1995 నుంచి ఇదే ప‌రిస్థితి. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నాడంటే ప‌చ్చ‌చొక్కా వేసిన ప్ర‌తి వాడూ త‌నే చంద్ర‌బాబులా ఫీల‌యిపోతూ ఉంటారు. ఇది చాలా సార్లు బెడిసికొట్టింది.

తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల తీరు హెచ్చుకు చేరి, జన్మ‌భూమి కమిటీలు అంటూ చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల‌ను నియంత‌లుగా మార్చి, వారు జ‌నాల‌పై దాడుల‌కు కూడా ఏ మాత్రం లెక్క చేయ‌ని స్థాయికి వెళ్ల‌డం గ‌తంలో జ‌రిగింది. అందుకు ప‌ర్యావ‌స‌న‌మే 2004 ఎన్నిక‌ల ఫ‌లితాలు అయినా 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు అయినా. ఐదేళ్ల పాల‌నను పూర్తి చేసుక‌న్న త‌ర్వాత చంద్ర‌బాబు గెలిచింది ఒక్క 1999లో మాత్ర‌మే!

చంద్ర‌బాబు పాల‌న‌లో లోపాలు ప‌తాక స్థాయికి చేరిన 2004లో అయినా 2019లో అయినా తెలుగుదేశం చిత్త‌య్యింది. 2009లో అయితే చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లే అవ‌కాశం ఇవ్వ‌లేదు. పొత్తులు ఎత్తుల‌తో 2014 లోఅయినా, 2024లో అయినా చంద్ర‌బాబు పొత్తుల ద్వారా ప్ర‌ధానంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. జ‌గ‌న్ పాల‌న‌లో లోపాలు లేవ‌న‌డం లేదు కానీ, ఎలా పాలించినా ప్ర‌జ‌లు త‌నే దిక్కు అనుకుంటార‌ని చంద్ర‌బాబు లెక్క‌లేస్తే మాత్రం మొద‌టికే మోసం రావ‌డంలో ఏ మాత్రం ఆశ్చ‌ర్యం లేదు.

అయితే చంద్ర‌బాబుకు పాల‌న‌పై ఇప్ప‌డు గాడి ఉంద‌నుకోవ‌డం కూడా భ్ర‌మే. మ‌ద్యం వ్య‌వ‌హారంలో అయినా, ఇసుక విష‌యంలో అయినా, ఇత‌ర దందాల విష‌యంలో అయినా ఎక్క‌డా చంద్ర‌బాబు నాయుడు ఎమ్మెల్యేల‌ను కానీ, పార్టీ క్యాడ‌ర్ ను కానీ క‌ట్ట‌డి చేసే స్థితిలో లేరు. ఇది వాస్త‌వం. ప‌రిస్థితి ఆల్రెడీ అదుపు త‌ప్పిపోయింది. ఇది ఏ స్థాయికి ముదురుతుంద‌నేది మ‌రో నాలుగేళ్ల‌లో క‌నిపించే దృశ్యం.

ఇక చంద్ర‌బాబు కూడా దీన్ని నియంత్రించ‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్నారు. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వహారం, జ‌గ‌న్ ఆస్తుల వ్య‌వ‌హారాన్ని రేపి త‌న మీడియాకు, సోష‌ల్ మీడియాకు ప‌ని క‌ల్పించి.. అస‌లు వ్య‌వ‌హారాల నుంచి డైవ‌ర్ష‌న్ చేస్తూ ఉన్నారు. మ‌రి ఇదెన్నాళ్లు సాధ్య‌మ‌వుతుంద‌నేది అస‌లు ప్ర‌శ్న‌!

20 Replies to “డైవ‌ర్ష‌న్ పాలిటిక్సే చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల‌కు దిక్కా!”

  1. Anniyya రాజ్యం లో అడిగినోళ్ళకి అడగనోళ్ళకి డబ్బే డబ్బు నొక్కుడే నొక్కుడు బటన్ లు . ఇప్పుదు ఇసుక మద్యం హ్యాపీ గా తక్కువ కే దొరుకుతున్నాయి ఇంతకుముందు అన్ని మన సిండికేట్ కంపెనూ లకి వెలి పోయాయి. ఇప్పుడు నాలుగు నెలలకి ఏదో అయిపోతుంది అని గోల

  2. అవినీతి సొమ్ము పంచుకోవటానికి అన్న, చెల్లి రోడ్డు మీదకొచ్చి కుక్కల్లా కొట్టుకుంటుంటే అది రూలింగ్ పార్టీ డైవర్షన్ పాలిక్టిక్స్..?

  3. మహా మేత ముక్కలై బ్రతికిపోయాడు కానీ, బ్రతికుంటే కూతురిని తిట్టి కొంగు చాటు కృష్ణుడికి నువ్వు చేసే భజన చూసి ఇంకెన్ని ముక్కలయ్యేవాడో..

      1. లెవెనోడిని ఇచ్చినందుకు “సూరిడిని” కూడా పూజించమని చెప్పి పోయాడుగా..

  4. కులం చూడకుండా,మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా మా అన్నయ్య కి ఓట్లు వేసి రుణం తీర్చుకున్న ఏపి ఓటర్లు..

  5. పైన్షన్ ఆధార్ బేస్ లో పేమెంట్ చేస్తున్నారు రా గూట్లే

    ఆధార్ లో వయసు , ప్రాంతం తెలుస్తుందిరా , తెలుగు తమ్ముడా,, అరవా తంబా,, అని తెలీదు, అయినా డేటా బేస్ మీరే గా తయారు చేసింది..

  6. మ*హా మే*త చ*చ్చి బతికిపోయాడు లేక పోతే చి*ప్ప కు*డే !! తెల్లటి పంచ తెల్లటి జుబ్బా కట్టుకోనిడికల్లా తెల్లటి మనసు ఉండదని తెలియక ఈ కు*క్క*లని సింహాసనం ఎక్కించాము చివరికి ప్రజల కంచాల్లో షి*ట్ చేశారు గా*డి*ద*కొ*డు*కు*లు !!

Comments are closed.