ఒక నాయకుడి భవిష్యత్ ఎలా వుంటుందో చెప్పాలంటే, ఆయన పీఆర్ టీమ్‌ను చూస్తే చాలు… అంచనా వేయొచ్చు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ భవిష్యత్ గురించి అంచనా వేసేందుకు, పెద్ద తెలివి తేటలు వుండాల్సిన పనిలేదు. జగన్‌కు చీఫ్ పీఆర్వోగా పూడి శ్రీహరి ఉన్నారు. గతంలో ఇతను సీఎంవో చీఫ్ పీఆర్వోగా పని చేశారు. అప్పుడే చాలా విమర్శలొచ్చాయి. వైసీపీ ఘోర పరాజయం తర్వాత, జగన్‌కు చీఫ్ పీఆర్వోగా నియమితులయ్యారు.
ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలనేది జగన్ ఇష్టం. ఇందులో ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. అయితే ప్రతి సందర్భంలోనూ వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే… ఇంతకూ పూడి శ్రీహరి ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ పీఆర్వోగా, అలాగే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి అదే పోస్టులో పని చేసే స్థాయికి ఎప్పుడు ఎదిగారా? అని. లేదంటే జగనే శ్రీహరి అజ్ఞాన స్థాయికి దిగజారారా? అనే ప్రశ్న సొంత పార్టీ నుంచే ఎదురు కావడం చర్చనీయాంశమైంది.
గతంలో జగన్‌కు ఉపన్యాసాలు రాయించే బాధ్యతల్ని జీవీడీ కృష్ణమోహన్ నిర్వర్తించేవారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధులు, నాయకులు మీడియా ముందుకెళ్లి ఏం మాట్లాడాలో దిశానిర్దేశం చేసేవారు. బహుముఖ మేధావిగా పేరున్న జీవీడీ అంటే జగన్‌తో సహా వైసీపీ నాయకులకు ఎంతో గౌరవం వుండేది. జీవీడీ చెప్పారంటే, కళ్లు మూసుకుని నమ్మి, మాట్లాడేయొచ్చనే భావన వైసీపీ నేతల్లో వుండేది.
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే జీవీడీ జంప్. జీవీడీ బాధ్యతల్ని పూడి శ్రీహరి చూస్తున్నారు. పేరుకేమో సర్వం తెలిసిన శ్రీహరి. ఆచరణకు వస్తే, అందుకు పూర్తి విరుద్ధం. అయితే జగన్ దగ్గర ఎట్లా కొనసాగుతున్నారనే ప్రశ్న ఎవరిలోనైనా రావడం సహజం.
ఇటీవల కాలంలో శ్రీహరి చర్యలు వైసీపీ నాయకుల మనసుల్ని గాయపరిచేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఒక సలహాదారుని అండ చూసుకుని, తానే సర్వస్వం అన్నట్టు అహంకారంతో నడుచుకుంటున్నాడని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
శ్రీహరి వ్యవహార శైలిపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మాట్లాడుతూ… పూడి శ్రీహరి, మా పార్టీలో పే…ద్ద పుడింగిలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతకు దగ్గు నేర్పినట్టుగా, తమకు రాజకీయ పాఠాలు చెబుతున్నాడని, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తమకు శ్రీహరి చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. సాక్షిలో పని చేసే వాళ్లందరినీ పార్టీలోకి తీసుకొచ్చి, తమ నెత్తిపై బలవంతంగా రుద్దుతున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. పోనీ శ్రీహరికి ఏమైనా తమకంటే బాగా తెలిసి, డైరెక్ట్ చేస్తే ఓకే అని, అతనికి అంత సీన్ లేదని వైసీపీ నాయకుల ఆవేదన, ఆరోపణ.
వైసీపీలో ఎవరినైనా పైకి తీసుకురావాలన్నా, అణచివేయాలన్నా తన చేతుల్లో ఉందన్నట్టుగా పుడంగి శ్రీహరి ఓవరాక్షన్ చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇతని కంటే చంద్రకాంత్ అనే జర్నలిస్టు విషయ పరిజ్ఞానంలోనూ, పద్ధతిగా వ్యవహరించడంలోనూ ఎంతో నయం అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. తెలుగు మీడియానే కోఆర్డినేటర్ చేసుకోలేని మన సర్వఅజ్ఞాని, ఇక ఇంగ్లీష్ మీడియాని పూర్తిగా గాలికొదిలేశారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.
ఒకటైతే నిజం… వైసీపీ బతికి బట్ట కట్టాలంటే, ముందుగా చుట్టూ ఉన్న అజ్ఞానుల్ని తరిమేయాలి. కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న వారిని దగ్గర పెట్టుకోవాలనే అభిప్రాయం పార్టీలో వుంది. వైసీపీ ఖర్మ ఏంటో కానీ , ఆ పార్టీకి అంతా “ఛీప్” వ్యక్తులే దొరుకుతున్నారని నాయకులు తల్లడిల్లుతున్నారు. ఇందులో ఒకడు ‘ఛీప్’ పుడింగి అని వైసీపీ నాయకులు సరదా కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయ యుద్ధం గెలవాలంటే, సమర్థవంతమైన పీఆర్ వ్యవస్థను వైసీపీ ఏర్పాటు చేసుకోవాలి.
అంతే తప్ప… చిల్లర (ఛీప్) వ్యక్తుల్ని నియమించుకుంటే ఫలితం కూడా అట్లే వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విత్తును బట్టే ఫలాలు లభిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019 నుంచి 24 వరకూ ప్రభుత్వం చేసిన మంచి గురించి జనానికి తెలియదంటే, దానికి కారణం నాటి ప్రభుత్వ చీఫ్ పీఆర్వోనే. అయినప్పటికీ మేము అతన్నే పెట్టుకుంటామని అంటే… వినాశకాలే విపరీత బుద్ధి అని అనుకోవడం తప్ప, చేయగలిగేదేమీ లేదని మాజీ మంత్రి నిట్టూర్చారు.
Call boy jobs available 9989793850
Mu dhu inti responsiblitiex ni chakkadidhakovali, appudu kothaga raavali,.jagan loukhyam thelusukovali
Arey munda Mee nayakude agnani raa
“చిల్లర (ఛీప్) వ్యక్తుల్ని నియమించుకుంటే ఫలితం కూడా అట్లే వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు”…..like many paytm artists recruited by ycheap
vc available 9380537747
ఎం పార్టీ రా నాయనా
“ఈ పుడింగి.. వైసీపీకి వద్దే వద్దు!”…NO, he is best for ycp
“ఈ పుడింగి.. వైసీపీకి వద్దే వద్దు!”..he is good for psyko
సరైనోడు
అసలు రోగానికి మందు వేయకుండా మిగిలినోళ్లను ఎంత మారిస్తే ప్రయోజానాము ఏమిటి ..
cream poi scrap migilindi .. peru marchukuni tukku prty ani pettukondi
cream poi scrap migilindi .. peru marchukuni t’ukku pa’rty ani p’ettukon’di
AA party chief chillara manishi
అసలు ఆ ముఠా నాయకుడు అనబడే వాడే పెద్ద “చీప్” గాడు.
వాడికి రోజుకి ఇంత దుడ్డు అని లెక్క తెచ్చే వాళ్ళు కావాలి
వాడి చుట్టుపక్కల వుండేవాళ్ళు, అలాంటి వాళ్ళే వుంటారు.
పూడింగి శ్రీహరి నీ తీసేసి వెంకట్ రెడ్డి నీ పెట్టమని దీని అర్థం యేసు నాథ!
lol
Hahahaha
2019 nundi 2024 varaku emaina manchi chesunte kada PRO ayina inkevaraina project cheyyadaniki.
Day one nundi ….miru nammu kunnadi elaanti 5 /- rs Paytm gallane ga…..! Eroju yedho kotthaga feel avuthunnav GA.
for next 20-30 years Jagan will be consigned to opposition. It doesn’t matter what he does and how he does.
బొంగేమ్ కాదు బొల్లోడితో ఎప్పటికైనా ప్రమాదమని తెలిసి పీఎం మోడీ వీడిపై రీసెంట్ గా ed కేస్ పెట్టించాడు.అడ్డు ఎక్కవ చేస్తే రెండు సంవత్సరాలు కూడా బొల్లోడు సీఎం గా ఉండలేడు
ఎవడు ఏమి పీకేది లేదు, ఎవడు ఎవడి భవిష్యత్తు నిర్ణయించడు, చేసే పనులను చూసి ప్రజలే నిర్ణయిస్తారు
ఆబ్బో anthaa నిజమే…
మీడియా వాళ్ళని,బ్యూరోక్రాట్ లని సలహాదారు లాగా పెట్టుకుంటే కొంప ముంచుతారు
ee nasa makenduku
vc estanu 9380537747
జగన్ కి బాడి డబుల్ లాగ వున్నాడే!
PR post గ్రేట్ ఆంధ్రా వెంకట్ కి ఇవ్వాలి
ఈ పుడింగి వద్దే వద్దు! మా వెంకులన్నయ్యే మాకు ముద్దు!! 😀
వెంకట్ రెడ్డి నువ్వు శ్రీ రెడ్డి కి అన్న లాంటోడివి .. మిగతాది అంతా సేమ్ టు సేమ్ .ఇక నువ్వే అర్థంచేసుకోవాలి నేను అన్ని రాస్తే బాగోదు .