వివాహం తర్వాత గ్లామర్ జోలికి వెళ్లకుండానే చేతినిండా అవకాశాలను సంపాదించుకుంటూ ఉంది జ్యోతిక. ఇటు దక్షిణాది సినిమాల్లోనూ, అటు బాలీవుడ్ లో నూ జ్యోతిక అవకాశాలను సంపాదించుకుంటూ ఉంది. మరి ఇప్పుడు ఆమె సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ కూడా గట్టిగానే ఉందట! జ్యోతిక సుమారు ఐదు కోట్ల రూపాయలను చార్జ్ చేస్తోందట ప్రస్తుతం ఒక్కో సినిమాకు!
అలాగే జ్యోతిక ఆస్తుల విలువ కూడా గట్టిగానే ఉందట! ఆమె పేరిట ఉన్న ఆస్తుల విలువ సుమారు మూడు వందల కోట్ల రూపాయల పైనేనట! 90లలోనే జ్యోతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. *వాలి* సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. నగ్మ హాఫ్ సిస్టర్ గా కూడా జ్యోతికకు అవకాశాలు కలిసి వచ్చాయి.
దక్షిణాదిన బిజీ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే సూర్యతో వివాహంతో సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఆ తర్వాత కెరీర్ ను పునఃప్రారంభించింది. ఇప్పుడు ఇటు సౌత్ లోనూ, అటు నార్త్ లోనూ 40ల వయసులో ఉన్న హీరోయిన్లకు మంచి అవకాశాలు దక్కే కాలం. దీంతో జ్యోతికకు అలా కూడా కాలం కలిసొచ్చింది.
గ్లామరస్ హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లోనూ, పెట్టుబడులతో జ్యోతిక ఆస్తులు మూడు వందల కోట్ల రూపాయల పైనే ఉన్నాయట! అయితే సూర్య ఆస్తులు మాత్రం రెండు వందల కోట్ల రూపాయలేనట! సూర్యకు నిర్మాణ సంస్థ కూడా ఉన్నట్టుంది. ప్రస్తుతం సినిమాకు ముప్పై కోట్ల రూపాయల స్థాయి రెమ్యూనిరేషన్ ను చార్జ్ చేస్తున్న హీరో సూర్య. అలాగే ఈ దంపతులకు ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. తమ ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువుల కోసం వీరు పాటు పడుతున్నారు.
vc estanu 9380537747