యువి మళ్లీ మరో భారీ సినిమా

సాహో.. రాధేశ్వామ్ లాంటి భారీ సినిమాలు తీసిన యువి సంస్థ మళ్లీ మరోసారి భారీ సినిమానే తలకెత్తుకుంటోంది. సుమారు 200 నుంచి 250 కోట్ల బడ్జెట్ తో ఓ మెగా సినిమాను స్టార్ట్ చేసింది.…

సాహో.. రాధేశ్వామ్ లాంటి భారీ సినిమాలు తీసిన యువి సంస్థ మళ్లీ మరోసారి భారీ సినిమానే తలకెత్తుకుంటోంది. సుమారు 200 నుంచి 250 కోట్ల బడ్జెట్ తో ఓ మెగా సినిమాను స్టార్ట్ చేసింది. నిన్నటికి నిన్న పూజ చేసారు. పాటల రికార్డింగ్ తో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 

మెగా 156 గా తెరకెక్కే ఈ సినిమా మెగాస్టార్ చిరు కథానాయకుడిగా తయారవుతుందని కొత్తగా చెప్పనక్కరలేదు. అయితే అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ మీద ఈ పరిస్థితుల్లో 200 నుంచి 250 కోట్లు పెట్టుబడి పెట్టి రంగంలోకి దిగడానికి యువి సంస్థ సిద్దపడడం. పైగా ఈ సినిమా కూడా సాహో, రాధేశ్వామ్ ల మాదిరిగానే ఫుల్ సి జి వర్క్ తో కూడిన సినిమా కావడం.

సాహో, రాధేశ్యామ్ ఇచ్చిన షాక్ లతో యువి సంస్థ ఆర్థికంగా గట్టి దెబ్బలు తింది. అవన్నీ ఇప్పుడిప్పుడే సర్దుకున్నాయి. ఆదిపురుష్ పుణ్యమా అని కాస్త గట్టెక్కారు. ఇప్పుడు మళ్లీ అంత భారీ సినిమా తలకెత్తుకోవడం కాస్త ఆశ్చర్యమే మెగాస్టార్ చిరు గతంలో ఇంత భారీగా సైరా సినిమా తీసి దాదాపు నలభై కోట్లకు పైగా నష్టపోయారని వార్తలు వున్నాయి. ఇటీవల భోళాశంకర్ సినిమా గట్టి షాక్ ఇచ్చింది.

అందువల్ల ఈ మెగా 156 కు థియేటర్ ను మాత్రమే నమ్ముకోవడానికి లేదు. నాన్ థియేటర్ మీదనే 150 కోట్లకు పైగా రాబట్టాల్సి వుంటుంది. ఇదంతా యువి సంస్థ, బింబిసార తో సక్సెస్ కొట్టిన దర్శకుడు అనే దాని మీదెే ఆధారపడి వుంటుంది. 

మెగాస్టార్ అయినా కూడా ప్రస్తుతానికి అయితే ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేదు. 150వ సినిమా తరువాత నుంచి చూసుకుంటే వాల్తేర్ వీరయ్య ఒక్కటే హిట్ సినిమా అన్నది గమనించక తప్పదు.