ట్రంప్ ను గెలిపించింది మ‌గాళ్లే, ఇక నో సెక్స్!

అమెరికా అధ్య‌క్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెల‌వ‌డంపై కొంద‌రు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. వారిలో మగువ‌లే ముందు వ‌ర‌స‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ట్రంప్ ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వారిలో ఫెమినిస్టులు, సామాన్య మ‌గువ‌లు కూడా ఉన్నారు! వీరి…

అమెరికా అధ్య‌క్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెల‌వ‌డంపై కొంద‌రు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. వారిలో మగువ‌లే ముందు వ‌ర‌స‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. ట్రంప్ ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వారిలో ఫెమినిస్టులు, సామాన్య మ‌గువ‌లు కూడా ఉన్నారు! వీరి ఆగ్ర‌హం ఎంత వ‌ర‌కూ వెళ్లిందంటే.. అస‌లు ఈ ఎన్నిక‌ల్లో ట్రంప్ గెల‌వ‌డానికి కార‌ణ‌మే పురుషులు అంటూ వారు మండిప‌డే వ‌ర‌కూ. ట్రంప్ విజ‌యానికి కార‌ణం పురుషాహంకారులు, పురుషులే అంటూ ఫెమినిస్టులు గ‌ళ‌మెత్తారు!

ఈ నేప‌థ్యంలో 4బీ ఉద్య‌మాన్ని ప్రక‌టించారు కొంత‌మంది. 4 బీ అంటే నాలుగింటికి దూరంగా ఉండ‌టం. సెక్స్, రిలేష‌న్ షిప్, బ‌ర్త్, మ్యారేజ్ ఈ నాలుగింటికీ ఇక తాము దూరం అని వారు ప్ర‌క‌టిస్తున్నారు. మ‌గాడి సంబంధంతో ప్ర‌మేయం ఉన్న ఈ నాలుగింటికీ తాము నో చెప్ప‌నున్న‌ట్టుగా వారు ప్ర‌క‌టిస్తున్నారు. ఫెమినిస్టుల నుంచి ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు ఈ నినాదాల‌తో రోడ్డెక్కుతున్నారు.

ఈ 4 బీ ఉద్య‌మానికి మూలం సౌత్ కొరియాలో ఉంది. అక్క‌డ బీ అంటే నో అని అర్థం. ఇలాంటి కార‌ణాల‌తోనే సెక్స్, రిలేష‌న్ షిప్, బ‌ర్త్, మ్యారేజ్ ల‌కు నో చెప్ప‌డానికి అక్క‌డ 4 బీ ఉద్య‌మాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ట్రంప్ ఎన్నిక‌తో ఆ 4 బీని అమెరిక‌న్ ఫెమినిస్టులు, ఆ భావ‌జాలం క‌లిగిన వారు అందిపుచ్చుకుంటున్నారు!

ట్రంప్ ను మ‌గాళ్లే గెలిపించార‌ని, కాబ‌ట్టి మ‌గాడికి అవ‌స‌ర‌మైన రీతిలో తాము ఏర‌కంగానూ వ్య‌వ‌హ‌రించ‌కుండా నిర‌స‌న తెలుపుతామ‌న్న‌ట్టుగా వారి ఉద్ధేశం. మ‌రి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చే వ‌ర‌కూ వ‌చ్చిందంటే అమెరిక‌న్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ప‌ట్ల మ‌హిళ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో అర్థం చేసుకోవ‌చ్చు!

8 Replies to “ట్రంప్ ను గెలిపించింది మ‌గాళ్లే, ఇక నో సెక్స్!”

  1. మన దేశం ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే మహిళా నేతను ఎన్నుకుంది.. అమెరికా ఇంకా దానికి అనుకూలంగా లేదు…

  2. Antha ledu. Midi midi jgnanam batch misogyny ani asalu vishayalni address cheyyalsindi potion inka Pedda anavasaramaona gothini tavvutunnaru. Ila chesthe magavallu dabbulu ichhi pani jaripinchukunta adavallani nijamagane bondalo pette roju daggaralone undi. Sex/intimacy/femininity tappa veellu vere vatiki panikiraru kada!

Comments are closed.