అవును.. వాళ్లిద్దరు మళ్లీ కలుస్తున్నారు?

ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. ప్రస్తుతానికి గాసిప్ లెవెల్లో ఉన్నప్పటికీ వినడానికి, చెప్పుకోడానికి చాలా క్రేజీగా ఉంది. అదేంటంటే.. కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకోబోతున్న హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తిరిగి…

ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. ప్రస్తుతానికి గాసిప్ లెవెల్లో ఉన్నప్పటికీ వినడానికి, చెప్పుకోడానికి చాలా క్రేజీగా ఉంది. అదేంటంటే.. కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకోబోతున్న హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తిరిగి కలవబోతున్నారట. ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ హాట్ పుకారు.

ప్రస్తుతం వీళ్ల విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది. ఓవైపు అది అలా సాగుతుండగానే.. మరోవైపు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రజనీకాంత్ తెగ ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగా కూతురి మైండ్ సెట్ మార్చి, ఆమెను ఒప్పించిన సూపర్ స్టార్.. తాజాగా ధనుష్ తో కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది.

దీపావళికి ధనుష్ ను ఇంటికి ఆహ్వానించారట రజనీకాంత్. ధనుష్-ఐశ్వర్య మధ్య సయోధ్య కుదిర్చేందుకు చాలా ప్రయత్నించారట. అంతేకాదు, తన జీవితంలో మిగిలిన ఒకే ఒక్క కోరిక ఇదేనని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో ధనుష్ కూడా కాస్త మెత్తబడినట్టు లీకులొస్తున్నాయి.

ఇదంతా ఎంత నిజమో మనకు తెలియదు కానీ, ఈ న్యూస్ మాత్రం కోలీవుడ్ సైట్స్ లో తెగ పాపులర్ అవుతోంది. 18 ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత విడిపోయారు ధనుష్-ఐశ్వర్య. అధికారికంగా ప్రకటించి రెండేళ్లు అవుతోంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు.

7 Replies to “అవును.. వాళ్లిద్దరు మళ్లీ కలుస్తున్నారు?”

Comments are closed.