ఇప్పటికే రెండు దఫాలుగా కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇంకా కొన్ని పదవులను భర్తీ చేయాల్సి వుంది. అధికారంలో ఉన్న తర్వాత పదవుల్ని ఆశించడంలో తప్పు లేదు. అయితే ఇందుకోసం కొందరు చిల్లర మార్గాల్ని ఎంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు మహిళా నాయకురాళ్లు వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నారు.
కూటి కోసం కోటి విద్యలు అనే చందంగా, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని నాయకులు పదవుల కోసం అడ్డదారుల్ని ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. కేవలం టీవీలు, యూట్యూబ్ ఛానెల్స్‌తో మాత్రమే సంబంధం ఉన్న వీర మహిళా నాయకురాలు వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అభ్యంతరకర కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి వాళ్లు కోరుకునేది కూడా ఇదే.
వైఎస్ జగన్‌ను నోటికొట్టినట్టు మాట్లాడ్డం ద్వారా తమ అధినాయకుల మెప్పు పొంది, నామినేటెడ్ పదవులు పొందొచ్చనే ఎత్తుగడగా కూటమిలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాళ్ల నోటి దురుసుతో రాజకీయాలంటే మర్యాదస్తులకు సంబంధించినవి కావనే అభిప్రాయం ఏర్పడిందని అంటున్నారు. నోరున్నది ఏదైనా మాట్లాడ్డానికే అనే ధోరణి రోజురోజుకూ పెరుగుతోంది.
మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ల నోటి దురుసు గురించి చెప్పాల్సిన పనిలేదు. అధికార కూటమిలో వుంటే, ప్రత్యర్థులపై నోరు పారేసుకోడానికి లైసెన్స్ దొరికినట్టుగా భావిస్తున్నారు. అధికారం మారితే, అడ్రస్ లేకుండా పోతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్లకు ప్రజలతో సంబంధం ఉండదు. రాజకీయాల్లో కనీస మర్యాద పాటించని నాయకులకు పదవులు ఇస్తే, వాటికి ఏ మాత్రం గౌరవం తెస్తారో అధినాయకులు ఆలోచించడం మంచిది.
vc estanu 9380537747
Call boy works 9989793850
ఎవరు ఏమీ మాట్లాడారో చెబితే బాగుంటది వెస్ట్ పోస్టులు పెట్టకురా బేవార్స్ ఛానల్‌గా
ఎదుటివాడిని తిట్టించి శునక ఆనందం పొందే జబ్బు అందరికి ఉండదు వట్టిగొడ్డుకే అరుపులెక్కువ అటువంటి నాయకులు ను జనం కూడా ఆదరించరు మహిళలు వాళ్ళను దూరం పెడతారు రాష్ట్రానికి మొత్తం తెలుసు ఆ నాయకుడు ఎవరనేది