తాజాగా వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాయకుండా పక్షం రోజుల కిందటి ట్రంప్ గెలుపు గురించి రాస్తున్నాడేమిటి? అనుకోవచ్చు మీరు. పొరుగున ఉన్న మహారాష్ట్ర కంటె మనకు అమెరికాలో పరిణామాలే ముఖ్యం. ప్రపంచంలో ఏ దేశపు అధ్యక్షుడెవరో మనం పట్టించుకోము కానీ అమెరికా అధ్యక్షుడెవరు? అతను తన టీములో తీసుకునే సభ్యులెవరు? వారిలో ఇండియన్స్ ఉన్నారా? తెలుగు మూలాల వారున్నారా? ఇదే మన ఘోష. మన కంపెనీలు అమెరికా కంపెనీల ఔట్‌సోర్సింగ్‌పై, కాంట్రాక్టులపై ఆధారపడి ఉన్నాయి. మన జీవితాలు అమెరికాతో ముడిపడి ఉన్నాయి. మన పిల్లలు అక్కడున్నారు. వాళ్లు పంపే డాలర్లతోనే యిక్కడి రియల్ ఎస్టేటు ధరలు పెరుగుతున్నాయి, విరుగుతున్నాయి. వాళ్ల ఉద్యోగాల గురించిన వర్రీతోనే మన బిపి పెరుగుతోంది, తరుగుతోంది. చో రామస్వామి ఓ సారి జోక్ చేశారు – ‘అమెరికాలో పిల్లో, పిల్లాడో ఉంటేనే చెన్నయ్‌లో ఉండడానికి మనకు హక్కు ఏర్పడుతుంది’ అని. అమెరికాతో సంపర్కం లేని తెలుగు కుటుంబాన్ని చూసి విస్తు పోయే పరిస్థితి వచ్చింది.
అందుకని అమెరికా ఎన్నికలు మనకు అత్యంత ముఖ్యమై పోయాయి. అభ్యర్థుల ఆర్థిక విధానాలేమిటి? దేశప్రజల కోసం వాళ్లు ఏం చేస్తామంటున్నారు? ఇలాటివేవీ మనకు పట్టవు. మనవాళ్లను రానిస్తాడా, లేదా? వచ్చాక గడువు ముగిసినా ఉండనిస్తాడా, లేదా? పౌరసత్వం, అధమంగా గ్రీన్ కార్డ్ ఎన్నాళ్లలో వచ్చేట్లు చేస్తాడు? ఇదే గోల. ట్రంప్ గెలిచాడనగానే అది మనకు లాభమా? నష్టమా? ఎంత శాతము? అనే లెక్కలే పేపర్ల నిండా. తమ అభ్యర్థి భారత్‌కు ఏ మేరకు మేలు చేస్తాడు అనే విషయాన్ని అమెరికన్ ఓటరు పరిగణనలోకి తీసుకోడు కదా. తన బాగు కోసం, తన భవిష్యత్తు కోసం, తన పిల్లల భావి కోసం ఎవరు ఉపయోగపడతారా అని లెక్కలు వేస్తాడు. అది గ్రహించకుండా వాళ్లు ఎవరికి ఓటేయాలో మనం యిక్కణ్నుంచి సలహాలు యిచ్చేస్తే ఎలా?
భారత్‌కు మేలు చేసేవాళ్లు గెలవాలని కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ మేలు అంటే ఏమిటి? మన ఉత్పత్తులు అక్కడ అమ్ముకునేందుకు సాధ్యమైనన్ని రాయితీలు యివ్వడం, పాకిస్తాన్‌ను కట్టడి చేయడం, కశ్మీర్ లాటి విషయాల్లో మనకు మద్దతు నివ్వడం, యితర దేశాలతో మనం ఫలానా విధంగా వ్యవహరించాలని ఒత్తిడి తేకుండా ఉండడం…. యిలాటివైతే అర్థం చేసుకోవచ్చు. కానీ మనల్ని అక్కడకి దూరనిస్తాడా, లేదా, తిష్ట వేయనిస్తాడా లేదా? అన్న విషయంపైనే మన ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాలలో మరీ ఎక్కువ. ఎందుకంటే అమెరికాలో చదువుతున్న విదేశీ భారత విద్యార్థుల్లో 56% మంది తెలుగు వారేట. వీరంతా విద్య గురించే వెళుతున్నారని సరస్వతీ దేవి దిగి వచ్చి చెప్పినా ఎవరూ నమ్మరు. చదువు పేరుతో చాకిరీ చేయడానికే వెళుతున్నారనేది బహిరంగ సత్యం. వీళ్ల దగ్గర్నుంచి సాధ్యమైనంత నొల్లుకుందామని అక్కడ యూనివర్శిటీలు వీళ్లని రానిస్తున్నాయి.
మనల్ని అక్కడ బిచాణా వేయనియ్యాలనే ఆశతో అక్కడి రాజకీయ నాయకులలో భారత మూలాల వారెవరున్నారా అని మనం తెగ వెతికేస్తూ ఉంటాం. వాళ్ల పూర్వీకులు గోదావరి వారట, కృష్ణా వారట, నిజామాబాద్ వారట అని పేపర్లో చదివి మురిసిపోతూ ఉంటాం. భారతీయ మూలాలున్నంత మాత్రాన భారత్ నుంచి వలసలని ప్రోత్సహిస్తారని అనుకోవడం అవివేకమని రిషి సునాక్ నిరూపించాక కూడా యిలా అనుకోవడం అమాయకత్వానికి పరాకాష్ఠ. ట్రంప్ బైడెన్‌ని చితక్కొట్టేస్తాడని భయపడుతున్న రోజుల్లో హఠాత్తుగా కమలా హేరిస్ తెరపైకి రావడంతో మన వాళ్లలో జోష్ వచ్చేసింది. కమలా గెలుపు తథ్యం, ఆమె రేటింగ్ పైపైకి వెళ్లిపోతోంది అని యిక్కడ గంతులు వేసేశారు, టీవీల్లో.
ఎందుకట? ఆవిడ మూలాలు తమిళనాడులో ఉన్నాయట. వాళ్ల మేనమామ పిల్లల ఫోటోలు యివిగో అంటూ మనకు వార్చారు. ఆవిణ్నడిగితే ‘సో వాట్?’ అంటుంది. ఆవిడ తన భారతీయ వారసత్వాన్ని ఎక్కడా చెప్పుకోలేదు. ఎంతసేపు చూసినా ఆఫ్రో-అమెరికన్, బ్లాక్ వారసత్వం గురించే చెప్పుకుంది. సహజమే కదా. కరుణానిధి కుటుంబానికి తెలుగు మూలాలున్నా, తమిళ రాజకీయ వేదికలపై అదేమీ ఘనంగా చాటుకోరు కదా. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినపుడు ‘నేను తెలంగాణ కోడల్ని. ఇక్కడి దాన్నే, అవసరమైతే ఆంధ్రతో కొట్లాడుతా’ అందిగా. నాయకులన్నాక ఏ రోటి దగ్గర ఆ పాట పాడకపోతే ఎలా? పైగా మనం గట్టిగా గుర్తు పెట్టుకోవలసినది – మనుష్యులు వర్తమానం గురించే ఆలోచిస్తారు, భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తారు తప్ప గతంలో బతకరు. ఇండియా అనేది వారికి దాటి వచ్చేసిన రేవు.
అమెరికాలో గ్రీన్ కార్డు, పౌరసత్వం రాని వాళ్లు అమెరికా ప్రభుత్వం భారతీయ వలసదారులపై ఉదారంగా ఉండాలని ఆశిస్తారు తప్ప అవి వచ్చేసినవాళ్లు కఠినంగా ఉండాలనే అనుకుంటారు, అంటారు. రైల్వే కంపార్టుమెంటులోకి తాము ఎలాగూ దూరిపోయాం. ఇకపై వచ్చేవాళ్లని అడ్డుకోవాలి అనే అనుకుంటారు. ‘అడ్డుకోకపోతే వాళ్లు తమ పిల్లలతో పోటీ పడి, అవకాశాలు తన్నుకుపోతారు. స్థానికులైతే చాలామంది చదువు పట్ల పెద్దగా శ్రద్ధ చూపరు కాబట్టి, వారికి కుటుంబం సపోర్టు ఉండదు కాబట్టి, వారితో పోటీలో ఎలాగోలా నెగ్గుకు రావచ్చు. అమ్మానాన్న చేత నూరబడి, ఫైనాన్స్ చేయబడి, ఏటేటా దిగుమతి అయ్యే ఇండియన్ స్టూడెంట్స్‌తో పోటీ పడాలంటే మన వాళ్ల వలన అవుతుందో లేదో, అందువలన ఏకంగా రాకూడదని చట్టం తెప్పించ్చేస్తే సరి’ అనే ఆలోచనే వీరిది. బ్రిటన్‌లో భారతీయుల్లో చాలామంది ‘బ్రెగ్జిట్’కు ఓటేశారని యిక్కడ గుర్తు చేసుకోవాలి.
ఇది తప్పు పట్టవలసిన అంశం ఏమీ కాదు. ఏ దేశస్తులైనా సరే, ఆ దేశపు బాగు కోరాలి. ‘దూసరోంకె జయ్‌సే పహ్‌లే ఖుద్‌కో జయ్ కరే’ అంటుంది ‘హమ్‌కో మన్‌కీ శక్తి దేనా’ పాట. అమెరికా విషయానికి వస్తే ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో అమెరికాకో జయ్ కరే అని పాడాల్సి వస్తుంది. ఎందుకంటే అదొక్కటే అగ్రరాజ్యం యిప్పుడు. ప్రపంచ దేశాలన్నిటిపై దాని ప్రభావం ఉంటోంది. రేదర్ ఉండేట్లా అది చూస్తోంది. దాని అండ లేకపోతే ఉక్రెయిన్ రష్యాతో పోరాడేదే కాదు. ఆ యుద్ధం యిన్నాళ్లు నడిచేదే కాదు. దాని కారణంగా యూరోప్‌తో సహా అనేక ఖండాల్లో సంక్షోభం కలిగేదే కాదు. అమెరికా మద్దతు లేకపోతే ఇజ్రాయెల్ గాజాలో యిన్నాళ్ల భీకరయుద్ధం చేసేదే కాదు, ఇరాన్‌పై విరుచుకు పడేదే కాదు.
అమెరికా ఆర్థికంగా బలంగా ఉంటే, తక్కిన దేశాల్లో కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. ట్రంప్ నెగ్గాడనగానే మార్కెట్లో ఆశలు ఉవ్వెత్తున ఎగిశాయి. డాలర్ రేటు పెరిగింది. మన దగ్గర బంగారం రేటు పడింది. మరి ఏ యితర దేశంలో ఎన్నికలకూ యింతటి ప్రభావం ఉండదు. ఫ్రాన్సులో లెఫ్టిస్టులు వచ్చినా, జర్మనీలో రైటిస్టులు నెగ్గినా, జపాన్‌లో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం కూలినా.. మనకేమీ ఫరక్ పడదు. అమెరికా పాలకులు సవ్యమైన విధానాలు పాటిస్తే, ఆ దేశ పరిస్థితి మెరుగుపడితే లోకం సుభిక్షంగా ఉంటుంది. అందరూ హర్షిస్తారు. వాళ్లు అన్ని దేశాల వ్యవహారాల్లో తలదూర్చి, తంపులు పెట్టి, మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమోనన్న భయాందోళనలు కలిగించి, ఏ దేశంలో చూసినా శరణార్థులే కనబడేట్లా చేస్తే బాధ పడతారు.
అందువలన అమెరికాకు ఎవరు అధ్యక్షుడిగా వచ్చినా, మన వాళ్లను వచ్చి చిన్నాచితకా పనులు చేసుకోనిస్తాడా అనే విషయం ఆలోచించడం మానేసి, అమెరికా ప్రజలకు మేలు చేస్తాడా లేదా, దాని ఆర్థికస్థితి మెరుగు పరుస్తాడా లేదా అనేది అమెరికన్ ఓటరే కాదు, మనమూ పరిగణించాలి. అమెరికా సంక్షోభంలో ఎందుకు ఉంది? మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మాగా) నినాదం ఎందుకు యివ్వాల్సి వచ్చింది? ఎగైన్ అనడంలోనే గతకాలపు ఘనత వర్తమానంలో కానరావటం లేదు, భవిష్యత్తులో దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అనే ఒప్పుకోలు స్పష్టంగా తెలుస్తోంది. గతపు ఘనత ఎందుకు ఆవిరైంది? అనేది పరిశీలించాలి.
అమెరికాకు మొదట్నించీ అనేక అడ్వాంటేజిలున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలూ దాని గడ్డపై జరగలేదు కానీ అది విజేతగా నిలిచి లాభాలు పొందింది. ఆ యుద్ధాల వలన యూరోప్ దేశాలు నాశనమై, అమెరికాకు తోకల్లా మారాల్సి వచ్చింది. కొంతకాలం పాటు రష్యా దానికి పోటీగా ఉంది కానీ స్వీయ తప్పిదాలతో రష్యన్ సమాఖ్య కుప్పకూలి, చీలికలు వాలికలైంది. ఏక ధృవ ప్రపంచం ఏర్పడి, ఆ ధృవం అమెరికాగా మారిపోయింది.
ఇదే సమయమనుకుని అమెరికా గ్లోబలైజేషన్ పల్లవి ఎత్తుకుంది. అప్పటిదాకా అనేక దేశాలు దిగుమతుల విషయంలో రక్షణవాదాన్ని అవలంబించేవి. స్థానికంగా ఉత్పత్తి చేయగలిగిన వస్తువులను స్థానిక ఉత్పత్తిదారులకే కేటాయించి, తమ దేశంలో దొరకని వాటిని మాత్రమే దిగుమతి చేసుకోనిచ్చేవారు. అప్పుడైనా దిగుమతి సుంకాలు భారీగా విధించి, ‘ఫారిన్’ వస్తువులంటే అమ్మో మన వలన కానివి అని మధ్యతరగతి వాళ్ల చేత అనిపించేవాళ్లు. ఈ పద్ధతి పోవాలని, ఏ దేశమైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ అడ్డంకులు లేకుండా అమ్ముకునే వెసులుబాటు ఉండాలని, ఒక దేశపౌరులు యితర దేశాలకు వెళ్లడానికి నిబంధనలు పెద్దగా అక్కరలేదని, అమెరికా యితర దేశాలపై విపరీతంగా ఒత్తిడి చేసి, ఒప్పించింది. గ్లోబలైజేషన్ అసలు ఉద్దేశం, తన ఉత్పాదనలను ఏ అంక్షలు లేకుండా యితర దేశాల్లో అమ్ముకోవాలని, తమ పౌరులు ఎక్కడికైనా హాయిగా వెళ్లి ప్రకాశించాలని!
అయితే పాతికేళ్లు గడిచాక సమీక్షించుకుంటే, దీనివలన ఆమెరికా, యూరోప్ దేశాలు వెనకబడ్డాయి, ఆసియన్ దేశాలు లాభపడ్డాయి. అందరి కంటె ఎక్కువ లబ్ధి చేకూరింది చైనాకు. అది ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా అవతరించింది. దక్షిణా కొరియా వంటి దేశాలూ విపరీతంగా ఎదిగాయి. ఐటీ రంగంలో చవకగా సేవలందించి ఇండియా, యితర ఆసియన్ దేశాలు లాభపడ్డాయి. అమెరికాలో స్థానికంగా వస్తూత్పత్తి తగ్గిపోయింది. అమెరికన్ మార్కెట్లన్నీ చైనా సరుకులతో నిండిపోయాయి. స్థానిక అమెరికన్ల కన్న చౌకగా సేవలందించడానికి ఆసియా దేశవాసులు వెల్లువలా వచ్చి పడ్డారు. దీనితో అమెరికన్ వ్యాపారస్తులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ లబోదిబో మంటున్నారు. బయటి వాళ్ల పోటీ తట్టుకోవాలంటే మనం రక్షణవాదం అవలంబించాల్సిందే అంటూ రైతుల దగ్గర్నుంచి అందరూ అనసాగారు.
నిజానికి చైనాతో వారికి గట్టు తగాదా ఏమీ లేదు. వారి దేశంలో చైనా ఎన్నో పెట్టుబడులు పెట్టింది కూడా. కానీ చైనా అంటే అమెరికా వాళ్లు పళ్లు నూరుకునే స్థితి వచ్చిందంటే గ్లోబలైజేషన్ విషయంలో అమెరికన్ల అంచనాలు తిరగబడడమే! ఈ ఆర్థిక విధానాల అస్తవ్యస్తత ఒక్కటే అయితే అమెరికాకు మరీ అంత యిబ్బంది ఉండేది కాదు. ఎలాగోలా సర్దుకునేది. అసలు సమస్యంతా ఆధిపత్య ధోరణితో వచ్చింది. ప్రపంచమంతా తను అనుకున్న రీతిలో నడవాలనే కాంక్షతో సకల దేశాల వ్యవహారాలలో వేలు పెట్టడమూ, తమ మాట విన్న దేశాలకు ఆర్థికంగా సహాయం చేయడమూ, వినని దేశాలను దండించడానికి ఖర్చు పెట్టడమూ యిలాటివి చేసి అమెరికా అవతలి దేశాల వాళ్లనే కాదు, తన ప్రజలను కూడా కష్టాల పాలు చేసింది.
రష్యాలో యిదే జరిగింది. ఇతర దేశాలలో కమ్యూనిజం వ్యాప్తి చేస్తున్నానంటూ, కాపిటలిస్టు కేంద్రమైన అమెరికా పీచమణుస్తున్నానంటూ డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టి, దేశపౌరులను రొట్టె ముక్క కోసం మైలు పొడుగు క్యూలో నిలబడేట్లు చేశారు. దాంతో వాళ్లు తిరగబడ్డారు. అమెరికాలో ఆ పరిస్థితి ప్రస్తుతానికి రాకపోవడానికి కారణం, డాలరు చుట్టూ ప్రపంచం తిరగడం! కానీ ప్రజల్లో అసహనమైతే పెరుగుతోంది. ఒకప్పుడు మనం దర్జాగా బతికాం, యిప్పుడు ధరల తాకిడికి తట్టుకోలేక విలవిల లాడుతున్నాం అని మండిపడుతున్నారు. దీన్నే ట్రంప్ వాడుకుంటున్నాడు. అమెరికాకు గతకాలపు ఘనతను తిరిగి తెస్తాను అంటూ!
పూర్వమున్న ఘనత ఎందుకు పోయింది అనేది అతను విపులంగా చెప్పడు. చెప్పాలంటే తన పార్టీ పాత నాయకులతో సహా, అమెరికన్ ప్రజల అలసత్వాన్ని కూడా నిందించాలి. అందుకని ఆ పని పెట్టుకోకుండా, ఓటర్లు సులభంగా గుర్తించడానికి వీలుగా లోకల్‌గా ఒక శత్రువుని, బయట ఒక శత్రువుని చూపించాడు. లోకల్ శత్రువు ‘వలసదారుడు’, బయటి శత్రువు చైనా! నిజానికి యీ వలసదారుడి వలననే అమెరికాకు యీ గతి పట్టిందని ట్రంప్ నిరూపించ లేడు. కానీ ‘వీడే నీ సర్వానర్థాలకు కారణం!’ అని ఎత్తి చూపించడానికి వాడు దొరికాడు. ‘వీడు పోతే చాలు, మీకు ఉద్యోగాలే ఉద్యోగాలు, చేతినిండా డబ్బే డబ్బు’ అని ఓటర్లను ఊరించాడు. నిజంగా యీ వలసదారులు వెళ్లిపోయే రోజు వచ్చినా, స్థానికులు ఆ జీతానికి ఆ పని చేయడానికి సిద్ధపడతారా? వలసదారుడికి పైసల్లో జీతం యిచ్చి పని చేయించుకుంటున్న అమెరికన్ యజమాని, వాడి స్థానంలో వచ్చిన అమెరికన్‌కు రూపాయల్లో జీతం యివ్వడానికి సిద్ధపడతాడా? అనేది కూడా ప్రశ్నే.
వలసదారులను ఆపి వేస్తే అమెరికన్ వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని చదివాను. అమెరికన్ వ్యవస్థ బాగుపడడానికి, గత ఘనతలో కాస్తయినా తిరిగి తెచ్చుకోవడానికి వలసదారుల తరిమివేత అనేది పెద్ద అంశం కానే కాదు. అమెరికన్ తన విదేశీ విధానాలను, ఆర్థిక విధానాలను సమీక్షించుకోవాలి. మార్పులు చేసుకోవాలి. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడైనప్పుడు నాటోకు నిధులు ఆపేస్తానని, యితర దేశాల తరఫున యుద్ధాలకు దిగి, అమెరికన్ ధనాన్ని, యువతను బలి చేయనని చాలా చెప్పాడు. కానీ అమెరికాలో ‘డీప్ స్టేట్’ (పాతుకు పోయిన వ్యవస్థ) చాలా గట్టిది. అది విధానాలను ఒక పట్టాన మారనీయదు. ప్రజాస్వామ్యం ప్రవచించే అమెరికా వియత్నాంలో యుద్ధానికి దిగడాన్ని అందరూ తప్పు పట్టారు. అమెరికన్ యువత తిరగబడింది. అయినా యుద్ధం దశాబ్దాల పాటు కొనసాగింది. అధ్యక్షుడు రిపబ్లికన్ అయినా, డెమోక్రాట్ (ఉదారవాదిగా పేరు బడిన జాన్ కెనెడీ కూడా వారిలో ఉన్నాడు) అయినా విధానం మారలేదు. అంత బలమైనది డీప్ స్టేట్!
ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు హితవు చెప్పి యుద్ధం మాన్పిస్తానంటున్నాడు. అదే జరిగితే యావత్ ప్రపంచం హమ్మయ్య అనుకుంటుంది. ఎందుకంటే ఆ యుద్ధం వలన ప్రపంచమంతా సంక్షోభానికి గురై, అన్ని దేశాల్లో ధరలు పెరిగాయి. గాజా యుద్ధం విషయంలో ట్రంప్ నెతన్యాహూకి ‘నువ్వేం చేస్తావో తెలియదు కానీ, నేను అధికారం చేపట్టేలోగా నువ్వు యుద్ధానికి స్వస్తి పలకాలి.’ అని చెప్పాడట. ఎవడు గెలిచినా, ఎవడు ఓడినా, మధ్యలో పౌరులు సర్వం కోల్పోతున్నారు. వారి కోసమేనా యుద్ధం ఆగాలి. ట్రంప్ యివన్నీ చేయగలడా లేదా అన్నది కాలమే చెప్తుంది. కునారిల్లిన ప్రస్తుత ఆర్థిక స్థితితో నడుం విరిగిన సాధారణ అమెరికన్ ఓటరుకి యివేమీ పట్టవు. వాడికి కావలసినది ధరలు అందుబాటులోకి రావడం, చేతికి పని దొరకడం. వాడు హుందాగా తలెత్తుకుని బతకగలిగితే చాలు వాడి దృష్టిలో అమెరికా మళ్లీ గొప్ప దేశం అయిపోయినట్లే. ట్రంప్ యీ పాయింటే పట్టుకుని ఆ పని చేయడానికి తనే సమర్థుణ్నని వాణ్ని ఒప్పించాడు.
వ్యక్తిగతంగా చూస్తే ట్రంప్ దురహంకారి, సభ్యత, మర్యా ఎరగనివాడు, వాచాలుడు, కాముకుడు, స్త్రీల పట్ల చులకన కలవాడు, ఓటమి తర్వాత పార్లమెంటు భవనంపై తన మనుష్యులను ఉసి గొల్పిన హింసావాది, నియమాలను తుంగలోకి తొక్కి అఫీషియల్ డాక్యుమెంట్లను తన యింటికి తీసుకుని పోయిన దుర్నీతిపరుడు, ఎన్నో కేసులు ఎదుర్కుంటున్నవాడు.. యిలా ఎన్నయినా చెప్పవచ్చు. బలమైన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే అమెరికాలో ప్రజలు అలాటి వాణ్ని మళ్లీ ఎలా గెలిపించారని ఆశ్చర్యపడే వాళ్లకు నేను చెప్పదలచినది – ట్రంప్ గెలిచాడని అనడం కన్నా ట్రంపిజం గెలిచిందని అనడం సబబు. మధ్య తరగతి ప్రజలు కూడా ట్రంప్‌కు ఓటేయడానికి అభద్రతా భావమే కారణం. నిజానికి మెక్సికో నుంచి అక్రమంగా వలస వచ్చి, చిల్లర పనులు చేసుకునే వారిని చూసి వారు దడవటం లేదు. ఆ పనులు చేయడానికి వాళ్లెలాగూ సిద్ధంగా లేరు. వారి బాధంతా వైట్ కాలర్ ఉద్యోగాలు మాయం కావడం గురించే!
అమెరికన్ కంపెనీలు అమెరికాలోనే ఆఫీసులు నడుపుతూ, హెచ్చు జీతాలపై అమెరికన్లను నియమించుకునే బదులు, ఆసియన్ దేశాలకు ఆఫీసులను తరలిస్తున్నారు. కాంట్రాక్టులు ఆసియన్ కంపెనీలకు యిచ్చి పని చేయించు కుంటున్నారు. తాము నేరుగా ఆసియన్లను ఉద్యోగులుగా నియమించు కోకపోయినా, తమతో ఒప్పందం కుదుర్చుకున్న ఆసియన్ కంపెనీలు తమ దేశాల నుండి ఉద్యోగులను అమెరికాకు తెచ్చుకుని పని చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ విధంగా తమ ఖర్చులు తగ్గించుకుని, లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విధానానికి అనుగుణంగా ప్రభుత్వ నియమాలు ఉండేట్లు పాలకులపై ఒత్తిడి తెస్తున్నారు. ‘వీసా నిబంధనలను కఠినతరం చేసి, విదేశీయుల రాకను కట్టడి చేస్తాం’ అని పైకి ఏ పార్టీ ప్రకటించినా, అంతిమంగా నిధుల కోసం కార్పోరేట్లు చెప్పినట్లు ఆడుతోంది.
ఇది కార్పోరేట్లకు బాగుంది, నాయకులకూ బాగుంది. కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే సగటు అమెరికన్లకు మంటగా ఉంది. ‘తక్కువ ధరకు ప్రత్యామ్నాయం కళ్లెదురుగా ఉండడం వలన కార్పోరేట్లు తమను చేరదీయటం లేదు, ఆ ప్రత్యామ్నాయమే లేకుండా చేస్తే దిక్కు లేక తమనే పెట్టుకుంటారు కదా’ అనే ఆలోచన వారిది. మంచి ఉద్యోగాల మాట అలా వుండగా హోటళ్లలో, మోటళ్లలో, సూపర్ మార్కెట్‌లో చేసే ఉద్యోగాలకు కూడా విపరీతంగా పోటీ వచ్చి పడింది, విదేశీ విద్యార్థుల రూపంతో. వీళ్లంతా చదువు పేర తమ దేశంలోకి ప్రవేశించి, చదువు సంగతి పక్కన పెట్టి, స్వదేశీయులు నడిపే దుకాణాల్లో సగం రేటుకి పని చేస్తున్నారు. అలా చేయడం చట్టవిరుద్ధమని అందరికీ తెలుసు కానీ పని చేయించుకునే దుకాణదారు కూడా ఫిర్యాదు చేయడు కాబట్టి నడిచిపోతోంది. ఆ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే, ఆ దుకాణదారు వేరే దిక్కు లేక ఫుల్ రేటు యిచ్చి తమను పెట్టుకుంటాడు కదా! తమకు భుక్తి దొరుకుతుంది కదా! – ఇదీ వారి ఆలోచన.
ఇలాటి చట్టవిరుద్ధమైన పనులను ఆపడం, అక్రమ వలసదారులను వల వేసి పట్టడం, బృహత్ప్రయత్నం. ఏ ప్రభుత్వయంత్రాంగమైనా సరే సమర్థవంతంగా యీ పని చేస్తుందని వాళ్లకు నమ్మకం లేదు. కానీ ట్రంప్ వస్తే ఆ యంత్రాంగం ఏటిట్యూడ్‌లో మార్పు వస్తుందని వారికి తెలుసు. అమెరికాలో ఇండియన్ల వీసా వ్యవహారాలు చూసే కన్సల్టెంటు ఒకాయన చేసిన వీడియో చూశాను. కాగితం మీద రూల్సు ఎలా ఉన్నా, ట్రంప్ జమానాలో ఇండియన్ వలసదారుల పట్ల, విద్యార్థుల పట్ల ప్రతికూల వాతావరణం ఉండేదిట. కారణం చెప్పకుండా అప్లికేషన్ తిరస్కరించడం, కాలపరిమితిని కుదించడం, సంబంధం లేని ప్రశ్నలడిగి నిర్ణయం వాయిదా వేయడం… యిలా చాలా టెక్నిక్కులు వాడారట అప్పటి అధికారులు. పొమ్మని నోటితో చెప్పలేకపోయినా, యిలా పొగ పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసి, కనీసం కొత్తవాళ్లు రాకుండా చేసినా చాలు, సగటు అమెరికన్‌కు!
అందుకే అతను ట్రంపిజానికి ఓటేశాడు. నాలుగేళ్ల క్రితం 46.8% ఓట్లు, 232 సీట్లు తెచ్చుకున్న ట్రంప్ యీసారి 50% ఓట్లు, 312 సీట్లు తెచ్చుకోగలిగాడు. ఒక విడత విరామం తర్వాత మళ్లీ అధ్యక్షుడు కావడం 130 ఏళ్ల తర్వాత జరిగింది. డెమోక్రాట్ అభ్యర్థిగా బైడెన్ ఉన్నపుడు ట్రంప్ గెలిచేవాడేమో కానీ, బైడెన్ స్థానంలో కమల వచ్చిన తర్వాత ఆమె దూసుకుపోసాగింది, ఒకవేళ ట్రంప్ గెలిచినా బొటాబొటీగా గెలుస్తాడు అనే అంచనాలు తారుమారు చేస్తూ ట్రంప్ భారీ వ్యత్యాసంతో గెలిచాడు. ట్రంప్ పునరాగమనాన్ని డెమోక్రాటిక్ పార్టీ ఎందుకు అడ్డుకోలేక పోయింది? వారి ఓటమికి ప్రధాన కారణమైన ఎకానమీని ఎందుకు సమర్థవంతంగా నిర్వహించలేక పోయింది? అనే విషయాలను ‘‘డెమోక్రాట్ల వైఫల్యం’’ అనే వ్యాసంలో చర్చిస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2024)
మనోడు కూడా అంతే కదా..
నాలుగ్గోడలమధ్య ఒక మతం..
బయట ఒక మతం..
మనోడి పేరు వెనకాల ఉన్న తోకని వెనకేసుకురావటం నీ అభిమతం..
Nice article…
ఈ వ్యాసం చాలా వరకూ బాగానే ఉంది కానీ – ఒక విషయంలో నేను విభేదిస్తున్నాను.
“నిజానికి మెక్సికో నుంచి అక్రమంగా వలస వచ్చి, చిల్లర పనులు చేసుకునే వారిని చూసి వారు దడవటం లేదు. ఆ పనులు చేయడానికి వాళ్లెలాగూ సిద్ధంగా లేరు. వారి బాధంతా వైట్ కాలర్ ఉద్యోగాలు మాయం కావడం గురించే!”
ఈ పాయింట్ నిజం కాదు. ఇక్కడ అక్రమంగా ఈ దేశంలో జొరబడిన చీప్ లేబర్ అనేది బ్లూ కాలర్ వర్కర్స్‌ని చాలా ఇబ్బందులపాలు చేస్తోంది. ట్రంప్‌కి ప్రధానమైన సపోర్ట్ ఈ బ్లూ కాలర్ వర్కర్స్ నుంచే వస్తోంది. ఈ చీప్ లేబర్ మూలంగా వస్తువులు చవకగా అందిస్తున్నారు అనేది కూడా నిజం కాదు. ఒక ఉదాహరణగా ఇక్కడ అమెరికన్ రెస్టారెంట్స్‌లో పనిచేసే అమెరికన్ స్టూడెంట్స్ కస్టమర్స్ ఇచ్చిన టిప్స్ తామే తీసుకుంటారు. అదే మనవాళ్లు నడిపే ఇండియన్న్ రెస్టారెంట్స్‌లో టిప్స్ ఓనర్సే తీసుకుంటారు. కానీ ఇండియన్న్ రెస్టారెంట్స్‌లో ధరలు ఏమాత్రం తక్కువగా ఉండవు. అలాగే ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ వల్ల ఇక్కడ జాబ్స్ దొరకనివారు ఉండరు ఎందుకంటే అమెరికన్స్‌లో ఐటీలోకి వచ్చేవారు స్వల్పంగానే ఉంటారు, వారిలో ఎక్కువమంది కొద్దిసంవత్సరాల్లోనే మేనేజ్‌మెంట్ జాబ్స్‌కి వెళ్ళిపోతారు. కానీ ఆ రంగంలో కూడా మనవాళ్లు నడిపే చిల్లర ఐటీ కెంపెనీలు తమ ఎంప్లాయీస్‌ని దారుణంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటారు.
చిన్న సవరణ అండి! ట్రంప్ గెలుచుకున్న 312 సంఖ్య సీట్లు కాదండి. ఎలక్టోరల్ ఓట్లు.
312 సీట్లు కా దు. ఎలక్టోరల్ ఓ ట్లు
సవరించుకుంటాను. థాంక్స్
Idi okay article…decent research chesi rasinade/leda tarjuma chesinde. Chala vishayalu koddi koddiga touch chesi vadilesaru…Here’re the issues:
End of the day, just brace for the impact!
ఒరే బాబూ, చెప్పదలుచుకుంది ఇంగ్లీష్‌లో రాయి, అది రాకపోతే తెలుగులో టైప్ కొట్టు. ఇలా తెలుగు అక్షరాలని ఇంగ్లీష్‌లో రాసి కొండవీటి చేంతాడంత పోస్ట్ పెడితే ఎవరూ చదవలేరు.
బాబూ, చెప్పదలుచుకుంది ఇంగ్లీష్‌లో రాయి, అది రాకపోతే తెలుగులో టైప్ కొట్టు. ఇలా తెలుగు అక్షరాలని ఇంగ్లీష్‌లో రాసి కొండ..వీటి చేంతాడంత పో..స్ట్ పెడితే ఎవరూ చదవలేరు.
Midi midi jnaanam to vraasina article
yes..i already raised one silly point without ground reality of US.
You discussed well about our attitudes towards our foreign obsession but please be aware that all the Americans are not white-collar job holders. Majority of them survive based on day to day earnings, illegals became a survival problem for these majority American citizens in terms daily wages.
If Trump does well there is a high chance that America will become the first country to automate everything using AI and robotic in the near future, that means that they don’t need any any labour in the form of immigrants.
It will be a wild ride in the west once AI and robotics are matured
> అమెరికాలో గ్రీన్ కార్డు, పౌరసత్వం రాని వాళ్లు అమెరికా ప్రభుత్వం భారతీయ వలసదారులపై ఉదారంగా ఉండాలని ఆశిస్తారు తప్ప అవి వచ్చేసినవాళ్లు కఠినంగా ఉండాలనే అనుకుంటారు, అంటారు.
Andaru ilaa vundaru prasad gaaru. Illegal immigration raakudadhu anukuntaru kaani, legal immigration endhuku vadhu anukuntaaru? Ekkuva mandi vaste, mana culture prajalu perguthaaru, manaku manchi native feeling vasthundi. Inkaa productivity peruguthundi, manam konna stocks and real estate ki demand peruguthundi. Anthaa win-win situation avuthundi.
“ట్రంప్ బైడెన్‌ని చితక్కొట్టేస్తాడని భయపడుతున్న రోజుల్లో హఠాత్తుగా కమలా హేరిస్ తెరపైకి రావడంతో మన వాళ్లలో జోష్ వచ్చేసింది”…
did you come to conclusion by watching telugu channels…lol..most indians did not like the choice of kamala. democrats are not good for legal immigrants as they give equal priority to illegal with legal and complicate simple solutions for political reasons..
జగన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ట్రంప్ చాలా సౌమ్యుడు , మంచివాడు , ఆర్థికంగా అంతంతమాత్రమే పాపం వాడి మీద లేని పోనీ గాలి వార్తలు పోగు చేసి అబద్దాలు రాస్తావా! ఇప్పుడు అసలే అదానీ గుట్టు వాని చేతిలో ఉంది ఆ తర్వాత పాలస్ పులకేశి కి ఉంది జింతాతా జిత జిత జింతతత
జగన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ట్రంప్ చాలా సౌమ్యుడు , మంచివాడు , ఆర్థికంగా అంతంతమాత్రమే పాపం వాడి మీద లే!ని పోనీ గాలి వార్తలు పోగు చేసి అబద్దాలు రాస్తావా! ఇప్పుడు అసలే అదానీ గుట్టు వాని చేతిలో ఉంది ఆ తర్వాత పాలస్ పులకేశి కి ఉంది జింతాతా జిత జిత జింతతత
vc available 9380537747
as usual even a mild criticism is removed. as if he is holy than rest of us.
Pativrata para puushuls gurunchi matlada kudadu…..
Call boy works 7997531004
Call boy jobs available 7997531004
Handy Guide for liberals:
Immigrants: Apply to move here through proper legal channels. Have a skill that can benefit the host country. Live peacefully and assimilate into host communities.
Refugees:Usually found fleeing war zones. Mostly women and children. Ask for temporary relocation to return home after the war.
Asylum scammers: Mostly military aged men from safe countries. Often had asylum claims rejected in another country. Often arrive on false documentation or destroy their passports mid-flight. Move from country to country searching for the best social welfare. Background checks impossible due to no Id or Fake Id.