పవన్ కల్యాణ్ సినిమాల సంగతి ఇది. ఆయన ఎప్పుడు ఏ సినిమాకు కాల్షీట్ ఇస్తారో తెలియదు. ఏ సినిమా ముందు కంప్లీట్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఇద్దరు నిర్మాతలు మాత్రం తెరవెనక తెగ పోటీ పడుతున్నారు. తమ సినిమానే ముందు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ నటిస్తున్న సినిమాల్లో షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు. ఈ రెండూ రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాల్లో ఏదీ పవన్ స్టార్ట్ చేయలేదు.
హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేసినట్టే చేసి మళ్లీ సైడ్ అయ్యారు. అటు ఓజీ ఊసే లేదు. అయితే ఈ ఇద్దరు నిర్మాతలు మాత్రం తమ సినిమానే ముందు రిలీజ్ అవుతుందన్నట్టు వ్యవహరిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని ఆల్రెడీ ప్రకటించారు. మార్చి 28 రిలీజ్. ఓజీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా బయటపెట్టలేదు. అయితే విడుదల తేదీ వెల్లడించకపోయినా, బిజినెస్ విషయంలో మాత్రం ఓజీ నిర్మాత దానయ్య ముందున్నారు. మంచి రేట్లకు సినిమాను అమ్ముతున్నారు. అక్కడితో ఆగకుండా థియేటర్ అగ్రిమెంట్లు కూడా పూర్తి చేస్తున్నట్టున్నారు.
దీంతో చాలామంది హరిహర వీరమల్లు కంటే ఓజీనే ముందుగా థియేటర్లలోకి వస్తుందని అనుకుంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. దీంతో ఏఎం రత్నం అలెర్ట్ అయ్యారు. తమ సినిమా మార్చి 28కి తప్పకుండా వస్తుందంటూ ఈరోజు ఆయన మరోసారి ప్రకటించడం వెనక కారణం ఇదే.
ఇలా దానయ్య, రత్నం ఇద్దరూ తమ సినిమాల విషయంలో బాగానే పోటీ పడుతున్నారు. అయితే ఇదంతా కొసరు వ్యవహారం. అసలు మేటర్ ఇంకా తేలలేదు. పవన్ ఏ సినిమా ముందు పూర్తి చేస్తారు? ఇది అసలు సంగతి. ఇది ముందు తేలితే, ఆ తర్వాత విడుదల తేదీపై ఆటోమేటిగ్గా క్లారిటీ వస్తుంది.
సందట్లో సడేమియా అన్నట్టు.. ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలను పవన్ పిలిపించారని, డేట్స్ ఇస్తాను షూటింగ్ ప్రారంభించుకోండని చెప్పారంటూ కథనాలు రావడం కొసమెరుపు.
vc available 9380537747
Pavanalu veestunnai ite
జగనాలు జారిపోయాయి కదా.. అందుకేనేమో..
జారిపోవటం కాదు బ్రదర్ రాలిపోవటం అనాలి 😂
Call boy works 7997531004
vc available 9380537747
vc estanu 9380537747