ఎక్కడైనా ఇళ్లలో లేదా ఎవరూ లేని ప్రాంతాల్లో బలవన్మరణాలకు పాల్పడడం గురించి విన్నాం. అయితే ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి షాక్ ఇచ్చాడు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో మేర్లపాక అనే గ్రామం వద్ద ఓ యువకుడు ఆర్డినరీ బస్సు ఎక్కాడు. తిరుపతికి టికెట్ తీసుకున్నారని తెలిసింది.
బస్సులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఆ యువకుడు బస్సులో చివరికి వెళ్లి కూచున్నాడు. ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం బస్సులో అతను ఉరి వేసుకున్నట్టు రేణిగుంట పోలీసులు అంటున్నారు. రేణిగుంట సమీపంలో యువకుడు ఉరి వేసుకున్న విషయాన్ని కండక్టర్ గుర్తించి, డ్రైవర్‌కు చెప్పాడు. అనంతరం ఈ సమాచాన్ని రేణిగుంట పోలీసులకు చేరవేశారు.
పోలీసులు బస్సు వద్దకెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేణిగుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఇంతకూ ఎవరితను అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది.
Call boy works 7997531004
Call boy jobs available 7997531004