కివీస్ తో చిత్తైన జ‌ట్టు .. ఆసీస్ తో ఏమ‌వుతుందో!

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వేదిగా గ‌త రెండు ప‌ర్యాయాలుగా జ‌రిగిన టెస్ట్ సీరిస్ ల‌నూ టీమిండియా గెలిచింది! చివ‌ర‌గా 2020 చివ‌ర్లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాల‌పై టీమిండియా సంచ‌ల‌న స్థాయిలో టెస్టు సీరిస్…

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వేదిగా గ‌త రెండు ప‌ర్యాయాలుగా జ‌రిగిన టెస్ట్ సీరిస్ ల‌నూ టీమిండియా గెలిచింది! చివ‌ర‌గా 2020 చివ‌ర్లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాల‌పై టీమిండియా సంచ‌ల‌న స్థాయిలో టెస్టు సీరిస్ నెగ్గింది. అంత‌కు ముందు ఆసీస్ వేదిక‌గా జ‌రిగిన ఈ ట్రోఫీ టెస్టుల్లో కూడా టీమిండియానే విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ గెల‌వ‌డానికే ఇత‌ర జ‌ట్లు అప‌సోపాలు ప‌డుతూ ఉంటాయి. అయితే టీమిండియా వ‌ర‌స‌గా రెండు ప‌ర్యాయాలు టెస్టు సీరిస్ ల‌ను గెలిచి స‌త్తా చాటింది!

ఇదంతా గ‌తం అనుకోవాల్సి వ‌స్తోంది న్యూజిలాండ్ తో స్వ‌దేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ల‌లో భార‌త బ్యాట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత‌! సొంత దేశంలో.. అది కూడా తిరుగులేని రికార్డులు ఉన్న జ‌ట్టు .. గ‌త 36 యేళ్లుగా ఇండియాలో టెస్టు విజ‌యం కోసం ఎదురుచూసిన జ‌ట్టు చేతిలో వైట్ వాష్ అయ్యింది! బ‌హుశా గ‌త ఆరేడు ద‌శాబ్దాల్లో ఇండియాలో ఇండియాను వైట్ వాష్ చేసిన జ‌ట్లు లేనే లేవు కాబోలు! అది కూడా ఇండియాలో టెస్టు విజ‌యం కోసం ద‌శాబ్దాల‌కు ద‌శాబ్దాలు ఎదురుచూసిన జ‌ట్టు అది! దాంతో టెస్టు సీరిస్ ఓడిపోయాకా కూడా భార‌త బ్యాట‌ర్ల‌కు రోషం వ‌చ్చిన‌ట్టుగా లేదు! చిత్తైపోయారు!

మ‌రి ఇంతలోనే ఈ నెల‌లోనే బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీ ప్రారంభం అవుతోంది. ఆసీస్ వేదిక‌గా, ఆస్ట్రేలియాను ఎదుర్కొనాలి! స్వ‌దేశంలో మ‌నోళ్ల బ్యాటింగ్ ప్ర‌తాపం చూశాకా.. భార‌త క్రికెట్ ఫ్యాన్స్ ఆశ‌లు దాదాపుగా పోయాయ్! మూడు టెస్టుల్లో క‌నీసం ఒక్క సెష‌ల్ లో పూర్తిగా పై చేయి సాధించ‌లేక‌పోయారు. టీ20ల్లో రాణింపును చూసి రెడ్ బాల్ క్రికెట్లోకి ఆట‌గాళ్ల‌ను తీసుకుంటే ఫ‌లితాలు ఇలానే ఉంటాయ‌ని విమ‌ర్శ‌లు చుట్టుముట్టాయి!

ఆఖ‌రికి అనామ‌క‌ స్పిన్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన‌లేని, జట్టుగా టీమిండియా నిలుస్తోంది. ఈ సీరిస్ లో అద‌ర‌గొట్టిన సాట్న‌ర్ అయితే పార్ట్ టైమ్ క్రికెట‌ర‌ట‌! అత‌డు వాస్త‌వానికి ఒక గోల్ఫ్ ప్లేయ‌ర్. ఏదో స‌ర‌దాగా క్రికెట్ ఆడుతూ ఉంటాడ‌ట‌! అత‌డినే టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ త‌ట్టుకోలేక‌పోయింది. మ‌రి ఆస్ట్రేలియా లోనే ఆస్ట్రేలియా సీమ్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొనే మాన‌సిక స్థైర్యం కూడా టీమిండియాకు ఇప్పుడు దెబ్బ‌తిని ఉండ‌వ‌చ్చు. స్వ‌దేశంలో ఈ దారుణ ప‌రాజ‌యం జ‌ట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసే అవ‌కాశాలు ఎక్కువ‌. దీనికి తోడు తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ను బీసీసీఐ ర‌ద్దు చేసేసింద‌ట‌!

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి దేశాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ లు చాలా కీల‌కం అని.. మాజీ నెత్తినోరు మోదుకుంటూ ఉంటారు! అయితే బీసీసీఐ వ్య‌వ‌హారాలు మాత్రం కాసులు తెచ్చే వాటి ప‌ట్లే త‌ప్ప‌, క్రికెట్ గురించి అస్స‌లు ఉండ‌వంతే!

4 Replies to “కివీస్ తో చిత్తైన జ‌ట్టు .. ఆసీస్ తో ఏమ‌వుతుందో!”

  1. మొన్నటిదాకా 200 ఏళ్లుగా britishers దేశాన్ని దోచుకున్నారని, ఒక్క కోహినూర్ ఉండి ఉంటే దాన్ని తాకట్టు పెట్టి లక్షలాది కోట్ల అప్పులు పుట్టి ఉండేవని వగచారు. ఇప్పుడు ఒక series కోల్పోతేనే new zealand మీద పడి ఏడుస్తున్నారు.

  2. మొన్నటిదాకా 200 ఏళ్లుగా britishers దేశాన్ని దోచుకున్నారని, ఒక్క కోహినూర్ ఉండి ఉంటే దాన్ని తాకట్టు పెట్టి లక్షలాది కోట్ల అప్పులు పుట్టి ఉండేవని వగచారు. ఇప్పుడు ఒక seriesz కోల్పోతేనే new zealand మీద పడి ఏడుస్తున్నారు.

Comments are closed.