వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చెల్లెమ్మ?

విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వానికి తెర లేస్తోంది. ఈ నెల 28న ఎన్నికలు జరిగే ఈ ఎమ్మెల్సీ కోసం రేసులో చాలా మంది…

విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వానికి తెర లేస్తోంది. ఈ నెల 28న ఎన్నికలు జరిగే ఈ ఎమ్మెల్సీ కోసం రేసులో చాలా మంది నేతలు వైసీపీ నుంచి వస్తున్నారు.

ఈ సీటు వైసీపీకి కచ్చితంగా దక్కనుందని లెక్కలు చెబుతున్నాయి. ఎలక్ట్రోల్ కాలేజీలో మొత్తం 743 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉంటే అందులో 543 మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. టీడీపీకి 155 మంది ఉంటే ఇండిపెండెంట్లు 22 మంది ఉన్నారు. ఈ సీటు వైసీపీ జాగ్రత్తగా చేసుకుంటే సునాయాస విజయంగా ఉంది. దీంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి గత అయిదు నెలలుగా మాజీలుగా మారిన చాలా మంది ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయుడు, శంబంగి చిన అప్పలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు.

ఎవరికి సీటు ఇచ్చినా పార్టీ పట్ల విధేయులుగా ఉండడమే ప్రమాణంగా చూస్తారని అంటున్నారు. ఆ లెక్కన జగన్ చెల్లెమ్మగా అంతా చెప్పుకునే పుష్ప శ్రీవాణికి టికెట్ దక్కవచ్చునని అంటున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎమ్మెల్సీ చేయడం కూడా ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు.

ఆమె పార్టీ పట్ల జగన్ పట్ల పూర్తి విశ్వాసంతో ఉండడం కూడా కలసి వస్తుందని అంటున్నారు. అయితే ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘువర్మ మీద అనర్హత వేటు కారణంగా వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి అక్కడి వారికే మళ్లీ చాన్స్ ఇవ్వాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

ఎస్ కోటకు చెందిన వైసీపీ కీలక నేత గొర్లె రవికుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ కూడా అభ్యర్థి ఎంపికలో ముఖ్య పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. పుష్ప శ్రీవాణికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

21 Replies to “వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చెల్లెమ్మ?”

  1. నువ్వు చెలెమ్మా చెల్లెమ్మా అని రాయకురా అయ్యా! వినటానికి అదొ రకంగా ఉంది!!

    అన్నకి ఎ ఎమొషన్స్ ఉండవు!! సొంత చెలెమ్మలకె దిక్కు లెదు.

  2. లెవెనోడికి సొంత చెల్లి, సొంత అమ్మ తప్ప అందరూ చెల్లి, అమ్మే.

    .

    అమ్మని అమ్మనా తిట్లు తిట్టిన బొత్స నాన్న తో సమానం..

  3. ఇంకో చల్లెమ్మకి దెబ్బ ఏసిన జగన్, ఇప్పుడేమంటావురా లవ్డే కా బాల్…

  4. చి చి ఆఖరికి నువ్వు అనుకున్నది కూడా జరగలేదు కదా జి ఏ చచ్చిపో ఇందులో అన్న దూకి అన్నని నమ్ముకుంటే అంతే

  5. నీలో గొప్ప శూన్యప్రేమికుడు వున్నాడు రా సాంబా… కన్న తల్లిని తరిమెశాడు, చెల్లిని తరిమెశాడు… వీడికి రాజకీయ అవసరాలకు పనికొచ్చేవాళ్ళను తెచ్చి షెల్లి అని సీమంతం చేస్తావేంట్రా పిచికారోడా..

Comments are closed.