మిస్టర్ బచ్చన్.. జీవితంలో అతిచెత్త నిర్ణయం

మిస్టర్ బచ్చన్ ప్రాజెక్టు వెనక జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాపై ఇప్పటికే చాలా పోస్టుమార్టం జరిగింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…

మిస్టర్ బచ్చన్ ప్రాజెక్టు వెనక జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాపై ఇప్పటికే చాలా పోస్టుమార్టం జరిగింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎందుకు అంత పెద్ద డిజాస్టర్ అయిందో, అసలు కారణాలు ఇప్పుడు బయటపడ్డాయి.

స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ వెనక అసలు కారణాలు బయటపెట్టారు. “జీవితంలో తీసుకున్న వరస్ట్ డెసిషన్” అనే పెద్ద డైలాగ్ కూడా ఆయన వాడడం విశేషం.

“80ల నాటి హిందీ పాటలు నాకు నచ్చి సినిమా ఆడేస్తుందనున్నాను. అదొక తప్పు అయితే, ఇంకో పెద్ద తప్పు ఏంటంటే, కొన్ని ఎపిసోడ్స్ ను చాలా ఫాస్ట్ గా తీసేశాం. సినిమాలో 2-3 ఎపిసోడ్స్ కరెక్ట్ గా తీసుంటే హిట్టయ్యేది. కీలకమైన ఆ ఎపిసోడ్స్ మేం ఫాస్ట్ గా తీశాం. అలా రైడ్ సీన్స్ ఎగ్జిక్యూట్ చేయడంతో సినిమా మిస్ ఫైర్ అయింది. నా జీవితంలో నేను తీసుకున్న అతి చెత్త నిర్ణయం ఇది.”

ప్రాజెక్టులో ఆఖరి నిమిషంలో అడుగుపెట్టడం కూడా తను చేసిన తప్పన్నారు విశ్వప్రసాద్. అంతేకాదు, ఇకపై కాంబినేషన్ల మీద సినిమాలు తీయమని కూడా ప్రకటించేశారు.

“రీమేక్ ఎందుకు, ఒరిజినల్ మూవీ చేయొచ్చు కదా అని ఈ సినిమాలో నేను ఇన్ వాల్వ్ అయినప్పుడు ప్రశ్నించాను. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఎందుకంటే, సరిగ్గా ముహూర్తానికి ఒక రోజు ముందు నేను ఈ ప్రశ్న అడిగాను. ఇక చేసేదేం లేక ముందుకెళ్లాం.”

తన బ్యానర్ కు 2024 బిగ్గెస్ట్ డిజాస్టర్ అని అంగీకరించారు విశ్వప్రసాద్. అందుకే 10 నెలల నుంచి కొత్త సినిమాలేవీ లాంఛ్ చేయలేదని, వచ్చే ఏడాది నుంచి తమ బ్యానర్ లో డిఫరెంట్ సినిమాలొస్తాయని చెబుతున్నారు.

తను ఎంచుకున్న ఫ్యాక్టరీ మోడల్ లో తప్పులేదన్న ఈ నిర్మాత.. సినిమాలకు సంబంధించి సెపరేట్ టీమ్ ఉందని, తను కథలు వినాల్సిన అవసరం లేదని అన్నారు. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ తర్వాత కూడా ఆయన ఈ మాట అనడం ఆశ్చర్యం.

4 Replies to “మిస్టర్ బచ్చన్.. జీవితంలో అతిచెత్త నిర్ణయం”

Comments are closed.