నెరవేరని సత్యదేవ్ ఆశలు

ఓటిటి, థియేటర్ రెండు మార్కెట్లలో కాస్త పట్టు సంపాదించిన హీరోలకే ఆఫర్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్లే గెలుపు గుర్రాలు. వాళ్ల మీదే నిర్మాతలు పందెం కాయడానికి రెడీ అవుతారు. ఓటిటి అన్నది ఏదో…

ఓటిటి, థియేటర్ రెండు మార్కెట్లలో కాస్త పట్టు సంపాదించిన హీరోలకే ఆఫర్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్లే గెలుపు గుర్రాలు. వాళ్ల మీదే నిర్మాతలు పందెం కాయడానికి రెడీ అవుతారు. ఓటిటి అన్నది ఏదో కిందా మీదా పడితే అయిపోతుంది. ఒక సినిమాకు కోటి వస్తుంది. మరో సినిమా పది కోట్లు వస్తాయి. కానీ ఇప్పుడు థియేటర్ ఓపెనింగ్, థియేటర్ బిజినెస్ కీలకంగా వుంటోంది. అందుకే హీరో సత్యదేవ్ ఓపెన్ గానే అన్నారు. ఓటిటిలో ఆడితే ఎవరికి కావాలి. అది పూజకు పనికి రాని పువ్వు అని.

తన సినిమాకు థియేటర్ మార్కెట్ వుంది అనిపించుకోవాలని చాలా కష్టపడ్డారు సత్యదేవ్ ఈసారి. తను చేసి జీబ్రా సినిమాకు విపరీతంగా పబ్లిసిటీ చేసారు. బాగా అంటే బాగా కష్టపడ్డారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. సరైన్ టైమ్ కాకపోవచ్చు, టైటిల్ వల్ల కావచ్చు. మరెందు వల్లనైనా కావచ్చు.

తొలి రోజు నూన్ షో కి పట్టుమని పది శాతం ఓపెనింగ్ రాలేదు. రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. తరువాత పికప్ అవుతుంది అనుకుంటే ఓన్లీ హైదరాబాద్ సిటీలో కొంత వరకు ఇంప్రూవ్ మెంట్ కనిపించింది తప్ప ఇంకెక్కడా కనిపించలేదు. షో కి పది వేలు, ఇరవై వేలు, కొన్ని చోట్ల అయితే మరీ అయిదు వేలు వంతున కనిపించాయి కలెక్షన్లు.

మొదటి రోజు కన్నా రెండోరోజు, ఆ తరవాత మూడో రోజు బాగుందని, ఆరేడు కోట్లు గ్రాస్ అని పోస్టర్ వేయడం సంగతి అలా వుంచితే కింద సెంటర్లలో ఎక్కడా కలెక్షన్లు పెరగడం కనిపించలేదు. నైజాంలో మొదటి మూడు రోజులు కోటి లోపు మాత్రమే వసూళ్లు అని బిజినెస్ వర్గాల బోగట్టా. మరో మంచి సినిమాతో సత్యదేవ్ తన థియేటర్ కలెక్షన్ల కోరిక తీర్చుకోవాల్సి వుంది.

7 Replies to “నెరవేరని సత్యదేవ్ ఆశలు”

  1. సత్యదేవ్ చిరంజీవి రేంజ్ యాక్టింగ్ ట్రై చేస్తాడు..దానికి ఎలాగూ చిరంజీవి ఉన్నాడుగా..

    ముందు తన రేంజ్ సినిమాలు చేసుకుంటూ స్లో గా ఎదగాలి..

      1. After OTT, there is no room for small players in theaters, the small heroes better focus on OTT style movies and mKe decent money than struggling to make big in theatrical movies. My honest opinion.

Comments are closed.