జనం సొమ్ముతో విలాస యాత్రలు

తమ సొమ్ము సోమవారం ఒంటి పూటలు ఉంటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అని ఒక పాట ఉంది. విశాఖ కార్పోరేషన్ లో కార్పోరేటర్లు అధ్యయన యాత్రలు కూడా అలాగే ఉన్నాయని అంటున్నారు.…

తమ సొమ్ము సోమవారం ఒంటి పూటలు ఉంటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అని ఒక పాట ఉంది. విశాఖ కార్పోరేషన్ లో కార్పోరేటర్లు అధ్యయన యాత్రలు కూడా అలాగే ఉన్నాయని అంటున్నారు. పేరుకు అధ్యయన యాత్ర కానీ అది చివరికి విలాస యాత్రగా మారుతోందని అంటున్నారు. దేశంలో ప్రముఖ స్థలాలు సందర్శించడం, కులాసా చేయడం అన్నది అసలు లక్ష్యంగా మారుతోందని అంటున్నారు. దానికి అందమైన పేరు స్టడీ టూ అని పెడుతున్నారని అంటున్నారు.

దీనికి ఒక్కో కార్పోరేటర్ పేరిట అయ్యే ఖర్చు చూస్తే 1.19 లక్షల రూపాయలు అని అంటున్నారు. ఈ విధంగా విశాఖ నుంచి పెద్ద ఎత్తున కార్పోరేటర్లు విలాస యాత్రలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికి మూడు విడతలుగా చేసిన అధ్యయన యాత్రల వల్ల ఒనగూడిన ప్రయోజనం ఏమిటో చెప్పాలని కూడా ప్రజా సంఘాలు టూర్ కి దూరంగా ఉన్న కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

కోట్ల రూపాయలను ప్రజల సొమ్ముని తీసి ఖర్చు పెట్టడం కంటే ఆయా నిధులను అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తే బాగుంటుంది కదా అన్న చర్చ అయితే వస్తోంది. వారం రోజుల టూర్ లో అంతా ఎంజాయ్ చేశారని విమర్శలు వస్తున్నాయి. మొత్తం 85 మంది కార్పోరేటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అంతా కలసి 118 మంది ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు, మైసూరు, ఊటీ, గోవా టూర్లు చేసారు. దీని కోసం అనధికారికంగా వసూళ్ళు కూడా చేపట్టారు అని విమర్శలు ఉన్నాయి.

ఈ టూర్లకు సీపీఎం, జనసేనతో పాటు కొన్ని పార్టీలు కొంతమంది కార్పోరేటర్లు దూరంగా ఉన్నారు. వైసీపీకి చెందిన మేయర్ కూడా టూర్ కి వెళ్లలేదు. కానీ స్టడీ టూర్ అంటూ ప్రతీ ఏటా విధిగా వెళ్లాలని పట్టుబడుతున్న వారు అక్కడ నుంచి వచ్చి సాధించినది ఏదీ లేదని ఈ టూర్లను రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.

16 Replies to “జనం సొమ్ముతో విలాస యాత్రలు”

  1. ఒక్కొ కొర్పొరెటర్ కి ఒక్కొ లక్ష అనుకున్నా కొటి దాటటం లెదు.

    .

    ఇక మన jagan అన్న హెలికాఫ్టొర్ కర్చులు…..

    ఇంటికి 30 అడుగుల ప్రహరీ కార్చు……

    ఫుర్నీచర్ కర్చు…..

    విశాక ప్యాలెస్ కర్చు…..

    ఎగ్గ్ పఫ్ఫ్ ల కర్చు…..

    50 మంది సలహదారుల కర్చు…

    కలిపి ఎంత డబ్బు అయ్యింది రాయి?

  2. ఒక్కొ కొర్పొరెటర్ కి ఒక్కొ ల.-.క్ష అనుకున్నా కొటి దాటటం లెదు.

    .

    ఇక మన jagan అన్న హెలికాఫ్టొర్ కర్చులు…..

    ఇంటికి 30 అడుగుల ప్రహరీ కార్చు……

    ఫుర్నీచర్ కర్చు…..

    విశాక ప్యాలెస్ కర్చు…..

    ఎగ్గ్ పఫ్ఫ్ ల కర్చు…..

    50 మంది సలహదారుల కర్చు…

    కలిపి ఎంత డబ్బు అయ్యింది రాయి?

  3. ఆ మాటకి వస్తే మన ముఖ్యమంత్రులు , మంత్రులు చాలామంది అధ్యయన యాత్రలు పేరుతో ఏకంగా విదేశాల్లో విహరించట్లేదా.. అదీ జనం సొమ్మే…. అయినా ఒకసారి ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించిన తర్వాత ఆ సొమ్ము ప్రభుత్వానిది ప్రజలది కాదు….

  4. అయ్య గారి లండన్ యాత్ర సెక్యూరిటీ ఖర్చు ఎంతో? అప్పుడు గుర్తు రాలేదా?? అక్కడ ఉన్న కుటుంబానికి కూడా ఇక్కడ ఖర్చుతో సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఇలాంటి సుద్దులు గుర్తులేవా?? ఎర్ర గురివింద తన నలుపెరగదని సామెత, కానీ ఇక్కడ అక్షర సత్యం

  5. లెట్రిన్ కి వెళ్ళటానికి కూడా హెలికాప్టర్ లో తిరిగినప్పుడు అడిగితె బాగుండును

  6. జగన్ గారు చేసిన విలాస ఖర్చులు విషయాన్ని మరల జనానికి గుర్తుచేసి బాగా తిట్టించటానికి ఈ ఆర్టికల్ పెట్టినట్టువుంది

Comments are closed.