హీరోయిన్స్ భారీ బెట్టింగ్

హీరోయిన్లకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. చకచకా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే, వాళ్ల కెరీర్ స్పాన్ తక్కువ. అయితే ప్రతిసారి కాకపోయినా, ఏదో సందర్భంలో ఒకే ఒక్క సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆ…

హీరోయిన్లకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. చకచకా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే, వాళ్ల కెరీర్ స్పాన్ తక్కువ. అయితే ప్రతిసారి కాకపోయినా, ఏదో సందర్భంలో ఒకే ఒక్క సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆ సినిమా తమ కెరీర్ ను, లైఫ్ ను మార్చేస్తుందని భావిస్తారు. అలా రాబోయే కొన్ని సినిమాలపై కొంతమంది హీరోయిన్లు ఆశలు పెట్టుకున్నారు.

ఉదాహరణకు మాళవిక మోహనన్ నే తీసుకుంటే, ఈమె ఇప్పటికే నటిగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఆమె కెరీర్ కు గేమ్ ఛేంజర్ లాంటి సినిమా ఇంకా పడలేదు. అలాంటి సినిమా ‘రాజా సాబ్’ అవుతుందనేది ఆమె గట్టి నమ్మకం. అందుకే సందర్భం దొరికిన ప్రతిసారి రాజా సాబ్ గురించి, ప్రభాస్ గురించి ఆమె మాట్లాడుతుంది.

హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా అంతే. ఈమె ఇప్పటికే కొన్ని హిట్స్ కొట్టింది. రీసెంట్ గా నానితో కలిసి ‘సరిపోదా శనివారం’ అనే సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ క్రేజ్ తెచ్చుకుంది.

అయితే ఆమె కోరుకునేది ఇది కాదు, ఇంతకుమించి. అందుకే ‘ఓజీ’ సినిమాపై ఆమె భారీ బెట్టింగ్ కాస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని, టాలీవుడ్ లో తనను స్టార్ హీరోయిన్ గా మారుస్తుందని ఆమె ఆశపడుతోంది.

ఇలా పవన్ పై ఆశలు పెట్టుకున్న మరో ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఓవైపు హిట్స్ లేవు, మరోవైపు అవకాశాలు కూడా లేవు. ఇలాంటి టైమ్ లో ఏళ్లుగా ఒకే సినిమాపై నమ్మకంతో అలా ఉండిపోయింది నిధి అగర్వాల్. అదే ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా రిలీజ్ తర్వాత తన కెరీర్ ఊపందుకుంటుందని ఆమె గట్టి నమ్మకం.

దిశా పటానీ, ఊర్వశి రౌతేలా కూడా చెరో సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. ‘కల్కి’ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినప్పటికీ దిశాకు సౌత్ లో చెప్పుకోదగ్గ పాపులారిటీ రాలేదు. దీంతో ఆమె తన ఆశలన్నీ ‘కంగువా’పైనే పెట్టుకుంది. ఈ సినిమాతో సౌత్ లో తనకు మరిన్ని అవకాశాలొస్తాయని భావిస్తోంది.

అటు ఊర్వశి రౌతేలా కూడా బాలకృష్ణ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకుంది. సాత్ లో ఐటెంసాంగ్స్ కే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ,.. బాలయ్య సినిమాతో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చూస్తోంది.

3 Replies to “హీరోయిన్స్ భారీ బెట్టింగ్”

Comments are closed.