లడ్డూ కావాలా: ఈవో అలా.. ఛైర్మన్ వచ్చాక ఇలా..

టీటీడీ ఈవో తీసుకున్న ఈ ఆలోచనారహితమైన నిర్ణయాన్ని బిఆర్ నాయుడు ఛైర్మన్ గా పాలకమండలి ఏర్పడిన తర్వాత ఇప్పుడు సరిదిద్దుతున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తులు స్వామివారి దర్శనం తరువాత.. అంతటి విలువైనదిగా భావించేది స్వామివారి లడ్డూ ప్రసాదం మాత్రమే. తిరుమలకు వచ్చిన భక్తులు తమ తమ స్థాయిని బట్టి.. లడ్డూలను తీసుకువెళ్లి తమ తమ గ్రామాల్లో బంధువులకు, మిత్రులకు ఇచ్చుకుంటారు. పుచ్చుకున్న ఎవరైనా సరే.. దర్శనభాగ్యం దక్కకపోయినా సరే.. ఆ లడ్డూనే తమకు దేవదేవుని కటాక్షంగా భావిస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదాల్ని తిరుమల వచ్చే భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వడానికి టీటీడీ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నది.

కొన్ని నెలల కిందట భక్తులకు లడ్డూలను ఆధార్ ఆధారిత రేషన్ విధానంలాగా ఇవ్వడానికి టీటీడీ ఇప్పుడు తమ ఆలోచన మార్చుకుంది. కోరినన్ని లడ్డూలు ఇవ్వడానికి తగ్గట్టుగా.. అదనంగా పోటులో సిబ్బందిని కూడా నియమించుకోవడానికి సిద్ధపడుతోంది. బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలకమండలి ఏర్పడిన తరువాత.. వచ్చిన మెరుగైన నిర్ణయాలలో ఇది కూడా ఒకటి.

తిరుమల శ్రీవారి పోటులో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరువేల పెద్ద లడ్డూ (కల్యాణం లడ్డూ)లు, 3500 వడలు తయారుచేస్తున్నారు. తిరుమలతో పాటు హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లో కూడా స్వామివారి ప్రసాదాన్ని విక్రయిస్తుంటారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక చిన్న లడ్డూ దక్కుతుంది. రోజువారీ స్వామిని దర్శించుకునే భక్తుల సగటు గణాంకాలు పరిశీలిస్తే.. 70 వేల లడ్డూల దాకా ఉచితంగానే ఇవ్వాల్సి వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అదనంగా తీసుకువెళ్లాలని కోరుకుంటారు గనుక.. లడ్డూలకు డిమాండ్ అధికంగా ఉంటుంది.

గతంలో భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చే ఏర్పాటు ఉండేది. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో లడ్డూ కౌంటర్లలోని ఉద్యోగులే- ఎవరైనా మరీ ఎక్కువ అడిగినప్పుడు కాస్త నియంత్రించి ఇచ్చేవారు. అంతా సాఫీగా సాగిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్త ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామల రావు ఒక ఇబ్బందికరమైన ఏర్పాటు చేశారు. భక్తులు అదనపు లడ్డూలు తీసుకోవడానికి ఆధార్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, ఆధార్ చూపించిన వారికి మాత్రమే ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో అంతా గందరగోళంగా తయారైంది.

టీటీడీ ఈవో తీసుకున్న ఈ ఆలోచనారహితమైన నిర్ణయాన్ని బిఆర్ నాయుడు ఛైర్మన్ గా పాలకమండలి ఏర్పడిన తర్వాత ఇప్పుడు సరిదిద్దుతున్నారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ తాజా నిర్ణయం పట్ల సర్వత్రా భక్తుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

22 Replies to “లడ్డూ కావాలా: ఈవో అలా.. ఛైర్మన్ వచ్చాక ఇలా..”

  1. @-కాకినాడ @-పోర్ట్@-వ్యవహారంలో @-సీఐడీ@-కేసు@-రెడీ @-అవుతుంది, @-సిగ్గు @-ఎగ్గు @-లేని @-జీవితాల @-మీద @-ఒక @-పది @-వండి @-వార్చే @-కథలు @-రెడీ @-చెయ్యి -@-ఎంకటి బ్రో..

  2. @-కాకినాడ @-పోర్ట్@-వ్యవహారంలో @-సీఐడీ@-కేసు@-రెడీ @-అవుతుంది, @-సిగ్గు @-ఎగ్గు @-లేని @-జీవితాల @-మీద @-ఒక @-పది @-వండి @-వార్చే @-కథలు @-రెడీ @-చెయ్యి -@-ఎంకటి @-బ్రో..

  3. @-కాకినాడ-@-పోర్ట్-@-వ్యవహారంలో-@-సీఐడీ@-కేసు@-రెడీ @-అవుతుంది, @-సిగ్గు @-ఎగ్గు @-లేని @-జీవితాల @-మీద @-ఒక @-పది @-వండి @-వార్చే @-కథలు @-రెడీ @-చెయ్యి -@-ఎంకటి బ్రో..

  4. @-కాకినాడ @-పోర్ట్@-వ్యవహారంలో @-సీఐడీ@-కేసు@-రెడీ @-అవుతుంది-@-సిగ్గు-@-ఎగ్గు-@–లేని-@-జీవితాల-@-మీద-@-ఒక-@-పది-@-వండి-@-వార్చే-@-కథలు-@-రెడీ-@-చెయ్యి-@-ఎంకటి బ్రో..

  5. @-కాకినాడ-@-పోర్ట్-@-వ్యవహారంలో-@-సీఐడీ-@-కేసు@-@రెడీ @-అవుతుంది-@-సిగ్గు-@-ఎగ్గు-@–లేని-@-జీవితాల-@-మీద-@-ఒక-@-పది-@-వండి-@-వార్చే-@-కథలు-@-రెడీ-@-చెయ్యి-@-ఎంకటి బ్రో..

  6. కళ్యాణం లడ్డు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు మాకు, మేము కళ్యాణం చేయించినప్పుడు.ఇదివరలో కళ్యాణం చేయిస్తే ఒక పెద్ద లడ్డు,వడ,అప్పు ప్రసాదం గా ఇచ్చేవారు.మళ్ళీ అలా చేస్తే బాగుంటుంది.

Comments are closed.