నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో వేమిరెడ్డి దంపతులు చేరిన సంగతి తెలిసిందే. వైసీపీలో కొంత మంది నాయకులు తనను అవమానించారనే కారణంతో ఆయన మనసు నొచ్చుకుంది. దీంతో ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీగా ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టారు.
టీడీపీలో వేమిరెడ్డి దంపతులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. వైసీపీలో మాదిరిగా వేమిరెడ్డి దంపతులను అగౌరవపరచలేదని వారు అంటున్న మాటల్లో వాస్తవం లేదని నెల్లూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం సాక్షిగా నిలిచింది.
ఇవాళ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అధికారులు అవమానించారు. మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. సభా వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ, ఆయన్ను అసలు పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో గౌరవం లేని చోట తానుండలేనని వేదికపై నుంచి వేమిరెడ్డి దిగి వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని గమనించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. వేమిరెడ్డిని ఇలా కించపరచడం బాగాలేదని కలెక్టర్‌తో మంత్రి అన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. కానీ తమ నాయకుడికి జరిగిన అవమానాన్ని వేమిరెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Call boy jobs available 9989793850
you do not worry…
Vemi gaariki tagina sasti jarigindi
babai ki boke bokka
Lokanatham garu emaipoyaru?? 😄
“Babai” word rights anni mana partyve brother 😂
Solluganti malla vachavaa nuvvu inkaa raaledentaa anikuntunna.
veediki veedi pellaniki JAGAN YSRCP LO GOVERNMENT LO AGRA THAMBULAM ICHADI..VEEDIKI IPPUDU ALA AVVALSINDE
endi ee red gaadi over action. kootami gelustundi ani telisi kootami loki last minute entry kottesi gelichipoyina lafut gaadiki intha kovva. appatiki wife became MLA again from Kootami and was given TTD member post. Ayinaa intha balupu pradarsana chestunnadu lafut lamdike. Kootami leadership should discipline him properly.
పొరబాట్లు జరుగుతూ ఉంటాయి. సరిదిద్దుకోవడమే…
Mee govt rule lo janalu brathukule chindaravandara avthunte meku pushpa guchalu kavala Reddy garu