కూట‌మి పాల‌న‌పై పాజిటివ్ చ‌ర్చ లేదేం!

చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరి ఐదు నెల‌లు కావ‌స్తోంది. ఈ ఐదు నెల‌ల్లోనే ఎన్నో అద్భుతాలు చేశామ‌ని సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. గ‌తంలో మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా…

చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరి ఐదు నెల‌లు కావ‌స్తోంది. ఈ ఐదు నెల‌ల్లోనే ఎన్నో అద్భుతాలు చేశామ‌ని సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. గ‌తంలో మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా కంటే, ఈ ద‌ఫా ఎక్కువ స‌మ‌యం ప‌ని చేస్తున్న‌ట్టు తాజాగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అదేంటో గానీ ఈ ఐదు నెల‌ల్లో ప‌రిపాల‌న‌పై కంటే ఇత‌రేత‌ర అంశాల గురించి జ‌నం చ‌ర్చించుకోవాల‌ని ప్ర‌భుత్వం ఎందుకు కోరుకుంటున్న‌దో అర్థం కావ‌డం లేదు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో కల్తీ, మ‌ద‌న‌ప‌ల్లె రెవెన్యూ ఫైల్స్ ద‌గ్ధం, ముంబ‌య్ న‌టి జ‌త్వానీ కేసు, విజ‌య‌వాడ‌లో ప్ర‌కాశం బ్యారేజీని వైసీపీ నేత‌లు ధ్వంసం చేయాల‌నే కుట్ర‌…ఇలా ఒక్కో నెల ఒక్కో వివాదాన్ని తెర‌పైకి తెచ్చి, కాలం గ‌డిచిపోవాల‌ని ప్ర‌భుత్వం కోరుకుంటోంద‌న్న అభిప్రాయం జ‌నంలో వుంది.

ఎన్నిక‌ల హామీ ప్ర‌కారం ఉచిత ఇసుక‌, మ‌ద్యం పాల‌సీ, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు, పింఛ‌న్‌ను రూ.4 వేల‌కు పెంచ‌డం త‌దిత‌ర అంశాల‌ను ఎందుక‌ని చ‌ర్చ‌కు పెట్ట‌డం లేదో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అస‌లు సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల గురించే చంద్ర‌బాబు స‌ర్కార్ ఎక్కువ ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. ఇటీవ‌ల ఉచితంగా మూడు సిలిండ్ల ప‌థ‌కాన్ని ప్రారంభించారు. సుమారు 40 ల‌క్ష‌ల మందిని కోత కోశార‌ని ప్ర‌భుత్వ లెక్క‌లే చెబుతున్నాయి.

ఏ ప‌థ‌కం తీసుకున్నా ర‌చ్చ త‌ప్ప‌, మంచిగా మాట్లాడుకునే ప‌రిస్థితి లేద‌ని కూట‌మి నేత‌లే ఆరోపిస్తున్నారు. ఉచిత ఇసుక‌నే తీసుకుందాం. జ‌గ‌న్ పాల‌న‌లోనే న‌యం అని జ‌నం అనుకుంటున్న ప‌రిస్థితి. పేరులో ఉచితం త‌ప్ప‌, ఎక్క‌డా ఇవ్వ‌డం లేద‌ని జ‌నం విమ‌ర్శిస్తున్నారు. మ‌ద్యం పాల‌సీని చూస్తే, దుకాణాలు పెరిగిపోయి, విచ్చ‌ల‌విడిత‌నం అయిపోయింది.

చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. చివ‌రికి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగా త‌న ఆవేద‌న వ్య‌క్తం చేయాల్సి వ‌చ్చింది. దీంతో వెంట‌నే డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌. వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లపై కేసులు, అరెస్ట్‌లు. ఎన్నిక‌ల గొడ‌వ‌లు ముగిసిపోయి సాఫీగా పాల‌న సాగాల్సిన స‌మ‌యంలో, మ‌రింత ఆందోళ‌నక‌ర ప‌రిస్థితులు. వైసీపీని బ‌ద్నాం చేసే క్ర‌మంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏవేవో వ్యూహాలు ర‌చిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ ఉద్దేశం ఏంటో తెలియ‌దు కానీ, అనుకున్న‌దొక‌టి, అవుతున్న‌దొక‌టి అనే చందంగా ఉన్న‌ట్టుంది.

17 Replies to “కూట‌మి పాల‌న‌పై పాజిటివ్ చ‌ర్చ లేదేం!”

  1. ఆది సరే..

    ఈ సందట్లో.. జగన్ రెడ్డి అనే వాడు ఒకడున్నాడనే చర్చ కూడా లేదు జనాల్లో .. వాడి గురించి ఆలోచనే లేదు.. వాడిని మరిచిపోవడం లో కూడా ఆనందం వెతుక్కొంటున్నారు జనాలు..

    వాడేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభో.. అని అడుక్కొంటున్నాడు..

    ఇదే గొట్టం గాడు.. 23 లో 5 లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది అని విర్రవీగాడు గతం లో..

    అంతేలే.. టైం బాగులేకపోతే.. తాడే పామై కాటేస్తుంది..

  2. రెండు సింగిల్స్ ఇచ్చిన నీకు ఇంకా అర్ధం కాలేదు. ప్రజలు పథకాల కోసం పాకులాడటం లేదు. వారికి కావాల్సింది ఉపాధి, అభివృద్ధి

  3. 😂😂😂….అప్పుడు నువ్వు happy గా feel అవుతావు గాని……కడుపు మంట తో ఇలా ఏడవవు కదా GA….

  4. విశాకకి TCS వస్తా అనటం

    లూలూ గ్రూప్ మళ్ళి పెట్తుబడులకు సిద్దం అవటం

    రాజదాని సందిగ్దం వదిలి, అమరవతి లొ పనులు మొదలు అవ్వటం

    అమరవతి కి కెంద్రం నిదులు మంజూరు చెయటం

    అమరవతి ఇన్నెర్ మరియూ ఔటెర్ రింగ్ రోడ్ కి కెంద్రం అనుమతి

    పొలవరం కి కెంద్రం నిదులకి ఒక చెప్పటం

    పిటాపురం లొ ఊకు పరిశ్రమకి కి సానుకూల వాతావరణం

    విశాక మెట్రొకి కి కదలిక, అలానె అమరావతికి రైలు

    .

    ఇవన్ని ఎమిటి? కూటమి పాలనకి పాజిటివ్ కాదా?

  5. ఇది మంచి ప్రభుత్వం కాదు అనిపిస్తే 11.11 11am కి అసెంబ్లీ లో 11-నోడు నిలదీయొచ్చు కదా..

Comments are closed.